ETV Bharat / science-and-technology

'లొకేషన్​ హిస్టరీ'లో గూగుల్​ కీలక మార్పులు

వినియోగదారుల సమాచార భద్రత కోసం కొత్త ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. ఇందులో భాగంగా గూగుల్​లో నమోదైన సమాచారం 18 నెలల్లో ఆటో-డిలీట్ అయ్యే ఆప్షన్​ను ఈ రోజు నుంచి ఆటోమెటిక్​​గా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.

google-roll-out-new-privacy
గూగుల్ ఆటో-డిలీట్ ఆప్షన్!
author img

By

Published : Jun 25, 2020, 2:24 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

సమాచారం సురక్షితంగా ఉంచుకోవడం సహా గోప్యతను మరింత మెరుగ్గా తీర్చిదిద్దే విధంగా గూగుల్ మరిన్ని చర్యలతో ముందుకొచ్చింది. సమాచార భద్రత కోసం వినియోగదారులకు మరిన్ని వెసులుబాట్లు కల్పించేలా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు.

గురువారం(జూన్ 25) నుంచి తమ లొకేషన్ హిస్టరీని తొలిసారి ఆన్​ చేసుకునే వినియోగదారులకు.. గూగుల్​లో నమోదైన సమాచారం 18 నెలల్లో డిలీట్ అయ్యే ఆప్షన్ ఆటోమెటిక్​గా ఆన్ అయిపోతుందని తెలిపారు.

"మీ లొకేషన్​కు సంబంధించిన సమాచారం 18 నెలల తర్వాత నిరంతరం ఆటోమెటిక్​గా డిలీట్ అయిపోతుంది. ఇప్పటివరకు వినియోగదారులు డిలీట్ చేసినప్పుడే డేటా తొలగిపోయేది. ఈ సెట్టింగ్​ను మీరు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు. ఆటో-డిలీట్ ఆప్షన్​కు సంబంధించిన సెట్టింగ్స్​ను మార్చుకోవచ్చు."

-సుందర్ పిచాయ్, గూగుల్ సీఈఓ

ఆటో-డిలీట్ కంట్రోల్స్​ను గూగుల్ గతేడాది ప్రవేశపెట్టింది. దీని ప్రకారం యూజర్లు తమ లొకేషన్ హిస్టరీ, వాయిస్ సెర్చ్, యూట్యూబ్ యాక్టివిటీ డేటాను 3 నెలల నుంచి 18 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఆటోమెటిక్​ డిలీట్ చేసే విధంగా వెసులుబాటు కల్పించింది.

వాటికి వర్తించదు!

ఈ ఆప్షన్​ను ఇదివరకే ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్​లో ఎలాంటి మార్పు ఉండదని సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. ఈ సెట్టింగ్స్​ గురించి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ల రూపంలో గుర్తు చేస్తామని చెప్పారు. అయితే.. 'డిఫాల్ట్ రిటెన్షన్ కాలం' జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్​కు వర్తించదని సుందర్ స్పష్టం చేశారు.

కొత్త ఖాతాలకు 36 నెలలు

యూట్యూబ్​లో కొత్త ఖాతా ఓపెన్ చేసినప్పుడు, యూట్యూబ్ హిస్టరీని తొలిసారి ఆన్ చేసినప్పుడు డిలీట్ ఆప్షన్ డిఫాల్ట్​గా 36 నెలలకు సెట్​ చేసి ఉంటుంది. ప్రస్తుత యూజర్లు ఈ ఆప్షన్​ను 3 నుంచి 18 నెలలకు సెట్​ చేసుకునే అవకాశం ఉంది.

సెర్చ్ బార్​ నుంచే గూగుల్ ఖాతాను యాక్సెస్ చేసే విధానాన్ని మరింత సులభతరం చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. భద్రతకు సంబంధించిన అంశాలు సెర్చ్ బాక్స్​ నుంచే శోధించే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది.

"అన్ని యాప్​ల నుంచి ఇన్​కాగ్నిటో మోడ్​ను సులభంగా యాక్సెస్ చేసే విధంగా మార్పులు చేస్తున్నాం. మ్యాప్స్, యూట్యూబ్, సెర్చ్​ యాప్​లలో ప్రొఫైల్ పిక్చర్​ని కొద్ది సేపు నొక్కి ఉంచితే ఇది అందుబాటులోకి వచ్చేలా తయారు చేస్తున్నాం. ఐఓఎస్​ అప్లికేషన్లలో ఇప్పటికే ఇది అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ సహా ఇతర ప్లాట్​ఫాంలకూ ఈ ఆప్షన్ వర్తించేలా తీర్చిదిద్దుతున్నాం. మరిన్ని విషయాలు త్వరలోనే తెలియజేస్తాం."

-గూగుల్

పాస్​వర్డ్ చెకప్​ను దాదాపు 10 కోట్ల మంది వినియోగదారులు ఉపయోగించుకున్నారని సుందర్ తెలిపారు. దీని ద్వారా సమాచార చోరీలు 30 శాతం తగ్గినట్లు వెల్లడించారు. ఈ ఆప్షన్​ను గూగుల్ ఖాతా, క్రోమ్​లకు అనుసంధానించినందున... మరికొద్ది నెలల్లో పాస్​వర్ట్ చెకప్ క్రోమ్ ఎక్స్​టెన్షన్​కు ముగింపు పలకనున్నట్లు ప్రకటించారు.

గోప్యత నిబంధనలను మెరుగుపర్చే విధంగా డెవలపర్లకు మెషీన్ లెర్నింగ్​ ద్వారా మరిన్ని టూల్స్ అందుబాటులోకి తీసుకురావడానికి.. జావా, గో వంటి కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజీలను సంస్థ మరింత విస్తరిస్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.

ఇవీ చదవండి

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.