ETV Bharat / science-and-technology

వాట్సాప్​ కొత్త ఫీచర్​.. అవి ఒక్కసారి మాత్రమే

author img

By

Published : Aug 4, 2021, 5:32 PM IST

Updated : Aug 4, 2021, 6:23 PM IST

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్​ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది​. ఇంతకీ అదేంటి? దాని వల్ల ఉపయోగమేంటి?

wattsup
వాట్సాప్​

రోజూ వాట్సాప్​లో ఎంతో మందితో ఛాట్ చేస్తుంటాం. ఫొటోలు, వీడియోలు, ఆడియో మెసేజ్‌లు ఇతరులకు పంపుతాం. అయితే వీటిలో సున్నితమైన సమాచారం ఉండొచ్చు. వాటిని పంపించిన తర్వాత మళ్లీ డిలీట్​ చేయాల్సిన పరిస్థితి రావొచ్చు. అంతలో అవి అవతల వ్యక్తి ఫోన్​లో స్టోర్​ అవ్వడం జరిగిపోతుంది. తరచూ మీడియా సమాచారం పంచుకోవడం వల్ల ఫోన్​ స్టోరేజీ​ కూడా ఫుల్​ అయిపోతుంటుంది. ఈ సమస్యలకు చెక్​ పెట్టడానికి ఈ సారి కొత్త ఫీచర్​తో ముందుకొచ్చింది ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సప్​. 'వ్యూ వన్స్'​ పేరుతో అద్భుతమైన ఫీచర్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ఎనేబుల్​ చేయడం వల్ల ఫొటోలు, వీడియోలు పంపిస్తే.. అవతలి వ్యక్తి ఒక్కసారి కన్నా ఎక్కువసార్లు చూసేందుకు వీలుండదు. ఒక్కసారి చూడగానే ఆటోమెటిక్​గా డిలీట్​ అయిపోతాయి. ఫోన్​లోనూ స్టోర్​ కావు. ​

'వ్యూ వన్స్'​ కీ ఫీచర్స్​

  • ఈ ఫీచర్​ వల్ల మనం పంపించిన ఫొటోస్​, వీడియోస్​ లేదా ఇతర మీడియా.. అవతలి వ్యక్తి ఫోన్ గ్యాలరీలో స్టోర్​ కావు.
  • మనం పంపే ఫొటో, వీడియో ఒక్కసారి మాత్రమే చూడటానికి వీలుంటుంది. మరోసారి ఓపెన్​ చేయడం కుదరదు.
  • వీటిని ఫార్వర్డ్​, సేవ్​, స్టార్​, షేర్ చేయలేము.
  • అవతలి వ్యక్తి 'Read receipts' సెట్టింగ్​ ఆన్​చేసుకుంటే.. మనం పంపించిన మీడియాను వారు చూశారా లేదా అనేది తెలుసుకోవచ్చు. వారు ఆ మీడియాను తెరవగానే 'Opened' అని మనకు కనిపిస్తుంది.
  • 14రోజులలోపు ఫొటో లేదా వీడియోను ఓపెన్​ చేసి చూడకపోతే.. అది చాట్​ నుంచి దానంతటదే డిలీట్​ అయిపోతుంది.
  • వ్యూ వన్స్​ ద్వారా ఫొటో లేదా వీడియో పంపించాలంటే.. మెసేజ్​ ప్రివ్యూలో ప్రతిసారి 'వ్యూ వన్స్'​ ఐకాన్​ను క్లిక్​ చేయాలి.
  • వ్యూ వన్స్​ మీడియాను ఓపెన్​ చేయకపోతే బ్యాకప్ ద్వారా​ దాన్ని రీస్టోర్​ చేసుకోవచ్చు. ఒకవేళ తెరిస్తే బ్యాకప్​లో స్టోర్​ కాదు.

'వ్యూ వన్స్​' ద్వారా ఫొటో లేదా వీడియోను ఎలా పంపాలి?

ఫొటో లేదా వీడియో పంపించే సమయంలో.. సెంట్​ బటన్​ పక్కన '1' అని కనిపిస్తుంది. దీనిపై ప్రెస్​ చేయాలి. దీనిద్వారా అవతల వ్యక్తి ఓ సారి ఓపెన్​ చేయగలరు. అనంతరం మళ్లీ దాన్ని తిరిగి చూడలేదు. ఆటోమెటిక్​గా అది డిలీట్​ అయిపోతుంది. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ద్వారా వ్యూవన్స్​ మీడియాకు భద్రత లభిస్తుంది. వాట్సాప్​ కూడా ఈ మీడియాను చూడదు. మొత్తంగా వ్యక్తిగత ఫొటోలు, సున్నితమైన సమాచారం పంపించేందుకు ఈ​ ఫీచర్​ చాలా ఉపయోగపడుతుంది.

హ్యాకర్లకు చిక్కదు..థర్డ్‌ పార్టీలకు దొరకదు..!

వాట్సాప్‌లో షేర్ చేసే సమాచారం సురక్షితమేనా? అనే సందేహం ఎంతో కాలంగా వేధిస్తున్న ప్రశ్న. అందుకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత కల్పిస్తున్నామని వాట్సాప్ చెబుతోంది. దానివల్ల యూజర్స్ మధ్య జరిగే సంభాషణలను వాట్సాప్‌తో సహా మూడో వ్యక్తి కూడా చూడలేరు. మరి వాట్సాప్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో ఉన్న మెసేజ్‌లకు ఎలాంటి భద్రత ఉంటుందనేది చాలా కాలంగా యూజర్స్ లేవనెత్తుతున్న సందేహం. ఇకమీదట వాట్సాప్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో స్టోర్ అయిన మెసేజ్‌లు ఇతరులు యాక్సెస్ చేయకుండా వాటికి కూడా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ వెల్లడించింది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) పేర్కొంది. అలానే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్ అయిన మెసేజ్‌లను గూగుల్ డ్రైవ్‌లో స్టోర్‌ చేసుకోవచ్చని తెలిపింది. దీనివల్ల థర్డ్‌పార్టీలు ఫోన్‌లో బ్యాక్‌అప్‌ అయిన వాట్సాప్ మెసేజ్‌లను యాక్సెస్‌ చేయలేవు. అలానే హ్యాకర్స్‌ నుంచి కూడా యూజర్ డేటాకు రక్షణ ఉంటుందని వాట్సాప్ తెలిపింది.

ఇప్పటికే వాట్సాప్ క్లౌడ్‌లో స్టోర్‌ అయ్యే ఛాట్‌ బ్యాక్‌అప్‌లకు 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్‌ కీతో రక్షణ కల్పించనున్నట్లు ప్రకటించింది. ఒకవేళ యూజర్ 64-డిజిట్ ఎన్‌క్రిప్షన్ పాస్‌కోడ్ మర్చిపోతే డేటా రికవరీ చేయడం కుదరదు. అలాగే, వాట్సాప్ డేటాను కూడా యాక్సెస్ చేయలేరు. దీంతోపాటు మల్టీడివైజ్‌ ఫీచర్‌లో కూడా ప్రతి డివైజ్‌కు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ ప్రొటెక్షన్ ఉంటుందని వాట్సాప్ తెలిపింది. తాజాగా ఫోన్‌లో లోకల్‌ బ్యాక్‌అప్‌లో స్టోర్‌ అయ్యే మెసేజ్‌లకు ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షణ కల్పించనుంది.

ఇదీ చూడండి: వాట్సాప్​ మెసేజ్​ బుక్​మార్క్.. మీకు తెలుసా?

Last Updated : Aug 4, 2021, 6:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.