ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ఈ ట్రిక్స్ అన్నీ​ మీకు తెలుసా? ఇప్పుడు మరింత మెరుగ్గా..

ఆధునిక కాలంలో వాట్సాప్​ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సపోర్ట్​ చేసే ఫ్రీ మెసేజింగ్​ యాప్​. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్​ వచ్చినప్పటికి దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. వాట్సాప్​ను ఇంకా మెరుగ్గా ఉపయోగించేందుకు ఈ 5 ట్రిక్స్ మీ కోసం..

whatsapp tricks
whatsapp tricks
author img

By

Published : Sep 2, 2022, 6:26 PM IST

Whatsapp tricks for android users : ఆధునిక కాలంలో వాట్సాప్​ వాడని వారంటూ ఎవరూ ఉండరు. ఇది ఆండ్రాయిడ్​, ఐఓఎస్​లో సపోర్ట్​ చేసే ఫ్రీ మెసేజింగ్​ యాప్​. ఇప్పటికే ఎన్నో అప్డేట్స్​ వచ్చినప్పటికీ దానిలో ఉన్న కిటుకులు చాలా మందికి తెలియదు. వాట్సాప్​ను ఇంకా మెరుగ్గా ఉపయోగించేందుకు ఈ 5 ట్రిక్స్ మీ కోసం..
గ్రూప్​​లో మెసే​జ్​లు చూసేయొచ్చు సీక్రెట్​గా..
సాధారణంగా గ్రూప్​లో కొన్ని వందల మెసేజ్​లు వస్తుంటాయి. అందరూ అన్ని మెసేజ్​లు చదవటానికి ఇష్టపడరు. అలా అని మనం ఒక్క మెసేజ్​ చూడాలని గ్రూప్​ ఓపెన్​ చేస్తే ఇక అంతే.. బ్లూటిక్​ వల్ల అన్ని మెసేజ్​లు చూసినట్లు తెలిసిపోతుంది. ఇలా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే వాట్సాప్​లో ఓ కొత్త ఫీచర్​ మనకు అందుబాటులో ఉంది.. ఆండ్రాయిడ్​ ఫోన్​ హోమ్​ స్క్రీన్​పై వాట్సాప్​ విడ్జెట్​ను ప్లేస్​ చేస్తే సరిపోతుంది. ఒక చిన్న స్క్రీన్​​​లో అన్ని మెసేజ్​లు కనిపిస్తాయి. స్క్రోలింగ్​ సదుపాయంతో మెసేజ్​లను ఈజీగా చూసేయొచ్చు.

విడ్జెట్​ ఓపెన్​ చేయడం ఎలా..
హోమ్​స్క్రీన్​​ పై లాంగ్​ ప్రెస్​ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో విడ్జెట్​ ఆప్షన్​​ ఒకటి. దాన్ని ఎంచుకుని స్క్రోల్​​​​ చేస్తే అందులో వాట్సాప్​ విడ్జెట్​ లభ్యమవుతుంది. దాన్ని సెలక్ట్​ చేసుకోండి అంతే.. ఇక ఎవరికి తెలియకుండా వాట్సాప్​ మెసేజ్​లు చదివేయొచ్చు ఈజీగా.

చాట్​కి పెట్టేయొచ్చు టైమర్ ఇలా​..
ఇటీవలే వాట్సాప్​లో పాపులరైన ఫీచర్లలో డిస్​అప్పీయరింగ్​​ మెసేజ్​లు ఒకటి.. నిర్దిష్టమైన సమయంలో మెసేజ్​లు వాటంతట అవే మాయమయిపోతాయి. దీని వల్ల చాట్​ హిస్టరీ డిలీట్​ అవ్వడమే కాకుండా మెమొరీ క్లీన్​ అవుతుంది. అయితే చాలా వరకు ఈ ఫీచర్​ని మాన్యువల్​ ఉపయోగించేవారే ఎక్కువగా ఉన్నారు. ఒక చాట్​కి టైమర్​ సెట్​ చేయడమో లేకపోతే మాన్యువల్​​గా డిలీట్​ చేయడమో చేసేవారు ఉన్నారు. అలాంటివారి కోసం ఈ ఆటో టైమర్​ ఆప్షన్​​ ఉపయోగపడుతుంది.

ఆటో టైమర్​ సెట్​ చేయడం ఎలా..
వాట్సాప్​ సెట్టింగ్స్​ను ఎంచుకోవాలి. సెట్టింగ్స్​లో అకౌంట్​ సెట్టింగ్స్​ను ఎంచుకున్నాక అందులో ప్రైవసీ ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి. ప్రైవసీ సెట్టింగ్స్​లో డీఫాల్ట్​ మెసేజ్​ టైమర్​ సెట్టింగ్​ అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని సెలక్ట్​ చేసుకున్నాక మనం అందులో మెసెజ్​ డిసఅప్పీయరింగ్​​ టైమర్​ను మనం 24 గంటలు, వారం లేదా 90 రోజులకు సెలక్ట్​ చేసుకోవచ్చు. మనం ఈ ఆప్షన్​ను ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు.

