ETV Bharat / science-and-technology

Twitter Job Posting Feature : లింక్డ్​ఇన్​కు పోటీగా.. ఇకపై ట్విట్టర్​లోనూ జాబ్​ నోటిఫికేషన్స్​! - ట్విట్టర్​ 2 న్యూస్​

Twitter Job Posting Feature : ఎలాన్​ మస్క్​ నేతృత్వంలోని ట్విట్టర్​.. మైక్రోసాఫ్ట్​ నేతృత్వంలోని లింక్డ్​ఇన్​కు సవాల్​ విసరడానికి సన్నద్ధమైంది. ఇకపై వెరిఫైడ్ సంస్థలు.. ట్విట్టర్​ వేదికగా జాబ్​ ఓపెనింగ్స్​ పోస్టు చేసే విధంగా ఓ సరికొత్త ఫీచర్​ తీసుకురానుంది. పూర్తి వివరాలు మీరే చూడండి..

Start Hiring On Twitter
Twitter Job Posting Feature
author img

By

Published : Jul 21, 2023, 2:58 PM IST

Twitter Job Posting Feature : ప్రముఖ సోషల్​ మీడియా దిగ్గజం ట్విట్టర్​.. ఆన్​లైన్ ఉద్యోగాల వేదిక లింక్డ్​ఇన్​కు సవాల్​ విసరడానికి సన్నద్ధమైంది. ఇందుకోసం ఓ సరికొత్త ఫీచర్​ను కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గుర్తింపు పొందిన సంస్థలు ఇకపై తమ వేదికపై జాబ్​ నోటిఫికేషన్స్​ విడుదల చేసుకొనేందుకు వీలును కల్పిస్తూ ఈ లేటెస్ట్ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది.

Twitter vs LinkedIn : ట్విట్టర్​కు ప్రపంచవ్యాప్తంగా 528 మిలియన్ల యూజర్లు ఉన్నారు. అందువల్ల ఎంతో ఆదరణ ఉన్న తమ వేదికలో.. వెరిఫైడ్​ సంస్థలు జాబ్​ నోటిఫికేషన్లు వెలువరించేందుకు అవకాశం కల్పించే దిశగా ట్విట్టర్​ అడుగులు వేస్తోంది. ఈ చర్య మైక్రోసాఫ్ట్​ నేతృత్వంలోని లింక్డ్​ఇన్​కు నేరుగా సవాల్​ విసిరినట్టుగా కనిపిస్తోంది.

Start Hiring On Twitter : ట్విట్టర్​కు చెందిన ఈ నయా ఫీజర్​​ గురించి నిమా ఓవ్జీ అనే యాప్​ రీసెర్చర్​ గుర్తించారు. వెంటనే దాని స్క్రీన్​ షాట్​ను ట్వీట్​ చేశారు.

  • #Twitter will let verified organizations import all of their jobs to Twitter by connecting a supported ATS or XML feed! 🚀

    "Connect a supported Applicant Tracking System or XML feed to add your jobs to Twitter in minutes." pic.twitter.com/TSVRdAoj3h

    — Nima Owji (@nima_owji) July 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ట్విట్టర్ హైరింగ్​ అనేది ఒక ఉచిత ఫీచర్​. వెరిఫైడ్​ ఆర్గనైజేషన్స్​ ఈ నయా ఫీచర్​ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్లను పోస్టు చేయవచ్చు. అదే విధంగా మంచి టాలెంట్​ ఉన్న అభ్యర్థులను తమ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవచ్చు."
- నిమా ఓవ్జీ

ట్విట్టర్​ తీసుకొచ్చిన ఈ నయా ఫీచర్​ ద్వారా.. వెరిఫైడ్ సంస్థలు తమ కంపెనీ ప్రొఫైల్​లో గరిష్ఠంగా 5 వరకు జాబ్​ ఓపెనింగ్స్​ను పోస్ట్ చేయవచ్చు. అలాగే ఆయా సంస్థలు.. అప్లికేషన్​ ట్రాకింగ్ సిస్టమ్​ లేదా ఎక్స్​ఎమ్​ఎల్​ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. దీని ద్వారా కేవలం నిమిషాల్లో కొత్త జాబ్​లను పోస్టు చేయవచ్చు. వాటిని ట్రాక్​ చేయవచ్చు. సాధారణంగా ఎవరైనా యూజర్లు.. సంబంధిత కంపెనీ ట్విట్టర్​ అకౌంట్​ను ఓపెన్​ చేసినప్పుడు, వారికి ఈ జాబ్​ నోటిఫికేషన్లు కనిపిస్తాయి.

ముందే హింట్​ ఇచ్చారు!
ట్విట్టర్ అధినేత ఎలాన్​ మస్క్​.. తాజా హైరింగ్​ ఫీచర్​ గురించి మే నెలలోనే ఒక హింట్​ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్​ వేదికగా జాబ్​ ఓపెనింగ్స్​ను పోస్టు చేసుకునే అవకాశం కల్పిస్తామని అప్పుడే చెప్పారు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ట్విట్టర్​ 2.0 మే నెలలోనే జాబ్​ మ్యాచింగ్​ టెక్​ స్టార్టప్​ Laskieని కూడా కొనుగోలు చేసింది.

'ఢీ' కొట్టడానికే..!
LinkedIn vs Twitter : ఎలాన్ మస్క్​ .. మైక్రోసాఫ్ట్​ నేతృత్వంలోని లింక్డ్​ఇన్​కు సవాల్​ విసిరేందుకే ఈ నయా ఫీచర్​ను తీసుకొస్తున్నట్లు టెక్​ నిపుణుల భావన. ఎలాన్​ మస్క్​ 'ఎవ్రీథింగ్​ యాప్​'ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఇది చైనాకు సంబంధించిన 'వీచాట్​'కు సిమిలర్​గా ఉంటుందని సమాచారం. ముఖ్యంగా పేమెంట్స్​, మెసేజింగ్​, సోషల్​ నెట్​వర్కింగ్ సహా పలు ఫీచర్లు వీచాట్​ను పోలి ఉంటాయని టెక్​ నిపుణులు భావిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.