WhatsApp new Features: అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది. ఇప్పుడు మరిన్ని ఫీచర్లతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది.
స్క్రీన్ మొత్తం కనిపించేలా..!
WhatsApp latest update: ఆండ్రాయిడ్ యూజర్లు కోసం కెమెరా ఇంటర్ఫేస్లో మార్పు చేస్తోంది వాట్సాప్. ఫొటో తీసే సమయంలో స్క్రీన్ మొత్తం కనిపించేలా.. ఫ్లాష్ షార్ట్‌కట్ స్థానాన్ని మారుస్తోంది. ఫ్లాష్ కోసం కొత్త బటన్‌ను రీడిజైన్ చేస్తోంది. బ్యాక్, ఫ్రంట్ కెమెరాలకు మార్చే ఆప్షన్స్‌లో కూడా మార్పులు చేసి.. వాట్సాప్ బీటా వెర్షన్లో పరీక్షిస్తోంది.
వాట్సాప్ కెమెరాలో షట్టర్ బటన్‌పైన కనిపించే గ్యాలరీని కూడా తొలగించింది. యూజర్లు.. ఫొటో తీసుకునేటప్పుడు మరింత స్పష్టంగా కనిపించేందుకు ఇలా చేసింది. వాట్సాప్ బీటా యూజర్స్ కోసం ఆండ్రాయిడ్ 2.22.1.2 వెర్షన్లో ఈ ఫీచర్ ముందుగా అందుబాటులోకి రానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. ఈ ఫీచర్.. త్వరలోనే సాధారణ వాట్సాప్ యూజర్లకు అందుబాటులో వస్తుందని పేర్కొంది. ఇందుకు కొంత సమయం పట్టొచ్చని తెలిపింది.
గ్రూప్ సభ్యుల మెసేజ్‌లు అడ్మిన్ డిలీట్ చేసేలా..
WhatsApp new Features: వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది. ఇప్పటివరకు వ్యక్తిగత చాట్‌లు, గ్రూప్ చాట్స్‌లో మెసేజ్‌లను పంపినవారు మాత్రమే డిలీటే చేసే వీలుంది. అయితే గ్రూప్ సభ్యులు పెట్టిన మెసేజ్‌లను అడ్మిన్ డిలీట్ చేసేలా నయా అప్డేట్ చేస్తోంది. దీంతో అడ్మిన్‌కు తమ సొంత మెసేజ్‌లతో పాటు గ్రూప్‌లోని ఇతర సభ్యులు పంపిన మెసేజ్‌లు కూడా డిలీట్ చేసే అధికారం ఉంటుంది.
మెసేజ్ ఎవరూ డిలీట్ చేస్తున్నారో కూడా స్పష్టంగా చెబుతుంది వాట్సాప్. సందేశం పంపినవారే డిలీట్ చేస్తే.. వారే డిలీట్ చేసినట్లు నోటీస్ చేస్తుంది. ఒకవేళ అడ్మిన్ డిలీట్ చేస్తే.. అడ్మిన్ తొలగించినట్లు చూపుతుంది. ఈ ఫీచర్ పరీక్ష దశలో ఉందని.. త్వరలో వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.1.1 అందుబాటులోకి రానుంది.
ఇదీ చూడండి: ఐఓఎస్‌లో అదిరే అప్డేట్.. ప్రైవసీ రిపోర్టులు సహా మరెన్నో ఫీచర్లతో...