Whatsapp Text Formatting New Tricks : వాట్సాప్‌లో కొత్త టెక్ట్స్ ఫార్మాటింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు బోల్డ్, ఇటాలిక్, స్ట్రైక్ థ్రూ వంటి ఆప్షన్లు అందుబాటులో ఉండగా ఇంకొన్ని కొత్త ఫార్మాట్లను వాట్సాప్ తీసుకొస్తోంది. ఐఓఎస్ వినియోగదారులకు ఇది ఇప్పటికే అందుబాటులోకి రాగా- త్వరలోనే ఆండ్రాయిడ్ బీటా యూజర్లు దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కొత్తగా చేర్చిన ఫార్మాట్లతో వాట్సాప్‌లో ఏడు టెక్ట్స్ ఫార్మాట్లు అందుబాటులోకి వచ్చినట్లైంది.
కొత్త ఫార్మాట్లు ఇవే
కోడ్ బ్లాక్స్:
Whatsapp Text Code : కోడింగ్ టెక్ట్స్ పంపించుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. మోనోస్పేస్ ఫాంట్స్‌ను ఇది చక్కగా చూపిస్తుంది. సాధారణంగా వాట్సాప్ సెంటెన్స్లు ఎక్కడ బ్రేక్ అవుతాయో మనం చెప్పలేం. కానీ ఈ కోడ్ బ్లాక్స్ ద్వారా టెక్ట్స్‌ను మనకు కావాల్సిన విధంగా పంపించుకోవచ్చు. డెవలపర్లు కోడ్ షేర్ చేసుకోవడానికి ఇది మంచి మార్గం. కోడ్ బ్లాక్ పంపించాలంటే సింపుల్‌గా మీ టెక్ట్స్‌కు ముందు, వెనక బ్యాక్‌టిక్ (`) సింబల్‌ను ఉంచితే సరిపోతుంది.
కోట్ బ్లాక్స్:
Whatsapp Quote Block : మనకు వచ్చిన లాంగ్ మెసేజ్లోని కొంత భాగానికి మాత్రమే రిప్లై ఇవ్వాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. కోట్ బ్లాక్స్ పంపించినప్పుడు మనం పంపే మెసేజ్ కాస్త హైలైట్ అయి కనిపిస్తుంది. చూడటానికి అనుకూలంగా ఉండటం సహా మెసేజ్లోని కాంటెక్ట్స్కు తగ్గట్టుగా రిప్లై ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కోట్ బ్లాక్ పంపించాలంటే టెక్ట్స్‌కు ముందు గ్రేటర్ దెన్ (>) సింబల్ పెడితే సరిపోతుంది.
లిస్ట్‌లు:
సమాచారాన్ని లిస్ట్‌ల రూపంలో పంపించాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. టెక్ట్స్‌ను ర్యాంకుల వారీగా చెప్పడానికి, పాయింట్ల వారీగా సమాచారం ఇవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. బుల్లెట్ లిస్ట్, నంబర్ లిస్ట్ ఆప్షన్లను వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టింది. బుల్లెట్ లిస్ట్ పంపించాలనుకుంటే ప్రతి లైన్‌కు ముందు స్టార్(*) లేదా మైనస్(-) సింబల్స్‌ను పెడితే సరిపోతుంది. నంబర్ లిస్ట్ కావాలనుకుంటే ప్రతి లైన్‌కు ముందు నంబర్‌ను ఎంటర్ చేయాలి. లాంగ్ మెసేజ్‌లు పంపించుకునే సమయంలో టెక్ట్స్ ఫార్మాట్ చెదిరిపోకుండా ఉండటానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సూచనలు, లాభ-నష్టాలు, ఛాయిస్‌లు/ఆప్షన్లు, టాస్క్‌ల గురించి వివరించేందుకు ఈ లిస్ట్‌లు బాగా ఉపయోగపడతాయి.
ఇవి కూడా తెలుసుకోండి
ఇప్పటికే వాట్సాప్‌లో కొన్ని టెక్ట్స్ ఫార్మాటింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు చూద్దాం.
బోల్డ్: టెక్ట్స్‌ను బోల్డ్ చేయడానికి ఇది ఉపయోగిస్తారు. ఓ పదాన్ని లేదా లైన్‌ను హైలైట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైన్/పదానికి ముందు, వెనక స్టార్(*) సింబల్‌ను పెట్టడం (*ఇలా రెండు స్టార్ సింబళ్ల మధ్య టెక్ట్స్ ఉంచాలి*) ద్వారా టెక్ట్స్‌ను బోల్డ్ చేయవచ్చు.
ఇటాలిక్:
కాస్త వంగినట్టు ఉండే టెక్ట్స్ కోసం ఇటాలిక్ను ఉపయోగించుకోవచ్చు. రెండు అండర్స్కోర్ (_) సింబల్స్ మధ్య టెక్ట్స్‌ను ఉంచితే ఇటాలిక్ ఫాంట్ వచ్చేస్తుంది.
స్ట్రైక్ థ్రూ:
ఈ ఆప్షన్ ఉపయోగిస్తే టెక్ట్స్‌పై అడ్డంగా గీత వస్తుంది. సంబంధిత టెక్ట్స్ తప్పు అని చెప్పేందుకు ఇది ఉపయోగించుకోవచ్చు. టెక్ట్స్‌కు ముందు, వెనక టిల్డ్ (~) సింబల్స్ యాడ్ చేస్తే స్ట్రైక్ థ్రూ సెంటెన్స్ వచ్చేస్తుంది.
మోనోస్పేస్:
మోనోస్పేస్ ఫాంట్ కోసం ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. టెక్ట్స్‌కు ముందు, వెనక మూడు బ్యాక్‌టిక్ సింబల్స్‌ను పెట్టడం ద్వారా (```ఉదాహరణ```) మోనోస్పేస్ ఫాంట్ పొందొచ్చు.
త్వరలో వాట్సాప్ లుక్ ఛేంజ్ - మీకు నచ్చిన థీమ్ కలర్స్ మార్చుకునే అవకాశం!
వాట్సాప్‌లో మిమ్మల్ని ఎవరు బ్లాక్ చేశారో తెలుసుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే!
వాట్సాప్‌లో 'యూజర్ నేమ్' ఫీచర్ - ఇకపై ఫోన్ నంబర్ షేరింగ్ బంద్!
మీ ప్రైవేట్ చాట్స్ ఎవరూ చూడకూడదా? సింపుల్‌గా 'సీక్రెట్ కోడ్' పెట్టేయండిలా!