తక్కువ డేటాతో బెటర్​ క్వాలీటీ ఫొటోలను పంపేయండిలా..
మనం ఎప్పుడైనా వాట్సాప్​లో ఫొటోలు షేర్​ చేసేటప్పుడు క్లారిటీ గల ఫొటోలు పంపిచాంలంటే ఇక డేటా ఎక్కువైపోతుందేమో అని ఆలోచిస్తుంటాం. కానీ ఇక ఆ ఆలోచనను వదిలేయమంటోంది వాట్సాప్​ సంస్థ.

సెట్టింగ్స్​లోకి వెళ్లి.. స్టోరేజ్​ అండ్​ డేటాను ఎంచుకోవాలి.

ఆప్షన్​ను ఎంచుకుని స్క్రోల్​ చేశాక ఫొటో అప్లోడ్​ క్వాలిటీ అనే ఆప్షన్​ కనిపిస్తుంది.

అందులో బెస్ట్​ క్వాలిటీ ఆప్షన్​ను ఎంచుకోవాలి.

ఇక ఎంచక్కా మనం తక్కువ డేటాతో క్వాలిటీ ఫొటోలను పంపవచ్చు.

ఒక వేళ చాట్​లో ఫొటోలు పంపించాలంటే.. వాట్సాప్​ డాక్యుమెంట్ ద్వారా పంపించుకోవచ్చు.

చాట్​ లేదా గ్రూప్​కు షార్ట్​కట్​ పెట్టుకోవచ్చు ఇలా..
మనకు ముఖ్యమైన చాట్​ లేదా గ్రూప్​లు కొన్ని ఉంటాయి. ప్రతి సారి వాటితో అవసరం ఉంటుంది. అలాంటప్పుడు వాటిని మన ఫోన్​ హోం స్క్రీన్​ మీద షార్ట్​కట్​ రూపంలో పెట్టుకోవచ్చు. దీనికోసం ఆ చాట్​ లేదా గ్రూప్​లోకి వెళ్లి పైనున్న మూడు డాట్లను ఎంచుకోవాలి. అందులో మోర్​ అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అందులో యాడ్​ షార్ట్​కట్​ అనేది కనిపిస్తుంది. దాన్ని క్లిక్​ చేస్తే ఆ చాట్​ షార్ట్​కట్​ నేరుగా హోమ్​ స్క్రీన్​ పైకి వచ్చేస్తుంది. అలా ఎన్ని కావాలంటే అన్ని చాట్స్​ లేదా గ్రూప్స్​ను పెట్టుకోవచ్చు. తర్వాత వాటిని ఫోల్డర్ల సహాయంతో మేనేజ్​ చేసుకోవచ్చు.

స్టోరేజ్​ను మేనేజ్​ చేసుకోవచ్చు ఇలా..
వాట్సాప్​లో మనకు అనవసరమైన డేటా ఉంటుంది. అలాంటి డేటా మన ఫోన్​ స్టోరేజ్​ను ఎంతోకొంత ఆక్రమించేసుకుంటుంది. కొన్నిసార్లు పాతడేటా సైతం మనకు తెలియకుండా ఎక్కడో స్టోర్​ అయ్యుంటుంది. ఇలాంటి డేటా అన్నింటిని డిలీట్​ చేసేందుకు యూజర్లు నానా తంటాలు పడుతుంటారు. ఇక పై ఆ బాధ లేకుండా ఈజీగా డేటాను క్లియర్​ చేసేయచ్చు. ఎలా అంటే..

వాట్సాప్​ సెట్టింగ్స్​కు వెళ్లాలి.

అందులో స్టోరేజ్​ అండ్​ డేటా అనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అక్కడే మేనేజ్​ డేటా అనే మరో ఆప్షన్​ కనిపిస్తుంది.

అక్కడ మనకు అన్ని చాట్స్​ కనిపిస్తాయి. అందులో మనకు కావాల్సిన చాట్​ను సెలక్ట్​ చేసుకుని క్లియర్​ చేసుకోవచ్చు.

ఇదీ చదవండి: సరికొత్త ఫీచర్స్​తో నయా స్మార్ట్​ఫోన్స్​, సెప్టెంబర్​లో రిలీజయ్యేవి ఇవే

పంపిన వారికి తెలియకుండా వాట్సాప్​ మెసేజ్​లు చదివేయండిలా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.