ETV Bharat / science-and-technology

యూట్యూబ్​ యూజర్లు తెలుసుకోవాల్సిన టాప్​-5 హిడెన్ ఫీచర్స్ ఇవే!

Top 5 Hidden YouTube Features In Telugu : మీరు యూట్యూబ్ వాడుతుంటారా? దానిలో గంటలు, గంటలు సమయం గడుపుతుంటారా? అయితే ఇది మీ కోసమే. యూట్యూబ్​లో ఎన్నో హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి. అవి మంచి యూజర్​ ఎక్స్​పీరియన్స్​ను అందిస్తాయి. వాటిలోని టాప్​-5 హిడెన్​ ఫీచర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Best YouTube features
5 Best unknown YouTube features
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 1:27 PM IST

Top 5 Hidden YouTube Features : ఆన్​లైన్ వీడియో కంటెంట్​లో యూట్యూబ్ రారాజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 2005లో దీని బీటా వెర్ష‌న్ రిలీజైంది. ఆ స‌మ‌యంలో రోజూ దీన్ని 30 వేల మంది చూసేవారు. కానీ నేడు ప్రతి రోజూ 2.56 బిలియన్​ యూజర్లు దీన్ని యాక్సెస్ చేస్తున్నారు. యూట్యూబ్​లో దాదాపుగా అన్ని విష‌యాల‌కు సంబంధించిన స‌మాచారం ఉంటుంది. పురాణాలు మొద‌లు, మోడ్రన్​ లైఫ్​స్టైల్ వ‌ర‌కు అన్ని వీడియోలు ఇందులో ఉంటాయి. చాలా మంది గంట‌లు, గంట‌లు యూట్యూబ్​ చూస్తూ గడిపేస్తారు. అందువల్ల యూట్యూబ్​ ఫీచర్లు గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ అందులో చాలా మందికి తెలియని హిడెన్ ఫీచర్లు ఎన్నో ఉంటాయి. వాటిలోని టాప్​-5 బెస్ట్ ఫీచ‌ర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Gesturesతో మీడియా ప్లేబ్యాక్ కంట్రోల్

  • మ‌న వేలుతో వీడియో ఎడమ లేదా కుడి వైపున, రెండు సార్లు నొక్కి వీడియోను 10 సెక‌న్లు ఫార్వార్డ్, బ్యాక్​వార్డ్ చేసుకోవచ్చు. మూడు సార్లు ట్యాప్ చేస్తే 20 సెకన్లు, 4 సార్లు ట్యాప్​ చేస్తే 30 సెకన్ల పాటు వీడియో ఫార్వార్డ్ లేదా బ్యాక్​వార్డ్ అవుతుంది. అంతేకాదు, వీడియో ఎంత సేపు స్కిప్ కావాలో కూడా సెట్​ చేసుకోవచ్చు. ఇందుకోసం Settings > General > Double-tap to seek పై ప్రెస్ చేసి స్కిప్ టైమ్​ను (5, 10, 15, 20, 30, లేదా 60 సెక‌న్లు) వ‌ర‌కు సెట్ చేసుకోవ‌చ్చు.
  • రెండు వేళ్ల‌లో రెండు సార్లు నొక్క‌డం ద్వారా వీడియోలోని నెక్ట్స్​ ఛాప్టర్​కు వెళ్లవచ్చు. ఇది వివిధ సెక్షన్​లుగా రూపొందించిన వీడియోల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.
  • వీడియోలో ఏ ప్రాంతంలోనైనా లాంగ్ ప్రెస్ చేసి ప‌ట్టుకుంటే, ఆటోమేటిక్​గా అది 2x స్పీడ్​తో ప్లే అవుతుంది.
  • వీడియో పాజ్ చేసి ఉన్న‌ప్పుడు, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే, కుడికి లేదా ఎడ‌మ వైపున‌కు స్వైప్ చేయ‌వ‌చ్చు. దీని వ‌ల్ల మ‌నం అనుకున్న డ్యురేష‌న్ వ‌ద్దకు సుల‌భంగా వెళ్లొచ్చు.
  • Swipe down, Swipe up చేస్తే వీడియో Minimize, Maximize అవుతుంది.
  • వీడియో ప్లే అవుతున్న‌ప్పుడు రెండు వేళ్ల‌తో పించ్ చేయ‌డం వ‌ల్ల దాన్ని జూమ్ ఇన్, జూమ్ అవుట్ చేయ‌వ‌చ్చు.
  • పుల్​ స్క్రీన్​ మోడ్​లో వీడియో ప్లే అవుతున్నప్పుడు మ‌న ఫింగ‌ర్​తో Swipe up చేస్తే, మనం చూస్తున్న కంటెంట్​కు సంబంధించిన వీడియోల లిస్టు క‌న‌బ‌డుతుంది. అందులో మ‌న‌కు న‌చ్చిన వీడియోని ఎంపిక చేసుకుని చూడ‌వ‌చ్చు.

