ETV Bharat / science-and-technology

ఏం నేర్చుకుంటే ఎక్కువ వేత‌నాలు వ‌స్తాయి? - ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌

చాలామంది విద్యార్థులు ఉద్యోగం కోసం కేవలం కాలేజీ చివరి సంవత్సరంలో ఏదైనా నేర్చుకోవడం మొదలుపెడితే సరిపోతుందనుకుంటారు. దాంతో చివరికి ఉద్యోగం రాకపోవడమో, తక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలతో సరిపెట్టుకోవటమో జరుగుతుంటుంది. అందుకే ఇంటర్మీడియట్‌ పూర్తి అవ్వగానే చేరిన కోర్సు మొదటి సంవత్సరం నుంచే కేవలం రోజుకు ఒక గంట సమయం కేటాయించినా 4.0 టెక్నాలజీల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఇంతకీ ఏం నేర్చుకోవాలో ఆ కోర్సుల గురించి తెలుసుకుందామా..

 new courses, useful courses, industry 4.o

author img

By

Published : Apr 25, 2021, 7:09 PM IST

ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే విద్యార్థులు ఏం కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందో ఆలోచిస్తుంటారు. కెరియర్‌ విషయంలో సరైన నిర్ణయం తీసుకునేముందు అసలీ ప్రపంచం ఎటు వైపు నడుస్తోంది, సాంకేతిక రంగం ఏ విధంగా పురోగతి చెందుతోంది అనేది గ్రహించాలి. ముఖ్యంగా కంపెనీలు ఇప్పుడు ఎటువంటి నైపుణ్యాల కోసం చూస్తున్నాయి? ఏవి నేర్చుకుంటే కాలేజీ పూర్తి చేశాక ఎక్కువ వేతనాలు వచ్చే ఉద్యోగాలు వస్తాయి? ఇలాంటి విషయాలపై అవగాహన చాలా అవసరం!

సాంకేతిక పురోగమన విషయంలో అవగాహన రావాలంటే.. ఇండస్ట్రీ 4.0 గురించి తెలుసుకోవాలి. 17వ శతాబ్దపు చివరి నుంచి 18వ శతాబ్దపు మొదటి సంవత్సరాల మధ్యలో ఆవిరితో నడిచే యంత్రాలను కనుగొన్నారు. ఈ సాంకేతికతతో మొదటి పారిశ్రామిక విప్లవం మొదలయింది. అంటే అప్పటివరకు మనిషి తనశక్తితో చేసిన పనులు యంత్రాల సహాయంతో చేయడం అన్నమాట. అదే సమయంలో ఆవిరితో నడిచే రైళ్లు ప్రయాణాలనూ, రవాణానూ సులువు చేశాయి. 18వ శతాబ్దపు చివరి నుంచి 19వ శతాబ్దపు మొదటి సంవత్సరాల్లో విద్యుచ్ఛక్తితో రెండో పారిశ్రామిక విప్లవం ఆరంభమయింది. ఈ సాంకేతికతతో మునుపెన్నడూ లేని ఉద్యోగాలు వెలుగులోకి వచ్చాయి.

1950ల నుంచి సెమీ కండక్టర్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌- ఇలా ఈ టెక్నాలజీల్లో చాలా పురోగతి సాధించడం మూడో పారిశ్రామిక విప్లవం. ఈ సారి ప్రపంచంలో పెద్దఎత్తున మార్పులు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని కొత్త రంగాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా నేడు కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తున్న ఐటీ రంగం వాటిలో ఒకటి. ఇప్పుడు మనం చూస్తున్న మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఆపిల్‌ వంటి పెద్ద కంపెనీలన్నీ ఈ మూడో పారిశ్రామిక విప్లవం నుంచి పుట్టినవే.

ఇక 2000ల నుంచి నాలుగో పారిశ్రామిక విప్లవం మొదలయింది. ఇండస్ట్రీ 4.0 అంటే ఇదే! ఇంటర్నెట్‌ అఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, సైబర్‌ సెక్యూరిటీ, వర్చువల్‌ రియాలిటీ, ఆగ్మెంటేడ్‌ రియాలిటీ, 3 డీ ప్రింటింగ్, నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌.. ఇలా ఎన్నో 4.0 టెక్నాలజీలు పరిశ్రమల రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి కంపెనీ ఈ 4.0 టెక్నాలజీల వైపు అడుగులు వేస్తున్నాయి. లేదంటే వాటి మనుగడకే ముప్పు. అదే సమయంలో కోట్లలో కొత్త ఉద్యోగాలను తీసుకొస్తున్నాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం ఈ 4.0 టెక్నాలజీల్లో 2022కి 13.3 కోట్ల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి!

