WhatsApp Latest Feature : వాట్సాప్ తన యూజర్ల కోసం అదిరిపోయే అప్డేట్ తీసుకొచ్చింది. వాట్సాప్ గ్రూప్ చాట్‌లోనే.. కొత్త గ్రూప్‌లకు పార్టిసిపెంట్స్‌ను చేర్చుకునే వెసులుబాటు కల్పిస్తూ అప్డేట్ తీసుకొచ్చింది. వాస్తవానికి ఈ ఫీచర్ ఒక షార్ట్‌కట్‌గా పనిచేస్తుంది. కనుక యూజర్లు తమ కొత్త గ్రూప్‌లో సభ్యులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు.
మరింత సులభంగా
Add Participants To New WhatsApp Groups : వాబీటాఇన్ఫో ప్రకారం, ప్రస్తుతం గ్రూప్ చాట్‌లో ఒక కొత్త బ్యానర్ కనిపిస్తుంది. ఇది వాట్సాప్ కొత్త గ్రూప్‌లో చేరేందుకు ఇతరులను ఆహ్వానిస్తుంది. దీని వల్ల గ్రూప్ చాట్ అనుమతించినంత మేరకు, వాట్సాప్ గ్రూప్‌లో కొత్త వ్యక్తులను చాలా సులభంగా, వేగంగా చేర్చుకోవచ్చు.
ప్రస్తుతం ఈ నయా ఫీచర్ వాట్సాప్ బీటా ఐవోఎస్ 23.15.1.77 వెర్షన్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొంత మంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్.. త్వరలో అందరు వాట్సాప్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో తెలిపింది.
-
📝 WhatsApp beta for iOS 23.15.1.77: what's new?
— WABetaInfo (@WABetaInfo) July 29, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
WhatsApp is rolling out a feature to add participants to new groups right within the group chat, and it is available to some beta testers!https://t.co/7PZhLXeg6d pic.twitter.com/vDfLVpqFTb
">📝 WhatsApp beta for iOS 23.15.1.77: what's new?
— WABetaInfo (@WABetaInfo) July 29, 2023
WhatsApp is rolling out a feature to add participants to new groups right within the group chat, and it is available to some beta testers!https://t.co/7PZhLXeg6d pic.twitter.com/vDfLVpqFTb📝 WhatsApp beta for iOS 23.15.1.77: what's new?
— WABetaInfo (@WABetaInfo) July 29, 2023
WhatsApp is rolling out a feature to add participants to new groups right within the group chat, and it is available to some beta testers!https://t.co/7PZhLXeg6d pic.twitter.com/vDfLVpqFTb
గ్రూప్ ఇన్ఫోను తెరవాల్సిన పనిలేదు!
WhatsApp info page : వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్ వల్ల వాట్సాప్ గ్రూప్‌లోని సభ్యులు.. నేరుగా ఇతరులను తమ గ్రూప్‌లో చేర్చుకోవచ్చు. ఇందుకోసం గ్రూప్ ఇన్ఫోను తెరవాల్సిన అవసరం కూడా ఉండదు.
రిమైండర్‌లా పనిచేస్తుంది!
WhatsApp reminder feature : మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ లేటెస్ట్ వాట్సాప్ ఫీచర్ ఒక రిమైండర్‌లా కూడా పనిచేస్తుంది. గ్రూప్‌ల్లోకి కొత్త సభ్యులను చేర్చుకునే విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుంది.
వాట్సాప్ సేఫ్టీ టూల్స్
WhatsApp safety features : వాట్సాప్ తన యూజర్ల భద్రత కోసం సేఫ్టీ టూల్స్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లను తెరచినప్పుడు.. అది కొత్త స్క్రీన్‌లో ఓపెన్ అవుతుంది. ఒక వేళ అది అనుమానాస్పదంగా ఉంటే.. వెంటనే దానిని బ్లాక్ చేసేందుకు అవకాశం ఉంటుంది. లేదా వాటిని వాట్సాప్ మోడరేషన్ బృందానికి నివేదించడానికి వీలవుతుంది.
వాట్సాప్ వీడియో మెసేజ్
WhatsApp short video messages feature : వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. లేటెస్ట్గా యూజర్లు తమ సందేశాలను టెక్ట్స్ రూపంలో మాత్రమే కాకుండా షార్ట్ వీడియో రూపంలో కూడా పంపించేందుకు వీలుగా ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా యూజర్లు 60 సెకెన్ల నిడివితో ఉన్న షార్ట్ వీడియో మెసేజ్‌ను పంపించేందుకు వీలవుతుంది.
స్టిన్నింగ్ సెర్చ్ బార్
WhatsApp search bar feature : వాట్సాప్ సరికొత్త సెర్చ్ బాక్స్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అయితే ఇది కూడా ప్రస్తుతం బీటా వెర్షన్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని ద్వారా అన్రెడ్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, లింక్ ఆప్షన్లు తెలుపు రంగులో కనిపిస్తాయి. ఇది యాప్ విజువలైజేషన్‌ను బాగా మెరుగుపరుస్తుంది.