ETV Bharat / science-and-technology

ట్విట్టర్​లో టిక్​టాక్​ తరహా స్వైపింగ్​ ఆప్షన్​!

Tiktok Interface In Twitter: ప్రముఖ సామాజిక మాధ్యమాల్లో ఒకటైన ట్విట్టర్​ స్వైపింగ్​ ఆప్షన్​ను తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ఓ కొత్త ఇంటర్​ఫేస్​ను సిద్ధం చేస్తున్నట్లు ట్విట్టర్​ ఇండియా ఓ పోస్ట్​లో పేర్కొంది.

tiktok interface in twitter
ట్విట్టర్​లో స్వైపింగ్​ ఆప్షన్​
author img

By

Published : Dec 10, 2021, 4:49 PM IST

Tiktok Interface In Twitter: భారత్​ సహా ఇతర దేశాల్లో టిక్​టాక్​ చాలా త్వరగా పుంజుకుంది. ఇందుకు గల కారణాల్లో ప్రధానమైంది.. వీడియోలను త్వరగా చూసేందుకుగానూ ఇచ్చిన స్వైపింగ్​ ఆప్షన్​. టిక్​టాక్​ మాత్రమే కాకుండా.. ఇన్​షార్ట్స్​ లాంటి యాప్​లు ఈ స్వైపింగ్​ ఆప్షన్​తో మార్కెట్​లోకి చాలా త్వరగా వెళ్లాయి. తరువాత కాలంలో చాలా యాప్​లు దీనిని ఫాలో అవుతూ వచ్చాయి. ప్రస్తుతం మైక్రో బ్లాగింగ్​ ఫ్లాట్​ఫాం అయిన ట్విట్టర్​ కూడా ఇదే బాట పట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు కొనసాగుతున్నట్లు ట్విట్టర్​ ఇండియా ఓ పోస్ట్​ లో పేర్కొంది. ఇది ఇంకా పరీక్షల దశలో ఉన్నట్లు చెప్పింది.

  • Does your Explore tab look different? It means you’re a part of our latest test. Exciting, right?

    We’re testing a new experience in India to help you discover the best content.

    Available to some of you who use Twitter in English and are on the latest version of Android or iOS pic.twitter.com/xn5t7OKmXy

    — Twitter India (@TwitterIndia) December 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ట్విట్టర్​లో ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే యూజర్లు వీడియోలను, ఫొటోలను, టెక్స్ట్​​తో కూడిన ట్వీట్లను ఒక్కొక్కటిగా పైకి స్వైప్​ చేయవచ్చు. ఇందులో యూజర్​కు అసవసరమయ్యే కంటెంట్​ను చూపించే దిశగా అడుగు వేస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇలా వచ్చే ఫీడ్​ను చూసే విధంగా ఇంటర్​ఫేస్​ను సిద్ధం చేస్తోంది. దీనిని భారత్​ సహా ఇతర దేశాల్లో కేవలం ఎంపిక చేసిన వినియోగదారుల ఐఓఎస్​ ఫోన్​లలో ప్రయోగాలు చేస్తోంది. అయితే గతంలో వివాదాస్పదంగా మారిన ట్విట్టర్​ ట్రెండ్స్​ అప్షన్​కు కొత్త ఇంటర్​ఫేస్​ ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చింది. ప్రస్తుతం ఆ బటన్​ ఎక్స్​ప్లోరల్​లో మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు దానిని పైకి తీసుకువచ్చిది. మునపటిలానే యూజర్​ను బ్లాక్​ చేయడం, ట్వీట్లను రిపోర్ట్​ చేయడం లాంటివి కొత్తగా ఇంటర్​ఫేస్​లో ఉండనున్నాయి.

యూజర్ల కొత్త ఆసక్తులను కనుక్కోవడం, ట్రెండింగ్​ ఆంశాలను వెతకడం లాంటివి మరింతగా అప్​డేట్​ చేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఇది వ్యక్తిగత అంశాలను మెరుగుపరచడంలో భాగమని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ ఫీచర్​ను కొంతమంది ఐఓఎస్​ యూజర్లకు మాత్రమే కల్పించినట్లు చెప్పారు.

ఇదీ చూడండి: జీమెయిల్​ యాప్​లో ఇకపై ఆడియో, వీడియో కాల్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.