ETV Bharat / science-and-technology

మనుషులంతా చివరిసారిగా కలిసి ఉన్నది అప్పుడే...

వసుధైక కుటుంబం... అంటే ప్రపంచమంతా ఒకే కుటుంబం. కానీ... ఈ వసుధైక కుటుంబం ఒక కారణంగా విడిపోయిందని తెలుసా? ఇరవై ఏళ్ల క్రితమే ఆ సంఘటన జరిగింది. నమ్మట్లేదా..? ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.

planet together
మనుషులందరం ఎప్పుడు విడిపోయామో తెలుసా..?
author img

By

Published : Jul 10, 2020, 5:42 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

2000 సంవత్సరం నవంబర్​ 2.. విశాలమైన మన అఖండ ప్రపంచంలో అందరం కలిసి ఉన్న చివరి రోజు. మనిషిగా పుట్టి బతికి ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజు వరకే ఈ భూమిపై ఉన్నారు. కానీ ఆ రోజు తర్వాత నుంచే ధరణి వీడి దూరంగా ఉండాలని తెలిసినా మానవుడు తన సాహస ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. బంధాలు, బంధుత్వాలను త్యాగం చేసి అంతరిక్షంలో ప్రయోగాల్లో నూతన శకానికి నాంది పలికాడు. ఆ రోజు తర్వాత నుంచే పుడమి దాటి, శూన్యాన్ని ఛేదించుకుంటూ భూమికి పైన నివసించడం ఆరంభించాడు.

planet together
ఐఎస్ఎస్ వద్ద శాస్తవేత్త

1961లోనే యూరీ గగారిన్ రోదసిని తొలిసారి చుట్టొచ్చినా... ఎవరూ భూమి దాటి లోయర్​ ఆర్బిట్​లో నివసించలేదు. 1998 నవంబర్​ 20న నాసా సహా ఐదు దేశాల సంస్థలు ఐఎస్​ఎస్​(అంతర్జాతీయ స్పేస్ స్టేషన్)ను ప్రారంభించాయి. అనంతరం 2000 నుంచే మానవుడు సుదీర్ఘ కాలంగా అక్కడ ఉండటం ప్రారంభించాడు. ఇప్పటికీ నడి ఆకాశంలోకి శాస్త్రవేత్తలు వెళ్తూ వస్తూ ఉన్నా... ఎవరో ఒకరు ఆ స్టేషన్​లో ఉంటూనే ఉంటారు. వారి కోసం ఆహారం, నీరు, నిత్యవసరాలు వంటివి ఇక్కడ నుంచి పంపిస్తూనే ఉంటారు ఇక్కడి ప్రజలు.

ఆనాటి నుంచే శాస్త్రవేత్తలు అక్కడే ఉండి పరిశోధనలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అలా కొందరు భూమి, అంతరిక్షానికి మధ్య ఉన్న చీకట్లలో ప్రయోగాలే ఆయువుగా జీవిస్తున్నారు. ఆ పరిశోధకులు వేసిన పునాదుల మీదే ఇప్పుడు శాస్త, సాంకేతికత పరుగులు పెడుతోంది.

తొలిసారి అక్కడ నివసించిన శాస్త్రవేత్తలు... మూడు రకాలైన కూరగాయ, ఆకుకూరల మొక్కలను పెంచడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ల పరిశోధనల మార్గనిర్దేశంతోనే చంద్రుడు, మార్స్​ వంటి ఇతర గ్రహాలపైకి మన ఉపగ్రహాలు, రోబోలు వెళ్లగలిగాయి.

ఇదీ చూడండి: 'భారత్​ భేష్... చైనా ఓ బందిపోటు ముఠా'

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.