ETV Bharat / science-and-technology

'జియోమీట్'​కు అప్​డేట్​- కొత్త ఫీచర్స్ ఇవే...

రిలయన్స్ ఇండస్ట్రీస్.... హ్యాకర్ల నుంచి 'జియోమీట్'​ వీడియో కాన్ఫరెన్స్​ను మరింత సురక్షితం చేసేందుకు అదనపు భద్రతా ఫీచర్లను జోడించింది. యూజర్ ఇంటర్​ఫేస్​ను సరికొత్తగా మార్చింది. వినియోగదారులు ప్లేస్టోర్​లో ఈ యాప్​ను అప్​డేట్​ చేసుకోవచ్చు. త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.

author img

By

Published : Jul 8, 2020, 12:10 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

JioMeet unveils additional security features to prevent hacking
జియోమీట్ వీడియో కాన్ఫరెన్స్ ఇప్పుడు మరింత సురక్షితం!

'జియోమీట్'​ వీడియో కాన్ఫరెన్స్​ను మరింత సురక్షితం చేసేందుకు... అదనపు భద్రతా ఫీచర్లను జోడించింది రిలయన్స్. జూమ్​ లాంటి యాప్​లపై హ్యాకర్లు దాడి చేసి అశ్లీల చిత్రాలను పోస్టు చేస్తున్న నేపథ్యంలో... రిలయన్స్ అప్రమత్తమైంది. హ్యాకింగ్​ బెడద నుంచి జియోమీట్​ను మరింత సురక్షితం చేయడమే లక్ష్యంగా ఆరు అదనపు భద్రతా ఫీచర్లను జోడించింది.

మరింత సురక్షితం

  • 24 గంటలపాటు ఉచిత వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం కల్పిస్తున్న జియోమీట్​లో ప్రవేశించాలంటే ఎన్​క్రిప్టెడ్ పాస్​వర్డ్​తో సైన్​-ఇన్ కావాల్సిందే.
  • తమ గుర్తింపును బహిర్గతం చేయకుండా లేదా సైన్​ ఇన్​ చేయకుండా ఎవరైనా వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనడానికి ప్రయత్నిస్తే... హోస్ట్ వారిని తొలగించవచ్చు.
  • జియోమీట్​ వినియోగదారులు ప్లేస్టోర్​లో ఈ యాప్​ను అప్​డేట్​ చేసుకోవచ్చు. త్వరలో ఐఓఎస్ వినియోగదారులకు కూడా ఇది అందుబాటులోకి రానుంది.
  • వినియోగదారులు తమ ప్రస్తుత యూజర్ ఐడీ, పాస్​వర్డ్​లతో... ఈ అప్​డేటెడ్ యాప్​లో సైన్​ ఆన్​ కావచ్చు.
  • కొత్త ఫీచర్ల సాయంతో.. వ్యక్తిగత సమావేశ గదులు (పర్సనల్ మీటింగ్ రూమ్స్​) ఏర్పాటుచేసుకుని సురక్షిత పాస్​వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఫలితంగా పాఠశాల తరగతులు, రోజువారీ సమావేశాల నిర్వహణ మరింత సులభతరం అవుతుంది.
  • జియోమీట్ వినియోగదారుడు.. పార్టిసిపెంట్ వీడియోపై డబుల్ క్లిక్​ చేయడం ద్వారా... మరింత మందిని తన వీడియో కాన్ఫరెన్స్​లో చేర్చుకోవచ్చు లేదా పిన్​ చేసుకోవచ్చు.
  • స్థిర ప్రదేశాల్లో ఉంటూ బహుళ కార్యాలయాలతో అనుసంధానం కోసం... ఎంటర్​ప్రైజ్ కస్టమర్లు ఉపయోగించే సంప్రదాయ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కూడా జియోమీట్​లో ఉంది.
  • సంస్థల యాజమాన్యాలు.... కార్యాలయంలోనూ, అలాగే ఇంటి నుంచి పనిచేస్తున్న తమ ఉద్యోగులతోనూ... ఒకేసారి అనుసంధానం అయ్యే అవకాశాన్ని జియోమీట్ కల్పిస్తుంది.
  • ప్రధాన యూజర్​ ఇప్పుడు ప్రధాన సమావేశం నుంచి నిష్క్రమించకుండానే.. ఇతర సహోద్యోగులతోనూ సమావేశం కాగలరు.

జూమ్ వర్సెస్ జియోమీట్​

రిలయన్స్ ఇండస్ట్రీస్​.. జులై 2న జియోమీట్​ను ప్రారంభించింది. దీనితో ఒకేసారి 100 మందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించవచ్చు. హెచ్​డీ ఆడియో, వీడియో కాల్​ నాణ్యత దీని సొంతం. దీనిలో స్క్రీన్ షేరింగ్, మీటింగ్ షెడ్యూల్​ ఫీచర్లు ఉన్నాయి.

ప్రస్తుతం జియోమీట్​ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు... యూజర్ ఇంటర్​ఫేస్​ను సరికొత్తగా మార్చింది రిలయన్స్.

  • జూమ్​లో వీడియో కాన్ఫరెన్స్ కాలపరిమితి 40 నిమిషాలు మాత్రమే ఉండగా.. జియోమీట్ 24 గంటలపాటు ఉచితంగా ఈ సేవలు అందిస్తోంది.
  • జియోమీట్​లో... హోస్ట్ అనుమతి ఉన్నవారు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్​లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. అంటే హ్యాకర్లు దీనిలో ప్రవేశించకుండా భద్రత ఉంటుంది.
  • జూమ్ యాప్​లో వేరే కాల్ తీసుకోవాలంటే.. వీడియో కాన్ఫరెన్స్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. జియోమీట్​లో మాత్రం కాల్​ డ్రాప్​ చేయనక్కరలేదు. సులభంగా ఒక డివైస్ నుంచి మరో డివైస్​కు మారవచ్చు.
  • జూమ్​లో ఈ-మెయిల్ ఐడీతో మాత్రమే సైన్ అప్ కాగలం. అదే జియోమీట్​లో ఈ-మెయిల్​తో పాటు మొబైల్ నెంబర్​తోనూ సైన్ అప్ కావచ్చు.
  • జూమ్​లో ఒక మొబైల్​ స్క్రీన్​లో నలుగురు మాత్రమే కనిపిస్తారు. ఎక్కువ మంది పాల్గొనాల్సి వస్తే మల్టిపుల్ పేజీల్లో మిగతా వారిని చూడాల్సి ఉంటుంది. అదే జియోమీట్​లో అయితే ఒక స్క్రీన్​లో ఒకేసారి 9 మందిని చూడొచ్చు.

ఉచితంగా

కరోనా విజృంభణ వేళ.. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, సిస్కో వెబెక్స్, గూగుల్ మీట్ సహా ఇతర సంస్థల వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​లు తీసుకొచ్చాయి. వీటికి పోటీగా జియోమీట్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది రిలయన్స్. మిగతా వెబ్ కాన్ఫరెన్సింగ్ యాప్​లు ఈ సదుపాయానికి కొంత సొమ్ము వసూలు చేస్తుండగా.. జియోమీట్​ మాత్రం ఈ సేవలను పూర్తి ఉచితంగా అందిస్తోంది.

ఇదీ చూడండి: గంగా శుద్ధికి ప్రపంచ బ్యాంకు 3 వేల కోట్ల సాయం

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.