ETV Bharat / science-and-technology

ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి? రోమన్ రాజు అసూయ వల్లేనా? - ఫిబ్రవరి నెల చరిత్ర

ఫిబ్రవరి అనగానే మనందరికి గుర్తొచ్చేది 28 రోజులు, లీప్ సంవత్సరం అయితే 29 రోజులు. ఫిబ్రవరిలోనే ఎందుకు తక్కువ రోజులు ఉంటాయి అనే సందేహం అందరిలో ఉంటుంది. చరిత్ర ప్రకారం చూసుకుంటే.. చాలా ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలను డిజైన్ చేశారు. అందరిని ఆలోచనలో పడేసే ఫిబ్రవరి నెలలో రోజులు తక్కువగా ఉండటానికి కారణాలెన్నో ఉన్నాయి. మరి అవేంటో మీకు తెలుసా?

why are there only 28 days in february
ఫిబ్రవరిలో 28 రోజులే ఎందుకు ఉంటాయి
author img

By

Published : Feb 19, 2023, 5:30 PM IST

Updated : Feb 20, 2023, 11:31 AM IST

ఫిబ్రవరి అంటేనే ఒక ప్రత్యేక నెల. రోజులు తక్కువ. లీప్ ఇయర్​లో ఒక రోజు ఎక్కువ. అదేంటబ్బా దీనికే ఇంత ప్రత్యేకత అని అందరికి అనిపిస్తుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా గ్రెగేరియన్ క్యాలెండర్​నే ఉపయోగిస్తుంది. అంతకు ముందు జూలియన్ క్యాలెండర్​ను ఉపయోగించేవారు. సంవత్సరాన్ని నెలలుగా విడగొట్టి పది నెలలను చేశారు రోమన్లు. ఆ 10నెలలను కాస్త 12 నెలలు చేసి ఫిబ్రవరి నెలకు ప్రత్యేక రోజులను జోడించారు. మరి దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం ప్రపంచం అంతా గ్రెగేరియన్ క్యాలెండర్​ను ఉపయోగిస్తుంది. గ్రెగేరియన్ క్యాలెండర్​కు ముందు జూలియన్ క్యాలెండర్​ను ఉపయోగించేవారు. తుర్కియేలో 1927 ముందు వరకు కూడా దీనిని ఉపయోగించేవారు. దీనికంటే ముందు రోమన్​ క్యాలెండర్​ ఉపయోగంలో ఉండేది. అయితే మొదట్లో సంవత్సరాన్ని లూనార్ సైకిల్ ఆధారంగా మార్చి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరాన్ని 10 నెలలుగా 29 లేదా 31 రోజులుగా విభజించారు.

అయితే రోమన్ రాజు నుమా పాంపిలియస్ పూర్తి సంవత్సరాన్ని(365 రోజులు) కవర్ చేయడానికి రెండు నెలలను అదనంగా చేర్చాడు. అవే జనవరి, ఫిబ్రవరి నెలలు. అయితే రోమన్లు సరిసంఖ్యలను చెడ్డరోజులుగా భావించేవారు. అందుకే ఎక్కువగా 29 లేదా 31రోజులను నెలలో ఉండేలా చూశారు. 12నెలలు అనేది సరిసంఖ్య. అయితే సంవత్సరంలో 365 రోజులను కవర్ చేయాలంటే పన్నెండు నెలలు తప్పనిసరిగా ఉండాలి. అందుకే ఫిబ్రవరి నెలను 28 రోజులు గల నెలగా అనుకున్నారు. రోమన్లు ఫిబ్రవరి నెలను ఎవరైనా చనిపోయిన వారికి గౌరవించే నెలగా అనుకున్నారు. అయితే తర్వాత వచ్చిన జూలియస్ సీజర్ క్యాలెండర్​ను సూర్యుడి కదలికల ఆధారంగా తయారు చేశాడు. కానీ ఎన్ని మార్పులు చేసినప్పటికీ ఫిబ్రవరి నెల మాత్రం 28 రోజులతోనే ప్రత్యేకంగా చేశారు.

