సంక్షిప్త సందేశాల యాప్ వాట్సాప్.. త్వరలోనే మల్టీ డివైజ్ సపోర్ట్‌ను అందుబాటులోకి తేనుంది. దీనికి తోడు వాట్సాప్‌లో మరిన్ని సరికొత్త ఫీచర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నూతన ఫీచర్ల వివరాలను వాట్సాప్ మాతృ సంస్థ ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కూడా వెల్లడించారు.
కొత్త ఫీచర్ల విశేషాలు..
వినియోగదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్‌తో ఐప్యాడ్‌లోనూ వాట్సాప్ వినియోగించుకునేందుకు వీలు కలగనుంది. మల్టీ డివైజ్ సపోర్ట్ తెచ్చినప్పటికీ ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్‌లో విధానంలో రాజీపడేది లేదని వెబ్బీటాఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు జుకర్‌బర్గ్.
మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా ఒక వాట్సాప్ అకౌంట్‌ను 4 వేర్వేరు డివైజ్‌ల ద్వారా యాక్సెస్ చేసేందుకు వీలు కలగనున్నట్లు తెలుస్తోంది.
త్వరలోనే 'వ్యూ వన్స్' పేరుతో మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు కూడా తెలిపారు మార్క్ జుకర్‌బర్గ్. దీనితో ఒక యూజర్ మరో యూజర్‌కు పంపిన ఫొటో, వీడియోలను కేవలం ఒక సారి మాత్రమే చూసేందుకు వీలుందని.. ఆ తర్వాత అది మాయం అవుతుందని పేర్కొన్నారు. త్వరలోనే బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.
వీటన్నింటితో పాటు.. ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్‌కు వాట్సాప్ ఛాట్స్ ట్రాన్స్ఫర్ ఫీచర్, నంబర్ మార్చినా ఒకసారి ఛాటింగ్ హిస్టరీ, ఇతర డేటా ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలు కల్పించే నూతన ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఏంటీ.. గూచీ కుర్తా ధర రూ. 2.5లక్షలా!