ETV Bharat / science-and-technology

సరికొత్త ఫీచర్లతో వాట్సాప్.. ఒకేసారి 32 మందితో

Whatsapp New Feature: ఓకేసారి 32 మందికి గ్రూప్ కాల్​ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​.

Whatsapp New Feature
Whatsapp New Feature
author img

By

Published : Apr 15, 2022, 6:33 AM IST

Whatsapp New Feature: ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్​.. వినియోగదారులకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. త్వరలోనే 32 మంది ఒకేసారి గ్రూప్​ వాయిస్​కాల్​ చేసుకునే సదుపాయాన్ని జోడించనున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు 2జీబీ వరకు ఫైల్స్​ షేర్​ చేసుకునేలా అవకాశం కల్పించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం గ్రూప్​ వాయిస్​కాల్​లో గరిష్ఠంగా.. ఎనిమిది మంది మాత్రమే పాల్గొనే అవకాశం ఉంది.

ఇంకా 1 జీబీ వరకు మాత్రమే ఫైళ్లు షేర్​ చేసే అవకాశం ఉండేది. అలాగే, గ్రూప్​ అడ్మిన్​ ఏ సమయంలోనైనా మెసేజ్​లు డిలీట్​ చేసే ఫీచర్​ను కూడా తీసుకొస్తున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. దీంతో పాటు 'కమ్యూనిటీ' అనే కొత్త ఫీచర్​ను తీసుకురానుంది. ఈ ఫీచర్​తో ఒకే రకమైన అభిప్రాయాలున్న వ్యక్తులందరూ ఒకే వేదికపై కలుసుకోవచ్చు.

ఇదీ చదవండి: వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్.. ఏమిటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.