ETV Bharat / science-and-technology

పాత ల్యాప్​టాప్ కొంటున్నారా? ఈ 5 టెస్టులు చేస్తేనే మీరు సేఫ్! - పాత ల్యాప్​టాప్ టెస్ట్

Used laptop test: సెకండ్ హ్యాండ్​లో కంప్యూటర్ లేదా ల్యాప్​టాప్ కొంటున్నారా? మరి కొనే ముందు ల్యాప్​టాప్​/ పీసీలో ఏమేం చెక్ చేయాలో తెలుసా? కొన్ని సింపుల్ టెస్టులు నిర్వహించి ల్యాప్​టాప్ పరిస్థితిపై ఓ అంచనాకు రావొచ్చు. అవేంటో చూసేయండి..

Buying Used Windows PC Laptop
Buying Used Windows PC Laptop
author img

By

Published : Jun 21, 2022, 7:21 PM IST

Used laptop testing software: వాడేసిన కంప్యూటర్, ల్యాప్​టాప్​ను కొనడం కొన్నిసార్లు తప్పకపోవచ్చు. కొత్తవాటితో పోలిస్తే తక్కువ ధరకు వస్తుండటం వల్ల కొన్నిసార్లు సెకండ్ హ్యాండ్​కు ప్రాధాన్యం ఇస్తుంటాం. అలాంటప్పుడు ఎలాంటి ల్యాపీని లేదా కంప్యూటర్​ను ఎంచుకోవాలనే విషయంలో సందిగ్ధం ఉంటుంది. కొత్త ల్యాప్​టాప్​లు అంటే వాటి ఫీచర్లు, లుక్ చూస్తే సరిపోతుంది. కానీ సెకండ్ హ్యాండ్ విషయంలో అది సరిపోదు. ఫీచర్లతో పాటు వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని టెస్టులు చేయాలి. విండోస్ పీసీ,ల్యాప్​టాప్​ల విషయంలో ఎలాంటి టెస్టులు చేయాలో ఇప్పుడు చూద్దాం.

1. ర్యామ్ టెస్ట్

పీసీ లేదా ల్యాప్​టాప్ కొనేటప్పుడు ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ లేదా ర్యామ్​ను చెక్ చేయాలి. ర్యామ్​లో లోపాలు ఉంటే కంప్యూటర్ క్రాష్ అవుతుంటుంది. గ్రాఫిక్స్ సరిగా లోడ్ అవ్వవు. పర్ఫార్మెన్స్ నెమ్మదిస్తుంది. ఎర్రర్​లకు లెక్కే ఉండదు. ర్యామ్ టెస్ట్ చేసేందుకు థర్డ్ పార్టీ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, విండోస్ మెమొరీ డయాగ్నోస్టిక్ టూల్​ను ఉపయోగించడమే బెటర్. ఈ టెస్టు చేసే ముందు ఏవైనా సేవ్ చేయని ప్రోగ్రామ్స్ ఉంటే చూసుకోవాలి.

టెస్ట్ ఇలా...

  • 'విండోస్ ప్లస్ ఆర్' బటన్లు నొక్కి రన్ ప్రాంప్ట్​ను ఓపెన్ చేయాలి.
  • రన్ ప్రాంప్ట్​లో mdsched.exe టైప్ చేసి ఎంటర్ చేయాలి.
  • రీస్టార్ట్ నౌ అన్న బటన్​పై నొక్కాలి.
  • ఇలా చేశాక.. విండోస్ ఓసారి రీస్టార్ట్ అవుతుంది. బూటింగ్ తర్వాత మెమొరీ డయాగ్నోస్టిక్ టూల్ పని ప్రారంభమవుతుంది. టెస్ట్ రన్ పూర్తయ్యాక విండోస్ మళ్లీ రీస్టార్ట్ అవుతుంది.
  • రెండోసారి రీస్టార్ట్ అయ్యాక టెస్టు ఫలితాలు కనిపిస్తాయి. లేదంటే విండోస్ ఈవెంట్ వ్యూయర్​ను ఉపయోగించి ఫలితాలు చూడాలి.
  • ఇందుకోసం విండోస్ స్టార్ట్ బటన్​పై మౌస్ ద్వారా లెఫ్ట్ క్లిక్ చేసి.. ఈవెంట్ వ్యూయర్​పై క్లిక్ చేయాలి.
  • విండోస్ లాగ్స్​లోకి వెళ్లి నేవిగేట్ సిస్టమ్స్​ను క్లిక్ చేయాలి.
  • యాక్షన్స్ ట్యాబ్​లో ఫైండ్ అనే ఆప్షన్​ను క్లిక్ చేయాలి.
  • MemoryDiagnostic అని టైప్ చేసి ఫైండ్ నెక్ట్స్​పై క్లిక్ చేయాలి.
  • అందులో టెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి.

2. హార్డ్ డ్రైవ్​ చెక్

పాత పీసీలు, ల్యాప్​టాప్​ల హార్డ్ డ్రైవ్​లు బాగున్నాయా లేదా అన్న విషయాన్ని చూసుకోవాలి. హార్డ్ డ్రైవ్​లు చెడిపోతే.. డ్రైవ్​ల నుంచి ట్రాన్స్​ఫర్ అయ్యే సమాచారాన్ని కంప్యూటర్ సరిగా గుర్తించదు. ఫైల్ లోడింగ్ ఆలస్యం అవుతుంది. కంప్యూటర్ క్రాష్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.

