Twitter Job Search Feature : ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను ఎవ్రిథింగ్ యాప్ చేసే పనిలో చాలా బిజీగా ఉన్నారు. రోజుకో సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తూ.. ఎక్స్ (ట్విట్టర్) యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఎక్స్ వేదికలో 'జాబ్ సెర్చ్ ఫీచర్'ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. (X Job Search Feature) ఇదే కనుక సాకారమైతే.. ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ సైట్ లింక్డ్ఇన్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
X- ఎక్స్పెరిమెంట్స్
Elon Musk Latest News Twitter : టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్.. 2022 అక్టోబర్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల దాని పేరును 'X' గా మార్చారు. దీనిని ఎవ్రిథింగ్ యాప్‌గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు.
జాబ్ సెర్చ్ ఫీచర్
X Job Search Feature : ఎక్స్ జాబ్ సెర్చ్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యూజర్లు నేరుగా ఇదే ప్లాట్‌ఫాంలో ఉద్యోగాలను సెర్చ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆయా పోస్టులకు నేరుగా ఎక్స్ వేదికలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఉద్యోగార్థులు నేరుగా ఆయా సంస్థల లేదా కంపెనీల యజమానులతో కనెక్ట్ కావచ్చు.
ఎక్స్ వర్సెస్ లింక్డ్ ఇన్
Twitter Vs Linkedin : ప్రస్తుతం జాబ్ సెర్చింగ్ యాప్ మార్కెట్లో లింక్డ్ఇన్ టాప్ పొజిషన్లో ఉంది. ఇది చాలా ప్రొఫెషనల్‌గా ఉంటూ, యూజర్లు చాలా సులువుగా ఉద్యోగాలను సెర్చ్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. ఒక వేళ ఎక్స్ ప్లాట్‌ఫాంలో జాబ్ సెర్చ్ ఫీచర్ కనుక అందుబాటులోకి వస్తే.. అది నేరుగా లింక్డ్ఇన్కు గట్టి పోటీ ఇస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Xhiring
ఎక్స్ న్యూస్ డైలీ ఈ అప్‌కమింగ్ జాబ్ సెర్చ్ ఫీచర్ గురించి ట్విట్టర్లో పోస్టు చేసింది.
-
NEWS: Job Search and Matchmaking coming soon to @XHiring pic.twitter.com/Z7y5WCZsIf
— X News Daily (@xDaily) August 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">NEWS: Job Search and Matchmaking coming soon to @XHiring pic.twitter.com/Z7y5WCZsIf
— X News Daily (@xDaily) August 20, 2023NEWS: Job Search and Matchmaking coming soon to @XHiring pic.twitter.com/Z7y5WCZsIf
— X News Daily (@xDaily) August 20, 2023
"న్యూస్ : జాబ్ సెర్చ్ అండ్ మార్కెటింగ్ ఫీచర్ '@ఎక్స్ హైరింగ్' త్వరలోనే అందుబాటులోకి వస్తుంది."
- ఎక్స్ ట్వీట్
వాస్తవానికి ట్విట్టర్ @XHiring అనే అకౌంట్‌ను ఇప్పటికే క్రియేట్ చేసింది. కానీ ఇప్పటి వరకు దానిలో ఎలాంటి పోస్టు పెట్టలేదు.
ఎక్స్ - ఉద్యోగ ప్రకటనలు
X Hiring Feature Job Search : ఎక్స్ యాప్ రీసెర్చర్ నీమా ఓవ్జీ కొన్ని నెలల క్రితమే .. ఈ నయా ఫీచర్ గురించి తెలియజేశాడు. వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్ తమ సంస్థల్లోని ఉద్యోగాల భర్తీ కోసం ట్విట్టర్ వేదికగా ప్రకటనలు విడుదల చేసేలా సరికొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ATS లేదా XML ఫీడ్ ఆధారంగా ఈ జాబ్ నోటిఫికేషన్ ఫీచర్ తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా క్షణాల్లోనే జాబ్ న్యూస్ దీనిలో పోస్టు చేయడానికి వీలవుతుందని స్పష్టం చేశాడు.
ఫ్రీ ఫీచర్!
Free Job Search Feature In X : ఎక్స్ తెస్తున్న ఈ నయా ఫీచర్‌ను వెరిఫైడ్ ఆర్గనైజేషన్స్‌కు ఉచితంగా అందించనున్నట్లు నీమా ఓవ్జీ తెలిపారు. దీని వల్ల కంపెనీలు మంచి టాలెంట్ ఉన్న అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేయడానికి వీలవుతుందని వెల్లడించారు. అయితే మే నెలలో ఎలాన్ మస్క్ మాట్లాడుతూ.. వెరిఫైడ్ సంస్థలు 5 జాబ్ నోటిఫికేషన్ల వరకు మాత్రమే ఈ వేదికలో పోస్టు చేసేందుకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.