2. యూట్యూబ్ యూసేజ్ టైమ్​
మ‌న‌కు తెలియ‌కుండానే యూట్యూబ్​లో గంటలు గంటలు గ‌డుపుతుంటాం. దీని వల్ల చాలా సమయం వృథా అవుతుంది. దీనిని నివారించడానికి 'యూట్యూబ్​ వాచ్​ టైమ్'​ను సెట్ చేసుకోవచ్చు. అదెలా అంటే, ముందుగా మీరు Settings > General> Remind me to take a break అనే ఆప్ష‌న్​ను ఎంచుకోవాలి. అందులో ఎంత‌సేప‌టి వ‌ర‌కు బ్రేక్ తీసుకోవాలో సెట్ చేసుకోవ‌చ్చు. కనిష్ఠంగా 5 నిమిషాల నుంచి గరిష్ఠంగా 23 గంట‌ల 55 వ‌ర‌కు ఈ బ్రేక్ టైమ్​ను సెట్​ చేసుకోవచ్చు. తరువాత OK ప్రెస్ చేయాలి. అంతే నిర్ణీత సమయం అయిన తరువాత మీకు యూట్యూబ్ నుంచి మీకు టైమ్ బ్రేక్​ నోటిఫికేషన్ వస్తుంది.

యూట్యూబ్​లో మ‌నం నిద్ర‌పోవాల్సిన సమయాన్ని గుర్తు చేయడానికి కూడా ఒక ఫీచర్​ అందుబాటులో ఉంది. ఇందుకోసం మీరు Settings > General> Remind me when it's bedtime break అనే ఆప్షన్​ను ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది.

3. ప్రైవ‌సీ ప్రొటక్షన్​
మ‌నం యూట్యూబ్ ఓపెన్ చేసిన‌ప్పుడు, గ‌తంలో చూసిన వీడియోలకు సంబంధించిన​ కంటెంట్ వ‌స్తుంది. మీరు మాత్ర‌మే ఆ ఖాతా వాడిన‌ప్పుడు ఏం కాదు కానీ, దాన్ని ఇత‌రులు వినియోగించిన‌ప్పుడు లేదా మీ ఫోన్​లో ఎవ‌రైనా యూట్యూబ్ చేస్తున్న‌ప్పుడు, ఏదైనా అనుకోని వీడియోలు వ‌స్తే అంతే సంగ‌తులు. ఇలా జ‌ర‌గ‌కూడ‌ద‌నుకుంటే, కింద తెలిపిన రెండు ప‌ద్ధ‌తులు ఉప‌యోగించాలి.

1వ పద్ధతి​: యూట్యూబ్‌లో Incognito మోడ్​ని ఆన్ చేయ‌డం. దీని వ‌ల్ల మీ అకౌంట్లోకి సైన్​ఇన్ కాకుండానే వీడియోలు చూడ‌వ‌చ్చు. దీని వల్ల మీరు చూసే కంటెంట్​ యూట్యూబ్ హిస్ట‌రీలో నమోదు అవ్వదు. దాన్నెలా ఉప‌యోగించాలంటే, యూట్యూబ్ ఓపెన్ చేసిన త‌ర్వాత, అకౌంట్ బ‌ట‌న్​ని (You tab) ప్రెస్ చేస్తే, అకౌంట్ నేమ్ కింద Turn on Incognito అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే incognito మోడ్ ఆన్ అవుతుంది. పని పూర్తి అయిన తరువాత Turn Off Incognito నొక్కి దానిని ఆఫ్​ చేసుకోవచ్చు.

