ETV Bharat / science-and-technology

'గూగుల్ ఫొటోస్​'కు ప్రత్యామ్నాయాలు ఇవే.. - గూగుల్​ క్లౌడ్​ స్టోరేజ్​పై పరిమతులు

ప్రస్తుతం అపరిమితంగా ఉన్న గూగుల్​ ఫొటోస్​ స్టోరేజ్ సదుపాయం జూన్​ 1 నుంచి 15జీబీకి తగ్గనుంది. అదనపు స్టోరేజ్​ కావాలంటే గూగుల్​కు డబ్బు చెల్లించాల్సిందే. మరి గూగుల్​ ఫొటోస్​కు మార్కెట్లో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటి? వాటిలో ఎంత జీబీ వరకు ఉచితంగా ఫైళ్లు, ఫొటోలను స్టోర్​ చేసుకోవచ్చు? అనే వివరాలు మీ కోసం.

Alternative cloud storage to Google
గూగుల్​కు ప్రత్యామ్నాయ క్లౌడ్​ స్టోరేజ్​లు
author img

By

Published : Feb 28, 2021, 12:05 PM IST

ప్రస్తుతం 'గూగుల్‌ ఫొటోస్‌'లో ఉచిత అన్‌లిమిటెడ్‌ స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది. అయితే ఇటీవల క్లౌడ్ విధానాల్లో చేసిన మార్పులతో ఇకపై 15జీబీ స్టోరేజ్‌ మాత్రమే యూజర్స్‌ ఉచితంగా పొందనున్నారు. ఈ ఏడాది జూన్‌ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నట్లు గూగుల్​ ఇదవరకే వెల్లడించింది.

స్టోరేజ్‌ పరిమితి దాటితే?

2021 జూన్‌ 1 లోపు 15జీబీ పరిమితి దాటిన యూజర్స్‌కి స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్ టూల్స్‌ని గూగుల్ అందిస్తుంది. గూగుల్‌ వన్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్ ద్వారా ఏయే కేటగిరీకి (ఫొటోస్‌, డ్రైవ్, జీమెయిల్‌) ఎంత మెమొరీ ఆక్రమించిందనేది ఇందులో చూసిస్తుంది. దాని ద్వారా అవసరం లేని ఫైల్స్‌ని సులభంగా డిలీట్‌ చేసుకోవచ్చు. అలానే 15జీబీ స్టోరేజ్‌ని మేనేజ్‌ చేసుకోవచ్చు.

ఒక వేళ ఎక్కువ స్టోరేజ్‌ కావాలనుకునేవారు నెలవారీ చందా చెల్లించి స్టోరేజ్‌ కొనుగోలు చేసుకోవచ్చు. ఇందుకు 100జీబీ స్టోరేజ్‌ కోసం నెలకు రూ. 130, ఏడాదికైతే. రూ.1,300 చెల్లించాల్సి ఉంటుంది.

మరి గూగుల్ ఫొటోస్​ కాకుండా స్టోరేజ్ కోసం ఉన్న ఉత్తమ క్లౌడ్​ సేవల సంస్థలేవి? వాటిలో ఎంత జీబీ వరకు ఉచితంగా స్టోరేజ్​ సదుపాయం పొందొచ్చు? అధిక స్టోరేజ్​ కోసం గూగుల్ క్లౌడ్​ కాకుండా మార్కెట్​లో ఉన్న ఇతర అవకాశాలేమిటి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

వన్​డ్రైవ్​

వన్​డ్రైవ్​.. టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​కు చెందిన క్లౌడ్ స్టోరేజ్​సేవల విభాగం. ఇందులో 5జీబీ స్టోరేజ్​ మాత్రమే ఉచితం. గూగుల్​ ఫొటోస్​తో పోలిస్తే ఇది చాలా తక్కువ. అయితే నెలకు రూ.140 చెల్లిస్తే 100 జీబీ స్టోరేజ్​​ వాడుకునేందుకు వీలు కల్పిస్తోంది వన్​ డ్రైవ్​.

one drive
వన్​ డ్రైవ్​

ఒకవేళ మీకు మైక్రోసాఫ్ట్​ 365 సబ్​స్క్రిప్షన్​ ఉంటే కొత్తగా స్టోరేజ్​ కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ యూజర్లందరికీ ఒక టెరాబైట్​ (టీబీ) వరకు ఫొటోస్​, ఫైళ్లు స్టోరేజ్​ చేసుకునే వీలుంది.