  • క్రిస్టల్​డిస్క్​ఇన్ఫో అనే టూల్ ద్వారా హార్డ్ డ్రైవ్​ల గురించి తెలుసుకోవచ్చు.
  • ఫస్ట్, క్రిస్టల్​డిస్క్​ఇన్ఫోను ఇన్​స్టాల్ చేసుకోవాలి.
  • ఈ టూల్​ని ఓపెన్ చేయగానే హార్డ్ డ్రైవ్​ల గురించి సమాచారం మొత్తం స్క్రీన్​పై కనిపిస్తుంది.
  • ఒకటికంటే ఎక్కువ డ్రైవ్​లు ఉన్నా సులభంగా దీని ద్వారా చూసేయొచ్చు.
  • హార్డ్ డ్రైవ్ టెంపరేచర్ 30 నుంచి 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉంటే దాన్ని ఆరోగ్యకరమైన డ్రైవ్​గా పరిగణిస్తారు. ఎట్టిపరిస్థితుల్లో టెంపరేచర్ 70కి మించకూడదు.

3. బ్యాటరీ హెల్త్

పీసీలు నేరుగా విద్యుత్​తో పనిచేస్తాయి. కానీ, ల్యాప్​టాప్​లకు ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అవసరం. వీటి బ్యాటరీ సామర్థ్యం వాడుతున్నాకొద్దీ తగ్గిపోతుంది. బ్యాటరీ కొంచెం పాడైనా.. వెంటనే రీప్లేస్ చేయించాల్సి ఉంటుంది. అందువల్ల ముందే బ్యాటరీ హెల్త్​ను చెక్ చేయాలి.

  • విండోస్ సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి cmd అని టైప్ చేయాలి.
  • కమాండ్ ప్రాంప్ట్​పై రైట్ క్లిక్ చేసి.. Run as administratorను ఎంపిక చేసుకోవాలి.
  • అందులో powercfg/batteryreport అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి.
  • వెంటనే బ్యాటరీ రిపోర్ట్ స్క్రీన్​పై కనిపిస్తుంది. దీన్ని సేవ్ చేసుకొని పరిశీలించాలి. ఫుల్ ఛార్జ్ తర్వాత ఎంత సేపు ల్యాప్​టాప్ పనిచేస్తుందో చూసుకోవాలి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ బాలేకపోతే.. రీప్లేస్ చేయడానికయ్యే ఖర్చును ముందుగానే అంచనా వేసుకోవాలి.

4. సీపీయూ, జీపీయూ స్ట్రెస్ టెస్టింగ్

ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ ఆడటం, హై ఎండ్ టెక్నికల్ వర్క్స్ కోసం సెకండ్ హ్యాండ్ పీసీ కొనాలని అనుకుంటే సీపీయూ, జీపీయూను తనిఖీ చేయడం చాలా అవసరం. పీసీ సీపీయూ ఎంత మేరకు ఒత్తిడి తట్టుకుంటుందో చెక్ చేసుకోవాలి. ఇందుకు స్ట్రెస్ టెస్టింగ్ నిర్వహించాలి. దీని ద్వారా కంప్యూటర్ హార్డ్ వేర్(సీపీయూ, జీపీయూ) పర్ఫార్మెన్స్​ను గరిష్ఠ స్థాయిలో పరీక్షించవచ్చు. ఎక్కువ లోడ్​ను కంప్యూటర్ ఏమేరకు హ్యాండిల్ చేస్తుందో తెలుసుకోవచ్చు. స్ట్రెస్ టెస్ట్​ను పీసీ తట్టుకుంటే బాగా పనిచేసినట్టే. లేదంటే మధ్యలోనే క్రాష్ అయిపోతుంది.

  • జీపీయూ టెస్ట్ కోసం Furmark అనే టూల్​ను డౌన్​లోడ్ చేసుకోవాలి.
  • సీపీయూ టెస్ట్ కోసం ప్రైమ్95 టూల్ ఉత్తమంగా పనిచేస్తుంది.
  • Memtest86 అనే టూల్ ద్వారా ర్యామ్ టెస్ట్ నిర్వహించుకోవచ్చు.
  • అయితే, జీపీయూ, సీపీయూ టెస్ట్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

5. సీపీయూ, జీపీయూ టెంపరేచర్​ చెకింగ్

స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో కంప్యూటర్ హీట్ అవ్వకుండా చూసుకోవాలి. కొన్నిసార్లు పీసీ దాని గరిష్ఠ పర్ఫార్మెన్స్ ఇచ్చేలోపే.. టెంపరేచర్ ఎక్కువై క్రాష్ అయిపోతుంటాయి. అలాంటప్పుడు పీసీ/ల్యాపీకి అదనపు కేస్ ఫ్యాన్ అవసరమవుతాయా అని చూసుకోవాలి. లేదా కూలింగ్ కిట్ అమర్చుకోవాలి.
NZXT's CAM సాఫ్ట్​వేర్ సాయంతో ఫ్యాన్ స్పీడ్​ను నియంత్రించుకోవచ్చు. తద్వారా పీసీ టెంపరేచర్​ను తగ్గించవచ్చు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.