ఇండస్ట్రీ 4.0లో చాలా ఉద్యోగావకాశాలున్న టెక్నాలజీలను క్లుప్తంగా చూద్దాం.

ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌..

మొబైల్‌ ఫోన్‌లో ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌తోనే పనిచేస్తుంది. మనం తరచూ వినే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, ఆటో పైలెట్‌ లాంటి వాటిలో, అమెజాన్‌ అలెక్సా, గూగుల్‌ అసిస్టెంట్‌ లాంటి స్మార్ట్‌ డివైసెస్‌లోనూ ఉపయోగించేది ఏఐనే. ఈ టెక్నాలజీలో ఇంకా చాలా రాబోతున్నాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, బ్యాంకింగ్‌.. ఇంకా చాలా రంగాల్లో ఏఐని ఉపయోగించబోతున్నారు. దీనివల్ల చాలా ఉద్యోగాలు రాబోతున్నాయి. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రకారం 2022కి 6 కోట్ల కొత్త ఉద్యోగాలకు ఆస్కారం ఉంది.

ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌..

విదేశాల్లో ఉన్న స్నేహితులతో వీడియో కాల్‌ మాట్లాడటం, ఇష్టమైన సినిమాను ఎంచుకుని చూడటం.. ఇలా ఎన్నెన్నో పనులు స్మార్ట్‌ ఫోన్‌తో చేయగలుగుతున్నాం. ఒక్క స్మార్ట్‌ ఫోన్‌తోనే ఇన్ని చేయగలుగుతుండగా... టీవీ, ఏసీ, లైట్, ఫ్యాన్స్‌ ఇలా అన్నీ అనుసంధానమై మనం బయటకు వెళ్లేటపుడు వాటంతట అవే స్విచాఫ్‌ అయ్యి, మళ్లీ ఇంటికొచ్చినపుడు వాటికవే స్విచాన్‌ అయితే?ఇవన్నీ సాధ్యపడాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ కనెక్ట్‌ అయ్యి తెలివైన నిర్ణయాలు తీసుకోగలగాలి. అలా చెయ్యగలిగే టెక్నాలజీయే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ). కేవలం ఒక స్మార్ట్‌ ఫోన్‌తోనే గత పది సంవత్సరాల్లో డెవలపర్‌లకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇక ఈ ఐఓటీతో రాబోయే దశాబ్దంలో అవకాశాలకు కొదువే లేదు. 2017లో టెలికాం విభాగం తెలిపిన ప్రకారం కేవలం భారత్‌లోనే సుమారు 1.5 కోట్ల ఉద్యోగాలు దీనిలో రాబోతున్నాయి.

సైబర్‌ సెక్యూరిటీ ..

సమాచారం (డేటా), కంప్యూటర్‌ వ్యవస్థలు (సిస్టమ్స్‌), హార్డ్‌ వేర్, సాఫ్ట్‌ వేర్‌ (అప్లికేషన్లు), నెట్‌వర్క్స్‌ మొదలైన వాటన్నింటిని హ్యాకర్ల చేతికి అందకుండా పటిష్ఠమైన భద్రతా వలయాన్ని ఏర్పరచడమే సైబర్‌ భద్రత లక్ష్యం. ప్రపంచంలో రోజుకు 30,000 వెబ్‌సైట్లు హ్యాక్‌ అవుతున్నాయి. ఒక డేటా ఉల్లంఘనను గుర్తించడానికీ¨, దాన్ని ఆపడానికీ 280 రోజులు పడుతుంది. 2018 నుంచి 2020 మధ్యలో 73 లక్షల కోట్ల రూపాయలు సైబర్‌ నేరాల వల్ల నష్టం జరిగింది. ఈ ముప్పులతో పాటే అవకాశాలూ పెరిగాయి. ప్రపంచంలోని కంపెనీలన్నీ తమ సైబర్‌ వ్యవస్థను పటిష్ఠంగా ఉంచడానికి సైబర్‌ భద్రతలో నైపుణ్యం ఉన్నవారికి పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తున్నాయి. ఐఎస్‌సీ2 సైబర్‌ సెక్యూరిటీ అధ్యయనం 2020 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సైబర్‌ సెక్యూరిటీలో 30 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయి.