అమెజాన్​ ఫొటోస్​

గూగుల్​ ఫొటోస్​కు మంచి ప్రత్యామ్నాయంగా అమెజాన్​ ఫొటోస్​ను చెప్పుకోవచ్చు. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్​ అయితే మీకు అపరిమిత ఫొటోస్​, 5 జీబీ వీడియో స్టోరేజ్ సదుపాయం లభిస్తుంది.

Amazon photos
అమెజాన్ ఫోటోస్​

ప్రైమ్​ సభ్యులు కాని యూజర్లకు 5జీబీ ఫొటోస్​, వీడియో స్టోరేజ్​ మాత్రమే ఉచితంగా లభిస్తుంది. ఇది గూగుల్​ ఫొటోస్​తో పోలిస్తే చాలా తక్కువ. ఇందులో 100 జీబీ క్లౌడ్​ స్టోరేజ్​ కోసం రూ.148 వసూలు చేస్తోంది అమెజాన్​.

ప్రస్తుతానికి ఈ సదుపాయం కొన్ని దేశాలకే పరిమితంగా ఉంది. రానున్న కొన్ని నెలల్లో భారత్​లో ఈ సేవలు ఆరంభించనున్నట్లు సమాచారం. అప్పటి వరకు వేచి చూడటం ఎందుకనుకుంటే.. ఏపీకే యాప్​డౌన్​లోడ్ చేసుకుని వాడేందుకు వీలుంది.

డిజీబాక్స్​

డిజీబాక్స్​ అనేది భారత్​కు చెందిన క్లౌడ్​ సేవల సంస్థ. ఇందులో 20 జీబీ స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. జీమెయిల్ అనుసంధానంతో దీనిని వాడుకునే వీలుంది. తమ సేవలు ఎండ్ టూ ఎండ్​ ఎన్​క్రిప్టెడ్​ విధానంలో భద్రపరిచి ఉంటాయి.

డిజీబాక్స్ అత్యంత చౌకగా నెలకు కేవలం రూ.30తో.. 100 జీబీ క్లౌడ్​ స్టోరేజ్ వాడుకునే వీలు కల్పిస్తోంది. ​రూ.360 చందాతో వార్షిక ప్లాన్​ కూడా అందుబాటులో ఉంది.

డీగూ..

ఎక్కువ స్టోరేజ్​ ఉచితంగా కావాలనుకునే వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఆ విషయంలో గూగుల్​ ఫొటోస్​కు ఉత్తమ ప్రత్యామ్నాయంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 100 జీబీ వరకు ఫైళ్లను ఉచితంగా స్టోర్​ చేసుకునే వీలు ఇందులో ఉంది. దీనితో పాటు ఈ యాప్​ సెక్యూరిటీ విషయంలోనూ పక్కగా వ్యవహరిస్తోంది.

ఫైళ్లు ఎండ్​ టూ ఎండ్ ఎన్​క్రిప్టెడ్​ విధానంలో భద్రంగా ఉంటాయి. కేవలం మూడు డివైజ్​లతో మాత్రమే ఫైళ్లను అప్​లోడ్​ చేసేందుకు వీలుంటుంది. దీనితో పాటు యాప్​లో యాడ్​లు కూడా ఉండవు.

ఒకవేళ మీరు డీగూకి సైన్​ అప్​ చేసుకుంటే 5జీబీ స్టోరేజ్​ అదనంగా లభిస్తుంది. ఇక పేయిడ్​ స్టోరేజ్ విషయానికొస్తే.. 500జీబీ కోసం నెలకు దాదాపు రూ.220, 10 టీబీ స్టోరేజ్​ కోసం నెలకు దాదాపు రూ.735 చొప్పున చందా చెల్లిస్తే సరిపోతుంది. ఇతర కంపెనీల స్టోరేజ్​ ప్లాన్​లతో పోలిస్తే ఈ ఛార్జీలు చౌకనే చెప్పాలి.

ఇదీ చదవండి:ఆ నిబంధన కొత్తది కాదు- కేంద్రం వివరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.