Twitter Server Down Today : ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ (ట్విట్టర్) సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 11:02 గంటల ప్రాంతంలో నిలిచిపోయిన వీటి సేవలు దాదాపు గంట తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్విట్టర్ యూజర్స్‌కు ఈ సమస్య తలెత్తింది. దీంతో కొందరు యూజర్స్ సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మెంబర్షిప్ యూజర్స్‌కు సైతం
Twitter Services Restored : తమ ట్విట్టర్ ఖాతాలను తెరవగానే టైమ్లైన్లు ఖాళీగా కనిపించాయని పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఏదైనా పోస్ట్ చేస్తే ఆ ట్వీట్లు మాత్రం టైమ్‌లైన్‌లో కన్పించలేదని తెలిపారు. అటు ఫాలోయింగ్, ఫర్ యూ, లిస్ట్ పేజీలు కూడా ఖాళీగా దర్శనమిచ్చాయని చెప్పారు. సాధారణ ట్విట్టర్ అకౌంట్‌తో పాటు ట్విట్టర్ ప్రీమియం, ఎక్స్-ప్రో వెర్షన్‌ల సేవలకు కూడా ఈ అంతరాయం ఏర్పడినట్లు మెంబర్షిప్ యూజర్స్ కొందరు పేర్కొన్నారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరీ ట్విట్టర్ యాజమాన్యంపై అసహనం వ్యక్తం చేశారు.
దేశంలో 4,000 మంది, ప్రపంచవ్యాప్తంగా 73,800 మంది ట్విట్టర్ వినియోగదారులు ట్విట్టర్ సర్వర్ డౌన్ సమస్యపై ఫిర్యాదులు చేశారని ఓ ప్రముఖ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. దీనిపై దాదాపు 64 శాతం మంది యూజర్స్ ట్విట్టర్ వేదికగా రిపోర్ట్ చేయగా 29 శాతం మంది డౌన్‌డిటెక్టర్ అనే ప్రముఖ వెబ్సైట్ ద్వారా కంప్లైంట్ చేశారని చెప్పింది.
ఆ కారణాల వల్లే ఇలా
ఇక అమెరికాలో దాదాపు 47వేల మందికి పైగా యూజర్లకు ట్విట్టర్ సర్వీసుల్లో సమస్య తలెత్తినట్లు సదరు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. అయితే ఆ సమయంలో 'ఎక్స్' పోస్టింగ్ సదుపాయం మాత్రం యథావిధిగా పనిచేసిందని చెప్పింది. అయితే ఈ వ్యవహారంపై ట్విట్టర్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. గతవారం కూడా ఎక్స్ ప్లాట్ఫామ్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల దాదాపు గంట పాటు దీని సేవలు నిలిచిపోయాయి. సిబ్బంది కొరత, ఇతర సాంకేతిక కారణాల వల్లే ట్విట్టర్ సేవలు అప్పుడప్పుడు ఒక్కసారిగా ఇలా నిలిచిపోతుంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఎక్స్‌లో #TwitterDown ట్రెండింగ్‌గా మారింది. కొందరు యూజర్స్ అయితే ఎక్స్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఫన్నీ వీడియోస్‌ను పోస్ట్ చేస్తున్నారు.
-
Twitter users running to Instagram to see if everyone else’s Twitter is down 😭 😭 #TwitterDown #XDown pic.twitter.com/rZICWl1V4v
— THE NADDY🔥 (@Nady_asim1) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Twitter users running to Instagram to see if everyone else’s Twitter is down 😭 😭 #TwitterDown #XDown pic.twitter.com/rZICWl1V4v
— THE NADDY🔥 (@Nady_asim1) December 21, 2023Twitter users running to Instagram to see if everyone else’s Twitter is down 😭 😭 #TwitterDown #XDown pic.twitter.com/rZICWl1V4v
— THE NADDY🔥 (@Nady_asim1) December 21, 2023
రూ.30 వేలు బడ్జెట్లో మంచి ల్యాప్‌టాప్ కొనాలా? టాప్-10 ఆప్షన్స్ ఇవే!
2024లో 12 ప్రయోగాలు- జాబిల్లి గుట్టు విప్పేందుకు ప్రపంచ దేశాలు రెడీ