WhatsApp New Features : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారు తప్ప, వాట్సాప్ కమ్యూనిటీలోని మరెవ్వరూ మీ ఫోన్ నంబర్‌ను చూడకుండా నిరోధిస్తుంది. ఇది మీ ప్రైవసీకి ఎలాంటి భంగం ఏర్పడకుండా కాపాడుతుందని కంపెనీ చెబుతోంది. ఐఓస్, ఆండ్రాయిడ్ అప్డేటెడ్ వెర్షన్స్‌లో ఈ సేఫ్టీ ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ బీటా టెస్టర్లు దీనిని వాడొచ్చు.
రియాక్షన్ ఇచ్చినా..!
WhatsApp Phone Number Privacy Feature : వాబీటాఇన్ఫో ప్రకారం, వాట్సాప్ 'ఫోన్ నంబర్ ప్రైవసీ' పేరుతో ఈ సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొచ్చింది. ఇది మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మెంబర్స్‌కు తప్ప.. కమ్యూనిటిలోని ఇతరులు ఎవ్వరూ మీ ఫోన్ నంబర్ చూడకుండా గోప్యంగా ఉంచుతుంది. ఒక వేళ మీరు అవతలివారి మెసేజ్‌కు రియాక్షన్ ఇచ్చినా కూడా మీ ఫోన్ నంబర్ వాళ్లకు కనిపించదు.
లేటెస్ట్ వాట్సాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న తరువాత, యూజర్లకు ఈ 'ఫోన్ నంబర్ ప్రైవసీ' గురించి అలర్ట్ వస్తుంది. మీ ఫోన్ నంబర్ కేవలం కమ్యూనిటీ అడ్మిన్స్‌కు, మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తుందని స్పష్టం చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, కమ్యునిటీ మెంబర్స్ అందరికీ మీ ఫోన్ నంబర్ కనిపించకపోయినా.. కమ్యూనిటీ అడ్మిన్స్‌కు మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. భవిష్యత్‌లో ఈ ప్రైవసీ ఫీచర్ కేవలం కమ్యూనిటీ గ్రూపులకు మాత్రమే కాకుండా, ఇతర గ్రూపులకు కూడా వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది.
-
WhatsApp is rolling out a phone number privacy feature for communities!
— WABetaInfo (@WABetaInfo) July 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
After an initial test with a limited number of users, WhatsApp is widely rolling out the phone number privacy feature, with the ability to react to messages shared in the community!https://t.co/8TFeaPKgfW pic.twitter.com/w1ujISgKud
">WhatsApp is rolling out a phone number privacy feature for communities!
— WABetaInfo (@WABetaInfo) July 10, 2023
After an initial test with a limited number of users, WhatsApp is widely rolling out the phone number privacy feature, with the ability to react to messages shared in the community!https://t.co/8TFeaPKgfW pic.twitter.com/w1ujISgKudWhatsApp is rolling out a phone number privacy feature for communities!
— WABetaInfo (@WABetaInfo) July 10, 2023
After an initial test with a limited number of users, WhatsApp is widely rolling out the phone number privacy feature, with the ability to react to messages shared in the community!https://t.co/8TFeaPKgfW pic.twitter.com/w1ujISgKud
రిక్వెస్ట్ చేస్తే..
Phone Number Privacy Feature in WhatsApp : వాట్సాప్ కమ్యూనిటీలోని ఎవరి ఫోన్ నంబర్ అయినా మీరు చూడాలని అనుకుంటే.. దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. ఇందు కోసం మీరు ముందుగా ఓ రిక్వెస్ట్ మెసేజ్ పెట్టాలి. మీ రిక్వెస్ట్‌ను వాళ్లు సమ్మతించి, తమ కాంటాక్ట్ లిస్ట్‌లో మీ ఫోన్ నంబర్ సేవ్ చేస్తే.. అప్పుడు మీరు వారి ఫోన్ నంబర్‌ను చూడడానికి వీలవుతుంది.
క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే లాగిన్
WhatsApp web login with phone number : వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే.. మీ ఫోన్ నంబర్ ద్వారా వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అయ్యేలా అప్డేట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది బీటా వెర్షన్లో అందుబాటులో ఉంది. త్వరలో అందరు యూజర్లకు అందుబాటులోకి రానుంది.
ఇప్పటి వరకు యూజర్లు వాట్సాప్ వెబ్‌లో లాగిన్ అవ్వాలంటే కచ్చితంగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి వచ్చేంది. ఒక వేళ మీ ఫోన్ కెమెరా సరిగ్గా పనిచేయకపోతే.. లాగిన్ కావడం సాధ్యమయ్యేది కాదు. అందుకే ఈ లేటెస్ట్ అప్డేట్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకునేందుకు, వాట్సాప్ లింక్ డివైజ్ సెక్షన్లో 'లింక్ విత్ ఫోన్ నంబర్' అనే ఆప్షన్‌లోకి వెళ్లాలి. తరువాత ఆ ఆప్షన్‌ను క్లిక్ చేసి, మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. వెంటనే డెస్క్‌టాప్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలని సూచన వస్తుంది. దానిని ఓపెన్ చేసిన తరువాత, ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తున్న 8 అంకెల కోడ్‌ను నమోదు చేయాలి. అంతే! ఈ విధంగా చాలా సులువుగా వాట్సాప్ వెబ్‌లో లాగిన్ కావచ్చు.