ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అభివృద్ధి చేస్తూ.. యూజర్లకు వాటిని అందుబాటులోకి తెస్తోంది. ఇదే క్రమంలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం 'కెప్ట్' అనే సరికొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా డిసప్పియరింగ్ మెసేజెస్ను సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అప్డేట్ బీటా యూజర్లకు ఇంకా అందుబాటులోకి రాలేదు.
వాట్సాప్ యూజర్స్ కొందరు డిసప్పియరింగ్ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగిస్తుంటారు. అందులో 24 గంటల్లో, 7 రోజుల్లో, 90 రోజుల్లో మెసేజెస్ ఆటోమెటిక్‌గా డిలీట్ అయ్యే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటారు. ఈ విధంగా వాట్సాప్‌లో వారు పంపిన మెసేజెస్ వాటంతట అవే అదృశ్యం అయ్యేలా చేసి వారి వ్యక్తిగత గోప్యతను కాపాడుకుంటారు.
అయితే వాట్సాప్ ఇప్పుడు తీసుకుని రావాలనుకుంటున్న 'కెప్ట్' అనే ఫీచర్.. వాటంతట అవే అదృశ్యమైన మెసేజెస్ను సేవ్ చేస్తుంది. ఇలా డిసప్పియరింగ్ మెసేజెస్ను సేవ్ చేసేందుకు 'కెప్ట్ మెసెజ్' ఫీచర్ ఓ మార్గం. దీనివల్ల కమ్యూనికేషన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఈ మెసేజెస్ కన్పిస్తాయి. ఒకవేళ యూజర్స్‌కు మెసేజెస్ను స్టోర్ చేయటం ఇష్టం లేకపోతే వారు వాటిని 'అన్-కెప్ట్' చేసుకోవచ్చు. ఇలా మెసేజెస్ను అన్-కెప్ట్ చేసుకున్న వెంటనే అవి ఆ చాట్‌లో కనిపించవు. కెప్ట్ ఫీచర్ ద్వారా సేవ్ చేసిన మెసేజెస్ను.. పక్కనే ఉండే బుక్‌మార్క్ చిహ్నం ద్వారా గుర్తించవచ్చు. ఈ ఫీచర్‌ను కొత్త వెర్షన్లో అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ ప్రయత్నిస్తోంది.
ఇవీ చదవండి: