ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో ఫ్రీగా క్రెడిట్ స్కోర్.. ఎలా చూసుకోవాలో తెలుసా?

లోన్ తీసుకోవాలన్నా, వడ్డీ రాయితీలు పొందాలన్నా.. మంచి క్రెడిట్ స్కోరు చాలా ముఖ్యం. అనేక కంపెనీలు క్రెడిట్ స్కోరును అందిస్తుంటాయి. అయితే.. ఉచితంగా, సులభంగా క్రెడిట్ స్కోరును ఎలా చూసుకోవాలో చాలా మందికి తెలిసి ఉండదు. మరి వాట్సాప్​లోనే క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చని చెబితే?.. నిజమే మరి.. ఎలాగో తెలుసుకోండి.

WHATSAPP FREE CREDIT SCORE
WHATSAPP FREE CREDIT SCORE
author img

By

Published : Nov 13, 2022, 3:51 PM IST

వాట్సాప్​లో ఉచితంగా క్రెడిట్ స్కోరు చూసుకునే ఫీచర్ దేశంలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఎక్స్​పీరియన్ అనే డేటా అనలిటిక్స్ కంపెనీ.. వాట్సాప్​ యూజర్స్​కు ఫ్రీగా క్రెడిట్ స్కోరు అందిస్తోంది. సెకన్ల వ్యవధిలో వాట్సాప్ యూజర్లు తమ క్రెడిట్ స్కోరు చూసుకోవచ్చు. స్కోరులో ఏవైనా అవకతవకలు ఉన్నట్లు అనిపిస్తే వెంటనే సరిచేసుకోవచ్చు. మెసేజింగ్ యాప్ ద్వారా ఇలాంటి సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఎక్స్​పీరియనే కావడం విశేషం. గణాంకాల ప్రకారం వాట్సాప్​కు భారత్​లో 48.75 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. ఉచితంగా వివరాలను అందించడం ద్వారా.. వీరికి క్రెడిట్ స్కోరుపై అవగాహన పెంచవచ్చని ఎక్స్​పీరియన్ భావిస్తోంది.

ఉచితంగా క్రెడిట్ స్కోరు ఎలా చెక్ చేసుకోవాలంటే?

  • ముందుగా, వాట్సాప్​లో 'Hey' అని టైప్ చేసి +919920035444 నెంబర్​కు మెసేజ్ పంపించాలి.
  • నంబర్​ సేవ్ చేసుకోవడానికి బదులు ఈ లింక్​పై https://wa.me/message/LBKHANJQNOUKF1 క్లిక్ చేసినా వాట్సాప్ ఎక్స్​పీరియన్ చాట్ విండో ఓపెన్ అవుతుంది.
  • ఎక్స్​పీరియన్ చాట్ విండోలో మీ వివరాలు టైప్ చేయాలి.
  • ధ్రువపత్రాల్లో ఉన్న విధంగా పేరు నమోదు చేయాలి.
  • అనంతరం, ఈమెయిల్ అడ్రెస్​ను ఇవ్వాలి.
  • ఆ తర్వాత ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
  • ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత ఫోన్ నెంబర్​కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే.. వెంటనే మన క్రెడిట్ స్కోరు వివరాలు వాట్సాప్ చాట్​లోకి వచ్చేస్తాయి.

ఎక్కువైతే.. మ్యూట్ చేసేస్తుంది!
వాట్సాప్​లో నోటిఫికేషన్ ఓవర్​లోడ్ సమస్యను తగ్గించేందుకు సంస్థ ప్రయత్నాలు చేస్తోంది. గ్రూపులలో 256 కన్నా ఎక్కువ మంది సభ్యులు ఉంటే.. ఆటోమెటిక్​గా నోటిఫికేషన్స్ మ్యూట్ అయ్యేలా కొత్త పద్ధతిని పరీక్షిస్తోంది. గ్రూప్​లో సభ్యుల గరిష్ఠ సంఖ్యను 256 నుంచి 1,024కు పెంచిన నేపథ్యంలో ఈ కొత్త ఫీచర్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. వాట్సాప్ బీటా వెర్షన్ 2.22.23.9లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని సమాచారం. ఏదైనా గ్రూప్​లో సభ్యుల సంఖ్య 257కు చేరితే.. వెంటనే ఆ గ్రూప్ నోటిఫికేషన్లు డీఫాల్ట్​గా మ్యూట్ అయిపోతాయి. నోటిఫికేషన్లు ముందులా రావాలని కోరుకుంటే.. యూజర్లు మ్యానువల్​గా సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.