దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ భారత్‌లో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. గెలాక్సీ శ్రేణిలో ఏ31 పేరుతో.. గురువారం (జూన్ 4)న ఈ మోడల్‌ను ఆవిష్కరించనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, ధర వంటి వివరాలు మీకోసం.
ఫీచర్లు..
- 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్‌అమోల్డ్ ఇన్ఫినిటీ యూ డిస్‌ప్లే
- మీడియా టెక్ హీలియో పీ65 ప్రాసెసర్
- వెనుకవైపు నాలుగు కెమెరాలు (48 ఎంపీ+8ఎంపీ+5 ఎంపీ+5ఎంపీ)
- 20 మెగా పిక్సెల్స్ సెల్ఫీ కెమెరా.
- 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ
4జీబీ ర్యామ్+ 64 జీబీ స్టోరేజ్, 6 జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజ్‌లో రెండు వేరియంట్లలో ఈ మోడల్ అందుబాటులోకి రానున్నట్లు తెలిస్తోంది. ధర విషయానికొస్తే రూ.23వేలు ఉంటుందని సమాచారం.
ఇదీ చూడండి:ఈ బ్రాండ్ల పూర్తి పేర్లు మీకు తెలుసా?