2వ పద్ధతి : Settings ఓపెన్ చేసి History and Privacy > Manage All Historyని ఎంచుకుని, మీ యూట్యూబ్​ అకౌంట్​ను సెలెక్ట్ చేసుకోవాలి. తరువాత యూట్యూబ్​ హిస్టరీ పేజ్​లోకి వెళ్లి, Controls ట్యాబ్ ప్రెస్ చేస్తే అక్క‌డ Turn Off అని ఉంటుంది. దాన్ని నొక్కితే Pause అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇకపై మీ సబ్​స్క్రిప్షన్ కనిపిస్తుంది కానీ, సెర్చ్​ యాక్టివిటీస్​ మాత్రం రికార్డ్ కాకుండా ఉంటాయి.

4. వీడియో స్టాట్స్​
మీరు చూస్తున్న వీడియోకు సంబంధించి ఎంత డేటా ఖ‌ర్చ‌వుతుంది? ఏ మొబైల్​లో ఆ వీడియో చూస్తున్నారు? వీడియో ID, వీడియో అండ్ ఆడియో ఫార్మాట్, వాల్యూమ్ స్థాయి, బ్యాండ్‌విడ్త్ త‌దిత‌ర స‌మాచారాలను యూట్యూబ్​లో చూసుకోవచ్చు. ఈ ఫీచ‌ర్ ఎనేబుల్​ చేసుకోవాలంటే, You అనే tabపై ప్రెస్ చేసి Generalని ఎంచుకోవాలి. అందులో Enable stats for nerds అని ఉంటుంది. దాన్ని ఆన్ చేసుకోవాలి. త‌ర్వాత ఏదైనా వీడియో చూస్తున్న‌ప్పుడు పైన కుడివైపున ఉన్న 3 చుక్క‌ల్ని ప్రెస్ చేసి, Additional settings> stats for nerdsని ఎంచుకుంటే, ఆ వీడియోకు సంబంధించిన స‌మాచారం అంతా క‌నిపిస్తుంది. దాన్ని తీసేయాలంటే, ఆ స‌మాచారం ప‌క్క‌న 'X' అనే సింబ‌ల్​పై ప్రెస్ చేస్తే సరిపోతుంది.

5. యూట్యూబ్ లూప్ ఫీచర్
సాధారణంగా మీరు ఎడ్యుకేషనల్​ ట్యుటోరియల్స్​ను చూస్తున్నప్పుడు ఏదైనా స‌మాచారం కోసం దాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల్సి వ‌స్తుంది. దీని కోసం యూట్యూబ్​ లూప్​ ఫీచర్​ను ఉపయోగించవచ్చు. ఇది ఎడ్యుకేషనల్ వీడియోలకే కాకుండా, మీకు ఇష్టమైన మ్యూజిక్ వీడియోలను లేదా మీకు నచ్చిన కంటెంట్‌ను రిపీట్‌ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.

ఇందుకోసం మీకు నచ్చిన వీడియోను ఓపెన్ చేయండి. త‌ర్వాత చాప్ట‌ర్స్ లిస్టు ఓపెన్ చేయండి. మీరు సాధారణ పోర్ట్రెయిట్ మోడ్‌లో ఉన్నట్లయితే, వీడియో కింద డిస్క్రిప్ష‌న్ బాక్స్ ఆన్ చేస్తే కింద వీడియోల లిస్టు వ‌స్తుంది. అదే మీరు ఫుల్ స్క్రీన్ లో ఉంటే, స్క్రీన్‌పై నొక్కి మీకు కావాల్సిన చాప్ట‌ర్ ఎంచుకోండి. త‌ర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, మీరు లూప్ చేయాలనుకుంటున్న చాప్టర్‌పై నొక్కండి. త‌ర్వాత లూప్ బటన్‌ను నొక్కి వీడియో టైమ్‌లైన్‌ని చూసినప్పుడు, ఆ ప‌ర్టిక్యుల‌ర్ చాప్ట‌ర్ మాత్ర‌మే హైలెట్ అవుతుంది. ఈ విధంగా మీకు నచ్చిన ఛాప్టర్​ను సులువుగా రిపీట్ చేసుకొని చూడవచ్చు. దీన్ని ఆఫ్ చేయాలంటే, చాప్ట‌ర్ లిస్టు ఓపెన్ చేసి మ‌ళ్లీ లూప్ బ‌ట‌న్​పై నొక్కితే స‌రి.

గూగుల్​ మ్యాప్స్​లోనూ లైవ్​ లొకేషన్​ షేరింగ్​- ఎలాగో తెలుసా?

రెడ్​మీ నుంచి మరో కొత్త స్మార్ట్​ఫోన్​​- ఐఫోన్ కంటే సూపర్​ కెమెరా!- ధర ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.