శాక్రోబోస్కో సిద్ధాంతం
రోమన్‌ క్యాలెండర్‌, జూలియస్‌ క్యాలెండర్‌ విషయంలో ఆనాటి పరిశోధకుడు, విద్యావేత్త శాక్రోబోస్కో సిద్ధాంతం ప్రకారం.. పూర్వం రోమన్‌ సామ్రాజ్యంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి జూలియస్‌ సీజర్‌. రాజకీయాల్లో, సైన్యంలో కీలకంగా వ్యవహరించేవాడు. సాహిత్యకారుడు.. చరిత్రకారుడు కూడా. జూలియస్‌ హయాంలోనే రోమన్‌ క్యాలెండర్‌లో సంస్కరణలు చేసి.. కొత్త క్యాలెండర్‌ను తీసుకొచ్చాడు. రోమన్‌ క్యాలెండర్‌లో జనవరి 30, ఫిబ్రవరి 29, మార్చి 30, ఏప్రిల్‌ 29, మే 30, జూన్‌ 29, జులై 30, ఆగస్టు 29, సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 29, నవంబర్‌ 30, డిసెంబర్‌ 29 రోజులుగా ఉండేవి. అంటే రోమన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఏడాదికి మనకు 354 రోజులే ఉండేవన్నమాట. అయితే జూలియస్‌ సీజర్‌ వాటిలో మార్పులు చేశాడు. ఏడాదికి 11 రోజులను అదనంగా అంటే ప్రతినెలకు ఒక్కో రోజును కలిపాడు. అయితే ఫిబ్రవరిలో 29 రోజులే ఉంచాడు. ఎందుకంటే లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలకు అదనంగా ఒక రోజు వచ్చి చేరి 30 రోజులు అవుతాయని భావించాడు. అలా జూలియస్‌ క్యాలెండర్‌ తయారైంది.

అసూయ వల్లేనా?
అయితే జూలియస్‌ సీజర్‌ తర్వాత రోమన్‌ సామ్రాజ్య సింహాసనాన్ని అగస్టస్‌ అధిష్ఠించాడు. ఆయన హయాంలో జూలియస్‌ క్యాలెండర్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. జూలియస్‌ పేరుతో ఉన్న జులై నెలలో రోజులు 31 ఉండగా.. తన పేరుతో ఉన్న ఆగస్టు నెలలో 30 రోజులే ఉండటం అగస్టస్‌కు నచ్చలేదు. జూలియస్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉండాలని భావించిన అగస్టస్‌.. ఫిబ్రవరిలో ఉన్న 29 రోజుల్లో ఒక రోజును తీసేసి ఆగస్టులో కలిపాడు. దీంతో పక్క పక్కన ఉన్న జులై, ఆగస్టు 31 రోజులు ఉన్న నెలలుగా మారిపోయాయి. ఈ క్రమంలో 28 రోజులతో అతి తక్కువ రోజులున్న నెలగా ఫిబ్రవరి మిగిలిపోయింది. ఆ క్యాలెండర్‌నే ఇప్పటికీ మనం వాడుతున్నాం. అయితే శాక్రోబోస్కో సిద్ధాంతం తప్పని చెబుతూ అనేక సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కాని శాక్రోబోస్కో సిద్ధాంతం మాత్రమే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.

లీప్ ఇయర్
భూమికి సూర్యుడి చుట్టూ తిరగడానికి దాదాపుగా 365 రోజుల 6 గంటలు సమయం పడుతుంది. అంటే రోజులో పావు భాగం అన్నమాట. దానికోసం ప్రత్యేకంగా ఒక రోజును పెట్టలేరు కాబట్టి లీప్ ఇయర్ అని పెట్టారు. ప్రతి నాలుగేళ్లకోసారి నాలుగు పావు భాగాలను కలిపి ఒక్కరోజుగా కలిపారు. అది ఫిబ్రవరి నెలలో కలిపారు. అందుకే అతి తక్కువ రోజులున్న ఫిబ్రవరిలో లీప్ సంవత్సరం వస్తే 29 రోజులుంటాయి. ఈ విధంగా ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకతను కలిగి ఉంది.

Last Updated : Feb 20, 2023, 11:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.