తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తూనే ఉంది ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఇప్పుడు కొత్తగా 'కంపానియన్ మోడ్' అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ఒకే నంబరుతో నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ వాట్సాప్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
ఈ కంపానియన్ మోడ్ వల్ల యూజర్లు.. నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, పర్సనల్ కంప్యూటర్, ట్యాబ్లెట్ లేదా ఇతర డివైజ్‌లలో కంపానియన్ మోడ్ వల్ల వాట్సాప్‌ను వాడుకోవచ్చని WABetaInfo పేర్కొంది. ఆ నంబర్‌తో ఏ డివైజ్‌లో నుంచైనా చాట్ చేసుకోవచ్చని తెలిపింది. ప్రైమరీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా మిగతా డివైజ్‌లకు మేసేజ్‌లు వస్తాయని వెల్లడించింది.
ప్రస్తుతానికి కంపానియన్ మోడ్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. నిజానికి ఈ ఫీచర్ కోసం యూజర్లు ఎప్పటి నుంచో వేచి చూస్తున్నారు. కంపానియన్ మోడ్ అందుబాటులోకి వస్తే ఫోన్‌లో ఛార్జింగ్ లేకపోయినా ఫర్వాలేదు. ఒకవేళ ఛార్జింగ్ లేక ఫోన్ స్విచ్ఛాప్ అయినా మిగతా డివైజ్‌లలో వాట్సాప్‌ను వాడుకోవచ్చు. మల్టీడివైజ్ ఫీచర్ వల్ల ఒక మొబైల్ ఫోన్‌తో పాటు పర్సనల్ కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్‌లో వాట్సాప్‌ను వాడేందుకు వీలుంది. అదీ ప్రైమరీ డివైజ్‌లో ఇంటర్నెట్ లేకున్నా సరే.
మరో డివైజ్‌కు ఇలా లింక్ చేయండి..
- మరో స్మార్ట్ ఫోన్ లేదా ఏదైనా డివైజ్‌లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ మెసెంజర్ లేదా వాట్సాప్ బిజినెస్ లేటెస్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ స్క్రీన్‌లో కనిపించే ఓవర్‌ఫ్లో మెనూపై క్లిక్ చేయాలి. అందులో 'లింక్ ఏ డివైజ్' అనే ఆప్షన్ ఉంటుంది.
- ప్రైమరీ డివైజ్‌లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్డ్ డివైజెస్'పై క్లిక్ చేయాలి.
- మరో డివైజ్ లేదా ఫోన్‌లో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసేలా ప్రైమరీ డివైజ్‌ను ఉంచాలి.
- ఇలా మొదటి ఫోన్‌లో లాగౌట్ కాకుండానే మిగతా డివైజ్‌లలోనూ వాట్సాప్‌ను వాడొచ్చు.
వాట్సాప్ అప్లికేషన్‌లోని కాంట్రాక్ట్స్ యాడ్, ఎడిట్..
వాట్సాప్ అప్లికేషన్లోనే కాంటాక్ట్స్ క్రియేట్, ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ యూజర్లకు మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ తెలిపింది. గతంలో వాట్సాప్ యూజర్లు ఏదైనా కాంటాక్ట్ సేవ్ చేసుకోవాలంటే ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌నకు వెళ్లి సంబంధిత డీటెయిల్స్ ఇచ్చి సేవ్ చేసుకోవాల్సి వచ్చేది. కొత్త ఫీచర్‌తో ఆ భారం తప్పుతుంది. నిజానికి వాట్సాప్‌లో ఫలానా కాంటాక్ట్ సేవ్ చేసుకోవడానికి ఒక షార్ట్‌కట్ ఉంది. అయితే ఈ షార్ట్‌కట్‌పై క్లిక్ చేయడం ద్వారా అది ఫోన్ కాంటాక్ట్స్ యాప్‌కి తీసుకెళ్తుంది. దీనివల్ల ఫోన్‌పై రెండు అప్లికేషన్లు ఓపెన్ చేయాల్సిన భారం పడుతుంది. అలాగే యూజర్లకు ఇబ్బంది కలుగుతుంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.