WhatsApp Group vs WhatsApp Broadcast : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది వాడే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వాట్సాప్ ఒకటి. దాదాపు ప్రతి ఒక్కరి స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్ కచ్చితంగా ఉంటుంది! 2009లో ప్రారంభమైన ఈ ఆన్లైన్ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్.. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. తర్వాత ఈ యాప్‌ను ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. అయితే వాట్సాప్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. తాజాగా వాట్సాప్ ఛానల్స్ అనే మరో సూపర్ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే గ్రూపులు, ఛానళ్లకు మధ్య తేడా ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానాలు మీకోసం..
WhatsApp Communities vs Groups :
- వాట్సాప్ గ్రూపుల్లో 1024 మంది సభ్యుల వరకు మాత్రమే ఉండే అవకాశం ఉంది. కానీ ఛానల్స్ సబ్స్క్రైబర్ల సంఖ్యపై మాత్రం వాట్సాప్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
- వాట్సాప్ ఛానల్స్ కోసం సెర్చబుల్ డైరెక్టరీ సదుపాయాన్ని కల్పించింది. కానీ గ్రూపులకు అలాంటి అవకాశం లేదు. ఎందుకంటే గ్రూపు అనేది కొందరి వ్యక్తిగత పనుల కోసం వినియోగిస్తారు. కానీ ఛానల్స్ అలా కాదు. కాబట్టి అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ అవకాశాన్ని కల్పించింది. అయితే, ఛానల్ అడ్మిన్ మాత్రం ఈ సెర్చ్‌పై పూర్తి అధికారాన్ని కలిగి ఉంటారు.
- ఛానల్స్ నుంచి యూజర్లకు వచ్చే మెసేజ్‌లను ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయడానికి వీలుండదు. అయితే, వినియోగదారుల ప్రైవేటు చాటింగ్‌కు మాత్రం ఎలాంటి అంతరాయం ఉండదు. వారి చాటింగ్ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతుంది.
- వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుల ప్రొఫైల్ ఫొటో, ఫోన్ నంబర్ కనిపిస్తుంది. కానీ ఛానల్స్‌లో అలాంటి వివరాలు ఏమి కనిపించవు.
- కొత్తగా ఛానల్లో జాయిన్ అయినపుడు మీ ఫోన్ నంబర్.. అడ్మిన్‌కు కనిపించదు. దీంతో మీ వివరాలు ఏమీ తెలియకుండానే ఇష్టమైన ఛానల్లో జాయిన్ కావచ్చు.
- ఛానల్లో వచ్చిన సమాచారాన్ని స్క్రీన్‌షాట్, ఫార్వర్డ్ చేయకుండా అడ్మిన్ నియంత్రివచ్చు. కానీ వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి అవకాశం లేదు.
- వాట్సాప్ ఛానల్ హిస్టరీ కేవలం 30 రోజుల వరకే సర్వర్లలో ఉంటుంది. అదే గ్రూపుల్లో అయితే, 24 గంటల నుంచి వారం, 90 రోజుల ఇలా మనం ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి ఉంటుంది. ఒకవేళ వ్యూ వన్స్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఒక్కసారి చూడగానే మెసేజ్ మాయం అవుతుంది.
ఇవీ చదవండి : వాట్సాప్‌లో ఇకపై HD క్వాలిటీలో ఫొటోలు పంపే వీలు!
వీడియో కాల్లో స్క్రీన్ షేరింగ్.. వాట్సాప్‌లో సూపర్ ఫీచర్!