WhatsApp new feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో 'మెసేజ్ పిన్ డ్యూరేషన్' ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు వాట్సాప్ సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా ఒక చాట్‌లో లేదా గ్రూప్‌లో ఒక మెసేజ్‌ను పిన్ చేసుకునే వెసులుబాటు కల్పించడం సహా, ఎంత సేపు పిన్ చేసి ఉంచుకోవాలో యూజర్లు నిర్ణయించుకోగలుగుతారు. దీని ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని హైలెట్ చేయడానికి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచుకోవడానికి వీలవుతుంది.
వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్స్
WhatsApp message pin duration feature :మెటా కంపెనీకి చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తెస్తూ, తన వినియోగదారులను ఆకట్టుకుంటోంది. తాజాగా మెసేజ్ పిన్ డ్యూరేషన్ ఫీచర్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. ఇంకా అభివృద్ధి దశలోనే ఉన్న ఈ ఫీచర్‌ను.. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.23.13.11 అప్డేట్లో ఉంచింది. వాట్సాప్ త్వరలో సాధారణ యూజర్లకు కూడా దీనిని అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉందని డబ్ల్యూఏబీటాఇన్ఫో తెలిపింది.
మెసేజ్ పిన్ చేసుకునే వెసులుబాటు
వాట్సాప్ అభివృద్ధి చేస్తున్న ఈ నయా ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే, యూజర్లు వాట్సాప్ చాట్‌లో, గ్రూప్‌లో నిర్దిష్ట సమయం వరకు మెసేజ్‌ను పిన్ చేసుకోవచ్చు. ఆ సమయం తరువాత ఆటోమేటిక్‌గా ఆ మెసేజ్ అన్‌పిన్ అయిపోతుంది.
పిన్ డ్యూరేషన్ సమయం!
డబ్ల్యూఏబీటాఇన్ఫో ప్రకారం, ఈ సరికొత్త ఫీచర్ ద్వారా పిన్ మెసేజ్ డ్యూరేషన్ 24 గంటలు, 7 రోజులు, 30 రోజుల వ్యవధి ఉండేలా వాట్సాప్ ఆప్షన్స్ ఇవ్వనుంది. దీనితోపాటు నిర్ణీత సమయం కంటే ముందుగానే ఆ మెసేజ్‌ను అన్‌పిన్ చేసుకునే అవకాశం కూడా యూజర్లకు కల్పించనుంది. దీని వలన మెసేజ్‌లు పిన్ చేసుకునే విషయంలో యూజర్లకు పూర్తి స్వేచ్ఛ, వెసులుబాటు లభిస్తుంది.
-
📝 WhatsApp beta for Android 2.23.13.11: what's new?
— WABetaInfo (@WABetaInfo) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
WhatsApp is working on a feature to choose how long messages stay pinned within chats and groups, and it will be available in a future update of the app!https://t.co/7dIL7ZwGWz pic.twitter.com/jGZv0uJ81k
">📝 WhatsApp beta for Android 2.23.13.11: what's new?
— WABetaInfo (@WABetaInfo) June 23, 2023
WhatsApp is working on a feature to choose how long messages stay pinned within chats and groups, and it will be available in a future update of the app!https://t.co/7dIL7ZwGWz pic.twitter.com/jGZv0uJ81k📝 WhatsApp beta for Android 2.23.13.11: what's new?
— WABetaInfo (@WABetaInfo) June 23, 2023
WhatsApp is working on a feature to choose how long messages stay pinned within chats and groups, and it will be available in a future update of the app!https://t.co/7dIL7ZwGWz pic.twitter.com/jGZv0uJ81k
వాట్సాప్ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లు ముఖ్యమైన సమాచారాన్ని చాట్స్‌లో, గ్రూప్స్‌లో పంచుకోవడానికి వీలవుతుంది. అలాగే ముఖ్యమైన ప్రకటనలను చాట్ బాక్స్ టాప్‌లో పిన్ చేయడానికి వీలవుతుంది. దీని వల్ల చెప్పాలనుకున్న ముఖ్యమైన సమాచారం ఇతర మెసేజ్‌ల మధ్య కనుమరుగై పోకుండా ఉంటుంది.
ఈ నయా వాట్సాప్ ఫీచర్‌లోని టైమ్ ఎలాప్సెస్ వలన నిర్దిష్ట సమయం తరువాత పిన్ చేసిన మెసేజ్ అన్‌పిన్ అయిపోతుంది. ఇది మన చాట్‌ను ఒక పద్ధతిగా, అప్ టూ డేట్‌గా ఉంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే బీటా యూజర్లకు, తరువాత అందరు వాట్సాప్ వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్స్
Upcoming WhatsApp Features : త్వరలో వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్స్ తెచ్చేందుకు మెటా సన్నాహాలు చేస్తోంది. మెసేజ్ డిస్అపీయరింగ్ మోడ్, వ్యూ ఒన్స్ అండ్ మల్టీ డివైజ్ ఫీచర్స్‌ను త్వరలో బీటా యూజర్లకు అందించనుంది. అలాగే వాట్సాప్ పైభాగంలో డార్క్ కలర్ బార్ కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.