ETV Bharat / science-and-technology

ఐదు డివైజ్​లలో వాట్సాప్.. ఫోన్​లో నెట్​ లేకపోయినా డెస్క్​టాప్​లో... - వాట్సాప్ అందరికీ

Whatsapp on 5 devices: వాట్సాప్ యూజర్లకు గుడ్​న్యూస్! వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ యూజర్లందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బీటా వెర్షన్ వాడుతున్నవారికే ఈ ఫీచర్​ లభించింది. దీని ద్వారా ఐదు డివైజ్​లలో వాట్సాప్ లాగిన్ అవ్వొచ్చు. అదెలాగో చూద్దాం.

Whatsapp on 5 devices
Whatsapp on 5 devices
author img

By

Published : Mar 22, 2022, 2:30 PM IST

Whatsapp on 5 devices: వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్​ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు బీటా యూజర్లు మాత్రమే ఉపయోగించుకున్న ఈ సేవలను.. మిగిలిన వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ ప్రకటించింది.

వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్ ద్వారా ఒకేసారి ఐదు డివైజ్​లలో వాట్సాప్ లాగిన్ అవ్వొచ్చు. మనం వాడే ఫోన్​తో పాటు.. ల్యాప్​టాప్స్, డెస్క్​టాప్స్​లో వెబ్ వెర్షన్​ను వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకు ప్రధాన ఫోన్​లో ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంటేనే.. వెబ్ వెర్షన్ ఓపెన్ అయ్యేది. తాజా అప్​డేట్​లో.. ఇండిపెండెంట్​గా వాట్సాప్ వెబ్ పనిచేయనుంది. అయితే, 14 రోజుల వరకు ప్రధాన ఫోన్​ను వాడకుండా ఉంటే.. వెబ్ వెర్షన్​ ఆటోమెటిక్​గా ఆగిపోతుంది.

ఎలా పనిచేస్తుందంటే?

'వాట్సాప్ వెబ్​'లో లాగిన్ అయ్యే సమయంలో క్యూఆర్ కోడ్​ను స్కాన్ చేయగానే.. రీసెంట్ మెసేజ్​లతో కూడిన ఎన్​క్రిప్టెడ్ కాపీ ప్రధాన ఫోన్ నుంచి వెబ్​కు ట్రాన్స్​ఫర్ అవుతుంది. వెబ్ వెర్షన్​లో మెసేజ్​లన్నింటినీ చూసేందుకు వీలు ఉండదు. పాత సందేశాలు కావాలనుకుంటే ప్రధాన మొబైల్​లో చూడాలని.. వెబ్​లో అలర్ట్ ఇస్తుంది. ఫోన్​లో లభించే కొన్ని ఫీచర్లు.. వెబ్​ నుంచి కట్ చేసింది వాట్సాప్. అవేంటంటే?

  • ఐఫోన్​ వాడే యూజర్లు.. వాట్సాప్ వెబ్​లో చాట్స్​ను డిలీట్ చేయడం కుదరదు.
  • పాత మొబైల్ వెర్షన్​ను వాడుతున్న యూజర్లు ఫోన్ కాల్స్, మెసేజ్​లు చేసుకోలేరు.
  • లింక్ చేసిన డివైజ్​లలో లైవ్ లొకేషన్ చూడటం వీలు పడదు.
  • బ్రాడ్​కాస్ట్ లిస్ట్​ను తయారు చేయడం, చూడటం వంటివి చేయలేరు.
  • వాట్సాప్ వెబ్ నుంచి.. లింక్ ప్రివ్యూలతో మెసేజ్​లను పంపడం కుదరదు.

వాట్సాప్ వెబ్​లో ఎలా లాగిన్ అవ్వాలంటే?

  • లాగిన్ అయ్యే సమయంలో ల్యాప్​టాప్, మొబైల్ రెండింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి.
  • ల్యాప్​టాప్, డెస్క్​టాప్ బ్రౌజర్​లో.. 'web.whatsapp.com' లోకి వెళ్లాలి. స్క్రీన్​పై క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది.
  • మొబైల్ వాట్సాప్​ త్రీ-డాట్ మెనూలో లింక్డ్ డివైజ్ ఆప్షన్​పై క్లిక్ చేసి.. బ్రౌజర్​లో కోడ్​ను స్కాన్ చేయాలి.
  • కొంత సమయం తర్వాత వాట్సాప్ వెబ్.. ల్యాప్​టాప్, డెస్క్​టాప్​లో పనిచేయడం ప్రారంభిస్తుంది. వినియోగిస్తున్న ఫోన్​ను బట్టి.. ఇంటర్నెట్ లేకుండానే వెబ్ అకౌంట్ పనిచేస్తుంది.

ఇదీ చదవండి: శాంసంగ్ నుంచి 'వాటర్​ ప్రూఫ్'​ ఫోన్.. ప్రైవసీకి కొత్త ఆప్షన్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.