ప్రస్తుత కాలంలో భావాలను వ్యక్తపరిచేందుకు సందేశాలతో పాటు ఎక్కువగా వినియోగిస్తున్నవి స్టిక్కర్లు. పదాలతో పలికించలేని భావాలను వీటితో వ్యక్తం చేయొచ్చు. అంతేకాకుండా చిన్నపాటి డైలాగ్‌లు, హస్యం జోడించిన వ్యక్తుల యానిమేటెడ్ గ్రాఫిక్స్‌తో ఎంత సేపు చాటింగ్ చేసినా బోర్ కొట్టదు. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ వాట్సాప్‌లో అందుబాటులో లేదు. స్టిక్కర్లు కావాలంటే యూజర్లు థర్డ్‌పార్టీ యాప్స్ వినియోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ సదుపాయాన్ని తెచ్చేస్తోంది వాట్సాప్.
స్టిక్కర్లతో మరింతగా...
యానిమేటెడ్ స్టిక్కర్లను అందుబాటులోకి తెస్తోన్న వాట్సాప్... ఈ గ్రాఫిక్స్‌తో భావాలను మరింతగా వ్యక్తపరచవచ్చని అభిప్రాయపడింది. యూజర్లను కచ్చితంగా ఈ ఫీచర్ ఆకట్టుకుంటుందని చెప్పింది.
గ్రూప్ వీడియో కాల్...
వాట్సాప్ ఇప్పటికే ఉన్న గ్రూప్ వీడియో కాలింగ్‌ను మరింత అభివృద్ది చేసింది. ఈ ఫీచర్ ఫలితంగా ఒకేసారి 8 మంది మాట్లాడుకునే అవకాశం రానుంది. కాయ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే జియో ఫీచర్ ఫోన్లలోనూ వాట్సాప్ పనిచేయడమే కాకుండా వాటిలో స్టేటస్లు పెట్టుకునే సౌలభ్యం కల్పిస్తోంది.
స్కాన్ చేస్తే కాంటాక్ట్ సేవ్?
సాధారణంగా ఎవరి ఫోన్ నెంబర్ అయినా మనం సేవ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ మెనూకు వెళ్లి అక్కడ టైప్ చేసి.. యాడ్ కాంటాక్ట్ కొట్టి, ఆపై పేరు సేవ్ చేసుకుంటాం. ఒకట్రెండు నెంబర్లైతే ఓకే. అదే పదుల సంఖ్యలో ఉంటే? ఇలాంటి సందర్భాల కోసమే వాట్సాప్ ఈ సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. పైగా మాన్యువల్‌గా టైప్ చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాటున ఒక నెంబర్‌కు బదులు మరో నెంబరుతో కాంటాక్ట్ ఫీడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులకు చరమగీతం పాడవచ్చు. ఎవరి నంబర్ అయినా మన మొబైల్లో సేవ్ చేసుకోవాలంటే వాట్సాప్‌లోని వాళ్ల క్యూర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆ కాంటాక్ట్ మన ఫోన్‌లో యాడ్ అయిపోతుంది.
వెబ్‌లో డార్క్ మోడ్...
మార్చిలోనే ఫోన్ యాజర్లకు డార్క్ మోడ్‌ను తీసుకొచ్చిన వాట్సాప్ సంస్థ.. తాజాగా వెబ్, డెస్క్‌టాప్‌కు ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది. దీని వల్ల కళ్లపై కాంతి ప్రభావం తగ్గుతుంది. మొబైల్లో అయితే బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది. ఈ కొత్త ఫీచర్లన్నీ త్వరలో విడుదలకానున్న వాట్సాప్ కొత్త వెర్షన్లో కనువిందు చేయనున్నాయి. ఇప్పటికే బీటా టెస్టింగ్ తీసుకున్న యాప్‌లలో ఈ ఫీచర్లు ఉన్నాయి.
-
New feature alert! We are rolling out Dark Mode on desktop, improvements to group video calls, Status in KaiOS - and coming in a few weeks, Animated Stickers and QR codes. pic.twitter.com/wflA9WO0wJ
— WhatsApp Inc. (@WhatsApp) July 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">New feature alert! We are rolling out Dark Mode on desktop, improvements to group video calls, Status in KaiOS - and coming in a few weeks, Animated Stickers and QR codes. pic.twitter.com/wflA9WO0wJ
— WhatsApp Inc. (@WhatsApp) July 1, 2020New feature alert! We are rolling out Dark Mode on desktop, improvements to group video calls, Status in KaiOS - and coming in a few weeks, Animated Stickers and QR codes. pic.twitter.com/wflA9WO0wJ
— WhatsApp Inc. (@WhatsApp) July 1, 2020