How To Edit Sent Messages On WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా వాట్సాప్‌లో పంపించిన మెసేజ్‌ను.. మొదటి 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకోనే వీలును కల్పిస్తూ ఫీచర్‌ను తీసుకొచ్చింది. అండ్రాయిడ్, ఐఓఎస్, వాట్సాప్ వెబ్ యూజర్లు అందరికీ దీనిని అందుబాటులోకి తెచ్చింది.
వాట్సాప్ మెసేజ్‌లు పంపించినప్పుడు కొన్నిసార్లు అనుకోకుండా స్పెల్లింగ్ తప్పులు పడుతుంటాయి. పొరపాటున ఒకటి టైప్ చేయడానికి బదులు మరొకటి టైప్ చేసి పంపించేస్తూ ఉంటాం. దీని వల్ల తరువాత చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. అందుకే ఈ సమస్యను నివారించడానికి వాట్సాప్ తాజా ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తప్పులు సరిదిద్దడం మాత్రమే కాదు.. కొత్తగా మరింత సమాచారాన్ని కూడా టైప్ చేసి పంపించవచ్చు. ఇలా సరిదిద్దిన సందేశం.. చాట్‌బాక్స్‌లో ఎడిటెడ్ మెసేజ్ అనే ఇండికేషన్ లేబుల్‌తో కనిపిస్తుంది.
ప్రైవసీకి భంగం కలగదు!
ఈ ఎడిట్ సెంట్ మేసేజ్ ఫీచర్ ద్వారా పంపిన సందేశాలు 'ఎడిటెడ్' లేబుల్‌తో కనిపిస్తాయి. కానీ అవతలి వ్యక్తికి సరిదిద్దిన మెసేజ్ మాత్రమే కనిపిస్తుంది. అంతకు ముందు పంపిన సందేశం కనిపించదు. 'వాట్సాప్‌లో పంపించిన సందేశాలు, ఫొటోలు, వీడియోలు, కాల్స్ అన్నీ ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ ద్వారా చాలా సురక్షితంగా ఉంటాయని, అందువల్ల యూజర్ల ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు' అని వాట్సాప్ చెబుతోంది.
వాట్సాప్ వెబ్‌లో పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేయడం ఎలా?
How To Edit Sent Messages On WhatsApp web :
- మీరు మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో వాట్సాప్ వెబ్‌ను ఓపెన్ చేయాలి.
- web.whatsapp.comలోకి వెళ్లి క్యూఆర్ కోడ్‌ను మీ ఫోన్ ద్వారా స్కాన్ చేయాలి. అప్పుడు వాట్సాప్ ఓపెన్ అవుతుంది.
- మీరు ఎడిట్ చేద్దామని అనుకుంటున్న మెసేజ్ ఉన్న చాట్‌బాక్స్‌ను ఓపెన్ చేయాలి.
- మీరు ఎడిట్ చేద్దామనుకుంటున్న మెసేజ్‌ను క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు ఒక డౌన్ యారో కనిపిస్తుంది. దానిని క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి.
- మీరు పంపించిన సందేశాన్ని సరిద్దిద్దాలనుకుంటే.. ఎడిట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి.. మీరు అనుకున్న విధంగా మెసేజ్‌ను సరిచేయవచ్చు. లేదా అదనంగా మరికొంత సమాచారాన్ని జోడించవచ్చు.
- ఎడిట్ చేసిన మెసేజ్‌ను పంపించగానే.. అది చాట్‌బాక్స్ 'ఎడిటెడ్' లేబుల్‌తో కనిపిస్తుంది.
ఐఓఎస్ యూజర్లు పంపించిన వాట్సాప్ మెసేజ్‌ను ఎలా ఎడిట్ చేయాలి?
How To Edit Sent Messages On iOS :
- ముందుగా వాట్సాప్ ఓపెన్ చేసి, చాట్ బాక్స్‌లోకి వెళ్లాలి.
- చాట్ విండోలోని పంపించిన మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేయాలి.
- లాంగ్ ప్రెస్ చేసిన తరువాత మెసేజ్ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది.
- మీరు మెసేజ్‌ను ఎడిట్ చేసి, సబ్మిట్ చేస్తే.. అవతలి వ్యక్తికి ఎడిటెడ్ మెసేజ్ వెళ్తుంది.
నోట్ : ఐఓఎస్ యూజర్లు మెసేజ్ పంపిన 15 నిమిషాల్లోపే దానిని ఎడిట్ చేసుకోగలరు. 15 నిమిషాలు దాటిన తరువాత ఈ ఎడిట్ ఆప్షన్‌ను మళ్లీ ఉపయోగించలేరు.