ప్రతి ఒక్కరికీ కోడింగ్‌ అభ్యాసం..

ఈ 4.0 టెక్నాలజీల్లో ఏది నేర్చుకోవాలన్నా కోడింగ్‌ నైపుణ్యం చాలా అవసరం. అది అంత ముఖ్యం కాబట్టే కేంద్రప్రభుత్వం జాతీయ విద్యావిధానం 2020 ఆరో తరగతి నుంచి కోడింగ్‌ని తప్పనిసరి చేసింది. అంటే ఈ టెక్నాలజీల్లో ప్రాథ]మిక స్థాయి నైపుణ్యాలు పెంచుకోవడమనేది చేసే ఉద్యోగంతో సంబంధం లేకుండా తప్పనిసరి అవబోతోందన్నమాట.

సమంజసమేనా?

ఎప్పటికప్పుడు చాలా వేగంగా సాంకేతికత మారుతూ ఉంటుంది. వాటితో ఉద్యోగాలూ మారుతూ ఉంటాయి. కానీ ఇలా టెక్నాలజీ రంగం ఎటువైపు వెళ్తుందో అవగాహన లేనివారు ఉద్యోగాలకు దూరమవుతున్నారు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా వారి సామర్ధ్యానికి రెండు నుంచి మూడు రెట్ల తక్కువ జీతంతో సరిపెట్టుకుంటున్నారు. టెక్నాలజీ రంగంలో ఇంత మార్పు జరుగుతుంటే ఆ వేగానికి అనుగుణంగా కరిక్యులం మారకపోవటం ఓ సమస్య. అయితే విద్యార్థులు తాజా సాంకేతికతలు నేర్చుకోవటానికి ఇప్పుడు ఎన్నో మార్గాలూ, ఆన్‌లైన్‌ వేదికలూ ఉన్నాయి.

తొలి ఏడాది నుంచే...

ఇంటర్మీడియట్‌ పూర్తి అవ్వగానే చేరిన కోర్సు మొదటి సంవత్సరం నుంచే కేవలం రోజుకు ఒక గంట సమయం కేటాయించినా 4.0 టెక్నాలజీల్లో నైపుణ్యాలు పెంచుకోవచ్చు. ఏ రకమైన డిగ్రీ, ఎంత పేరున్న కాలేజీ, పేరున్న బ్రాంచి.. ఇలా దేనితో సంబంధం లేకుండానే మంచి వేతనాలు వచ్చే ఉద్యోగాలు తెచ్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యే సమయానికి 25+ లక్షల జీతాలిచ్చే ఉద్యోగాలు వస్తాయి. అంతే కాదు- కాలేజీలో ఉన్నపుడే టాప్‌ ప్రొడక్ట్‌ కంపెనీలో హై పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లు కూడా వస్తాయి.

లక్షల్లో వేతనాలు వచ్చే ఈ 4.0 టెక్నాలజీల నైపుణ్యాలను ఇంటర్మీడియట్‌ తర్వాత నుంచి విద్యార్థులు పరిశ్రమ అవసరాలకు తగ్గట్టుగా నేర్చుకోవడం చాలా అవసరం. ఏ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవాలి అన్న ప్రోగ్రామింగ్‌ ఫండమెంటల్స్‌ చాలా అవసరం. యుడెమి, కోర్స్‌ఎరా లాంటి వాటిలో వాటిని నేర్చుకోవచ్చు.

ఐబీ హబ్స్, నెక్స్‌ట్‌ వేవ్‌ కంపెనీ వారు సీసీబీపీ ప్రోగ్రామ్స్‌ ద్వారా 4.0 టెక్నాలజీల్లో ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేకంగా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసిన విద్యార్థులకు సీసీబీపీలో నాలుగు ఏళ్ళకి ఒక సమగ్ర కెరియర్‌ ప్రణాళికను రూపొందించారు. https://www.ccbp.in/professional వెబ్‌సైట్​లో సమాచారాన్ని తెలసుకోవచ్చు. సంబంధిత నైపుణ్యాలు పొందితే టెక్నాలజీలో ఎలాంటి పూర్వానుభవం లేనివారు కూడా హైపెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌లకూ, లక్షల్లో వేతనాలు వచ్చే పెద్ద ఉద్యోగాలకూ సిద్ధం కావొచ్చు.

ఇదీ చూడండి: విద్యారంగంలో ట్రెండింగ్ టెక్నాలజీలు.. విద్యార్థులకు మేలు.!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.