ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్.. ఏమిటంటే?

author img

By

Published : Apr 10, 2022, 4:01 AM IST

Whatsapp New Feature: వాట్సాప్‌లో కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్‌లను వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా తీసుకొచ్చిన 'డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌' ఫీచర్‌ వల్ల సమస్య సగం మాత్రమే తొలగింది. 'డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌' ఆన్‌లో ఉన్నా.. వచ్చిన ఇమేజ్‌లు, వీడియోలు ఫోన్‌లోనే ఉండిపోతున్నాయి. తాజాగా వాట్సాప్​ ఈ ఫీచర్‌లో మార్పు చేసింది.

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్

Whatsapp New Feature: వాట్సాప్​లో మరో కొత్త ప్రైవసీ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్​లను వాటంతట అవే డిలీట్​ అయ్యేలా 'డిస్​అపియరింగ్​ మెసేజెస్'​ అనే ఫీచర్​ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫీచర్​ ఆన్​లో ఉన్నా ఫోటోలు, వీడియోలు మాత్రం ఫోన్​ గ్యాలరీలో సేవ్​ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఫీచర్​లో మార్పు చేసింది వాట్సాప్.

వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్
వాట్సాప్​లో మరో కొత్త ఫీచర్

డిస్‌అపియరింగ్‌ చాట్‌ ఫీచర్‌ను.. యూజర్ల గోప్యత కోసం తీసుకొచ్చారు. నిర్దిష్ట సమయం తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయ్యేలా ఈ ఫీచర్‌ను రూపొందించారు. (ఉదాహరణకు మీరు మెసేజ్‌ వచ్చిన 24 గంటల్లో డిలీట్‌ అవ్వాలని ఎంచుకుంటే ఆ టైమ్‌కి అయిపోతుంది) అయితే, వాట్సాప్‌లో షేర్‌ చేసిన మీడియా ఫైల్స్‌ గ్యాలరీలో ఆటో సేవ్‌ అవ్వడంతో ప్రైవసీ లేకుండా పోతోంది. ఐఫోన్‌ యూజర్లు 'సేవ్‌ టూ కెమెరా రోల్‌', ఆండ్రాయిడ్‌ యూజర్లు 'మీడియా విజిబిలిటీ' ద్వారా మీడియా ఫైల్స్‌ను ఆటో సేవ్‌ చేసుకునే వారు. అయితే, ఇప్పుడు తీసుకొచ్చిన కొత్త అప్‌డేట్‌ ద్వారా డిస్‌అపియరింగ్‌ చాట్‌ ఆన్‌ చేస్తే... ఆటో డౌన్‌లోడ్‌ మోడ్‌ డిసేబుల్‌ కానుంది. డిస్‌అపియరింగ్‌ చాట్‌లోనూ ఇమేజ్‌/ వీడియో మీ మొబైల్‌లో సేవ్‌ చేసుకోవాలంటే.. ఒక్కోదాన్ని క్లిక్‌ చేసి సేవ్‌ చేయాల్సి ఉంటుంది.

'డిస్‌అపియరింగ్‌' ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?
వాట్సాప్‌ డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌తో వ్యక్తిగత చాట్‌లతో పాటు గ్రూప్‌ చాట్‌లను కూడా కనిపించకుండా చేయొచ్చు. యూజర్లు కావాల్సిన కాంటాక్ట్‌ నేమ్‌పై క్లిక్‌ చేస్తే 'డిస్‌ అపియరింగ్‌ మెసేజెస్‌' ఆప్షన్‌ కనిపిస్తుంది. ఆన్‌/ఆఫ్‌ ఐచ్ఛికాలను ఉపయోగించొచ్చు. వాట్సాప్‌ గ్రూపుల విషయంలోనూ ఇదే పద్ధతిని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అయితే, గ్రూప్‌ చాట్‌కు సంబంధించి మెసేజులు తొలగిపోయేలా చేసే అధికారం గ్రూప్‌ అడ్మిన్‌కు మాత్రమే ఉంటుంది.

ఇదీ చదవండి: ఆ యాప్​లకు గూగుల్​ షాక్​.. మీ మొబైల్​లో ఉన్నాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.