Top 5 Smallest Washing Machines in India : ఒకప్పుడు రాతిబండపై చేతులు పడిపోయేలా మహిళలు బట్టలను ఉతికేవారు. కానీ ప్రస్తుత టెక్నాలజీ యుగంలో వాషింగ్ మెషిన్లు వాడుకలోకి రావడంతో మహిళలకు కాస్త పనిభారం తగ్గింది. ఇవి వచ్చాక బట్టలు ఉతికే పని చాలా సులభం అవ్వడంతో పాటు సమయం కూడా ఆదా అవుతోంది. అలాగే నేటి బిజీ లైఫ్‌లో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి వాషింగ్ మెషిన్(Washing Machine) కొనేందుకు కొంతమంది ఇష్టపడరు. ఇంకొందరు దాన్ని ఉంచేందుకు ఇంటిలో స్థలం ఎక్కువ కావాలని దీనిని తీసుకోరు.
Best 5 Smallest Portable Washing Machines : అందుకే చాలా మంది తక్కువ ధరలో.. తక్కువ స్థలం ఆక్రమించే వాషింగ్ మెషిన్ల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని కొన్ని కంపెనీలు పోర్టబుల్ వాషింగ్ మెషిన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వీటిని వాడిన తర్వాత మడత వేసి పక్కన పెట్టెయొచ్చు. ఈఐఎం ద్వారా కొనుగోలు చేసే సదుపాయం అందుబాటులో ఉంది. ఇంకేందుకు ఆలస్యం ఈ స్టోరీలో మేము తక్కువ ధరలో లభించే టాప్ 5 స్మాల్ వాషింగ్ మెషిన్స్ గురించి చెప్పబోతున్నాం. వాటి వివరాలు తెలుసుకుని మీరు కొనడానికి సిద్ధమవ్వండి. మరి, అవేమిటో ఇప్పుడు చూద్దాం..
హిల్టన్ 3 కిలోల సింగిల్-టబ్ వాషింగ్ మెషిన్(Hilton 3 kg Single-Tub Washing Machine) : ఇది వైబ్రాంట్ బ్లూ కలర్లో కాంపాక్ట్ ఎఫిషియన్సీ సౌలభ్యాన్ని కలిగి ఉంది. ఈ పోర్టబుల్ సింగిల్ టబ్ ల్యాండ్రీ వాషర్ అతిచిన్న వాషింగ్ మెషిన్ ధరల జాబితాలో మొదటి ప్లేస్‌లో ఉంది. దీని సామర్థ్యం 3 కిలోలుగా ఉంది. స్పిన్ డ్రైయర్, ప్రయాణ సౌలభ్యం కోసం పోర్టబుల్ డిజైన్ కలిగి ఉంది. చిన్న ప్రదేశాలలో దీనిని ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఇది సమర్థవంతంగా బట్టలు(Clothes) ఎండబెట్టడంతోపాటు సులభంగా నియంత్రించే ఫీచర్ కలిగి ఉంది.
DMR 46-1218 సింగిల్ టబ్ వాషింగ్ మెషిన్(DMR 46-1218 Single Tub Washing Machine) : DMR 46-1218 సింగిల్ టబ్ వాషింగ్ మెషిన్ నీలం రంగులో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ పోర్టబుల్ వాషర్ మన్నికైన స్టీల్ డ్రైయర్ బాస్కెట్‌తో కాంపాక్ట్, బడ్జెట్-ఫ్రెండ్లీ ప్యాకేజీలో సరైన పనితీరు కోసం రూపొందించబడింది. DMR 46-1218 సింగిల్ టబ్ వాషింగ్ మెషీన్‌తో మీ లాండ్రీ సౌకర్యాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. దీని కెపాసిటీ చిన్న నుంచి మధ్య తరహా లోడ్లకు అనుకూలంగా ఉంటుంది. అతిచిన్న వాషింగ్ మెషిన్ ధరతో కూడిన జాబితాలో ఇది కాంపాక్ట్ ప్యాకేజీలో ధృడమైన డిజైన్, సరసమైన ధర, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది.
80 సెకన్లలో దుస్తులుతికే మిషిన్.. సర్ఫ్, నీరు అవసరం లేకుండానే..!
ROMINO లేటెస్ట్ మినీ వాషింగ్ మెషిన్ (ROMINO Latest Mini Washing Machine) : ఇది ఒకే వ్యక్తి ఉపయోగం కోసం రూపొందించబడిన వాషింగ్ మెషిన్. అంటే ఈ పోర్టబుల్ ఫోల్డింగా వాషింగ్ మెషిన్ ద్వారా కేవలం ఒకరి బట్టలను మాత్రమే ఉతకవచ్చు. ఇది క్యాంపింగ్, ప్రయాణ సమయంలో చాలా ఉపయోగపడుతుంది. ఇది కేవలం 0.8 కిలోలు మాత్రమే బరువు కలిగి ఉండడంతో ఎక్కడికైనా ఈజీగా మడతపెట్టి తీసుకెళ్లవచ్చు. ఇది వినూత్న డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చింది. ఈ పోర్టబుల్ ఫోల్డింగ్ వాషింగ్ మెషిన్‌ను ఇరుకు గదుల్లోను చాలా సులభంగా వాడి భద్రపరుచుకోవచ్చు. ఇది బట్టలు ఎండబెట్టడానికి లెటెస్ట్ టెక్నాలజీని కలిగి ఉంది.
Castlefit మినీ లాండ్రీ మెషిన్(Castlefit Mini Laundry Machine) : ఇది పోర్టబుల్ మినీ వాషింగ్ మెషిన్ రకానికి చెందినది. మీరు క్యాంపింగ్ చేసినా, ఆర్‌వింగ్ చేసినా, ప్రయాణిస్తున్నా లేదా డార్మ్ రూమ్‌లో నివసిస్తున్నా ఈ మినీ వాషింగ్ మెషీన్ చాలా సౌలభ్యంగా ఉంటుంది. ధ్వంసమయ్యే బకెట్ డిజైన్ 4.4 lb సామర్థ్యంతో ఇది కార్యాచరణ, పోర్టబిలిటీ మధ్య సంపూర్ణ సమతుల్యతను మెయింటెన్ చేస్తుంది. దీనిని బహుముఖ, పోర్టబుల్, ప్రాక్టికాలిటీని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
మార్వెల్లా మినీ ఫోల్డబుల్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్(Marvella Mini Foldable Top Load Washing Machine) : ఇది మినీ ఫోల్డబుల్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రకానికి చెందినది. దీనిని 2 కిలోల కెపాసిటీతో రూపొందించారు. అతిచిన్న వాషింగ్ మెషీన్ ధరల జాబితాలో స్థలాన్ని ఆదా చేసే, పోర్టబుల్ వాషింగ్ సొల్యూషన్‌ను అమర్చాలని కోరుకునే వారికి దీనిని ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు. కాంపాక్ట్ డిజైన్, పోర్టబిలిటీ, ఆటోమేటిక్ క్లీనింగ్, వైబ్రెంట్ మల్టీ కలర్ ఆప్షన్‌లతో మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది.
నీరు, సర్ఫ్ అక్కర్లేని వాషింగ్ మెషీన్.. ఎలా పని చేస్తుందంటే?