ETV Bharat / science-and-technology

Twitter new logo X : ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది.. దాని స్థానంలో X లోగో వచ్చేసింది! - Twitter X logo

Twitter new logo X : సోమవారం ట్విట్టర్​ లోగో మారిపోయింది. ఫేమస్​ బ్లూబర్డ్ స్థానంలో X లోగో దర్శనమిస్తోంది. ట్విట్టర్​ లోగోను మారుస్తున్నామని ప్రకటించిన మస్క్​.. 24 గంటల్లోనే తాను అనుకున్నది చేసి చూపించారు. ప్రస్తుతం ఈ న్యూ లోగో ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్​ అవుతోంది.

Twitter new logo  X is trending and old blue bird logo is disappeared
Twitter new logo X
author img

By

Published : Jul 24, 2023, 3:14 PM IST

Updated : Jul 24, 2023, 3:39 PM IST

Twitter new logo X : ట్విట్టర్ అధినేత ఎలాన్​ మస్క్​ అనుకున్నంత పని చేసేశారు. ఫేమస్​ ట్విట్టర్​ లోగో 'పిట్ట'ను మార్చేసి 'X' లోగోను తీసుకొచ్చారు. ఆదివారం ట్విట్టర్​ లోగో మారుస్తామని ప్రకటించిన మస్క్​.. కేవలం 24 గంటల్లోనే పిట్టను ఎగరేశారు.

బ్లూబర్డ్​కు వీడ్కోలు
Twitter Blue Bird Logo : మొదటి నుంచి ట్విట్టర్​కు బ్లూబర్డ్​ ప్రధాన లోగోగా ఉంది. ఇది వరల్డ్​ వైడ్​గా ఫేమస్​ అయ్యింది. కోట్లాది ఫాలోవర్స్​ను సొంతం చేసుకుంది. కానీ నేడు దానికి ఎలాన్​ మస్క్​ వీడ్కోలు పలికారు.

సరికొత్తగా మారుస్తారా?
Twitter new brand name : ట్విట్టర్​ను సూపర్​ యాప్​గా మార్చే దిశగా ఎలాన్​ మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందులో భాగంగా దానిని ఎక్స్​ కార్ప్​ సంస్థలో విలీనం చేశారు. ఎవ్రీథింగ్ యాప్​ రూపకల్పనలో ట్విట్టర్​ను సమిధగా చేయడానికి నిర్ణయించుకున్నారు.

ట్రెండ్ అవుతున్న X లోగో
Twitter new logo X trending : సోమవారం ట్విట్టర్​ లోగో మారిపోయింది. ఇది జరిగిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా x లోగో ట్రెండ్​ కావడం మొదలైంది. ట్విట్టర్ బాస్ ఎలాన్​ మస్క్​ సోమవారం కంపెనీ హెడ్​ క్వార్టర్స్​లో కొత్త లోగో Xను ప్రదర్శించారు. అలాగే కంపెనీ సీఈఓ లిండా కూడా కొత్త లోగోను తన ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్​ చేశారు. దీనితో ఇది కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది.

మస్క్​ ప్రొఫైల్​ లోగో మార్పు!
Elon Musk Twitter Profile Pic change : ఎలాన్​ మస్క్​ తన ట్విట్టర్ ప్రొఫైల్​ లోగోను కూడా Xగా మార్చేశారు. అలాగే 'X is live' అని పోస్టు చేశారు.

మస్క్ దెబ్బకు ట్విట్టర్ కుదేలు!
Elon Musk Twitter changes : సుమారు 6 నెలల క్రితం బిలియనీర్ ఎలాన్​​ మస్క్ ట్విట్టర్​ను 44 బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నారు. తరువాత ఆ సంస్థలో అనేక మార్పులు చేశారు. కీలకమైన ఉద్యోగులను తొలగించారు. ఎన్నో విధానపరమైన మార్పులు చేశారు. దీని వల్ల ట్విట్టర్​ ఆర్థికంగా అనేక ఒడుదొడుకులకు లోనైంది. ముఖ్యంగా ప్రకటనల ఆదాయం భారీగా పడిపోయింది. అయినప్పటికీ మస్క్​ ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ట్విట్టర్​కు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంతో అనుభవజ్ఞురాలైన లిండాను సీఈఓగా తీసుకొచ్చారు. అలాగే బ్లూటిక్​ పొందిన యూజర్లు, వెరిఫైడ్ యూజర్లు ట్విట్టర్ వేదికగా వేలాది డాలర్లు సంపాందించేందుకు వీలును కల్పిస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా యాడ్​ రెవెన్యూను వెరిఫైడ్ యూజర్లకు షేర్ చేస్తామని తెలిపారు.

Last Updated : Jul 24, 2023, 3:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.