Whatsapp Cross Platform Messaging : ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ రోజుకో కొత్త అప్డేట్ లేదా ఫీచర్‌తో వినియోగదారులను పలకరిస్తోంది. ఇటీవలే అనేక ఫీచర్లు, అప్డేట్లను తీసుకొచ్చిన ఈ చాటింగ్ యాప్ మరో సరికొత్త ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తేనుంది. అదే 'థర్డ్ పార్టీ చాట్స్' లేదా 'క్రాస్-ప్లాట్‌ఫామ్ చాట్స్'. అంటే ఈ ఫీచర్ సాయంతో వాట్సాప్ అప్లికేషన్లో నుంచే నేరుగా టెలిగ్రామ్, వీచాట్, సిగ్నల్ లాంటి చాటింగ్ యాప్‌లలో మీ స్నేహితులకు మెసేజెస్ను పంపించుకోవచ్చు. అయితే ఈ థర్డ్-పార్టీ చాట్ ఫీచర్‌ను కొత్త ఈయూ మార్గదర్శకాలకు అనుగుణంగా మెటా పరీక్షిస్తున్నట్లు సమాచారం.( Whatsapp Latest Update )
Whatsapp Third Party Chat Support : ఈ క్రాస్ ప్లాట్‌ఫామ్ మెసేజింగ్ ఫీచర్ వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇటీవలే ప్రవేశపెట్టిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్(DMA)లో స్పష్టం చేసింది. దీని ప్రకారం మెసేజింగ్ టెక్ దిగ్గజాల్లో ఒకటైన మెటా తన అనుబంధ కంపెనీ వాట్సాప్ నుంచి ఇతర చాట్ యాప్‌లకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో యూజర్స్ ఇక్కడ (వాట్సాప్) నుంచే ఇతరులతో కమ్యునికేట్ అవ్వచ్చు. కాగా, ఈ నిబంధనలు వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నుంచి అమల్లోకి రానున్నాయి.
Whatsapp Cross Platform Communication : ఆండ్రాయిడ్ వెర్షన్ 2.23.19.8లోని వాట్సాప్ ఖాతాలో కొత్త బ్లాంక్ లేబుల్ కలిగిన స్క్రీన్‌పై 'థర్డ్ పార్టీ చాట్స్' లాంటి ఇంటర్ఫేస్ను గమనించవచ్చు. అయితే ఇది క్రాస్-ప్లాట్‌ఫామ్ కమ్యునికేషన్ కోసం వాట్సాప్ తీసుకురానున్న ఫీచర్ సపోర్ట్ అని తెలుస్తోంది. ఇందుకోసమే ఈయూ నిబంధనలను అనుసరించి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. ఫలితాలు సానుకూలంగా వస్తే గనుక త్వరలోనే ఇది అందరికీ అందుబాటులోకి రానుంది.
వాట్సాప్ రీస్టోర్ ఇలా!
WhatsApp Restore Account : మీ ఫోన్ పోయిందని బాధపడుతున్నారా? దీనితో మీ వాట్సాప్ కాంటాక్ట్స్, పర్సనల్ మెసేజెస్ అన్నీ పోయాయని చింతిస్తున్నారా? ఈ 6 సింపుల్ టిప్స్‌తో మీ వాట్సాప్ అకౌంట్‌ను తిరిగి రీస్టోర్ చేసుకోవచ్చు. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
WhatsApp Latest Update : వాట్సాప్ యూజర్స్‌కు గుడ్ న్యూస్.. త్వరలోనే న్యూ ఇంటర్ఫేస్ షురూ!