ETV Bharat / science-and-technology

టెలిగ్రామ్​లో కొత్త ఫీచర్​.. ఒకేసారి 1000 మందితో! - టెలిగ్రామ్​లో వీడియో కాల్​ సెట్టింగ్​

టెలిగ్రామ్.. కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేసారి 1000 మందితో వీడియో కాల్​ మాట్లాడుకునేలా యాప్​లో మార్పులు చేసింది. సౌండ్​తో పాటు స్క్రీన్​ షేరింగ్​ సదుపాయాన్ని జోడించింది.

Telegram will now let up to 1000 people join video call
టెలిగ్రామ్
author img

By

Published : Aug 1, 2021, 4:32 PM IST

ప్రముఖ మెసేజింగ్​ యాప్​ టెలిగ్రామ్.. యూజర్ల కోసం​ కొత్త ఫీచర్లను ప్రకటించింది. టెలిగ్రామ్​లో 1000 మందితో వీడియో కాల్ సహా వీడియో మెసేజ్​లను పంపేలా మార్పులు చేసింది. సౌండ్​తో స్క్రీన్​ షేరింగ్​, ఒన్​-ఆన్​-ఒన్​ కాల్స్​ లాంటి సదుపాయాలు కల్పించింది. ఈ మధ్య వాట్సాప్​లో ప్రైవసీ పాలసీలో మార్పులు రావడం వల్ల ఆ యూజర్లలో చాలామంది టెలిగ్రామ్​ను సురక్షితంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది.

భూమి మీద ఉన్న మానవాళి మొత్తం ఒకేసారి గ్రూప్​ కాల్​ మాట్లాడే విధంగా భవిష్యత్​లో యాప్​ మార్పులు చేయనున్నామని టెలిగ్రామ్​ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఒకేసారి 1000 మంది వీడియో కాల్​ సదుపాయం సహా 30 మంది తమ కెమెరాతో పాటు స్క్రీన్​ను ఇతరులతో షేర్​ చేసుకునే అవకాశాన్ని ఇందులో కల్పించారు. ఆన్​లైన్​ క్లాసులతో పాటు సెమినార్స్​, వీడియో కాన్సర్ట్స్​లలో ఎంతోమంది ప్రేక్షకులు పాల్గొనేందుకు ఇది సహకరిస్తుంది.

వీడియో మెసేజ్​లు

టెలిగ్రామ్​లో వీడియో మెసేజ్​ ఫీచర్​నూ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనివల్ల వీడియోలను వేగంగా పంపిడం సహా గ్యాలరీకి యాడ్​ చేయకుండానే ఏదైనా వీడియోను ట్రాన్స్​ఫర్​ చేసే అవకాశం ఉంది. దాని కోసం చాటింగ్​ బాక్స్​లో రికార్డింగ్​ బటన్​పై క్లిక్​ చేసి సరి. మీరు పంపిన ఆ వీడియో గ్యాలరీలో సేవ్​ కాదు.

వీడియో ప్లేబ్యాక్​ స్పీడ్​

టెలిగ్రామ్​లో యూజర్లు పంపిన వీడియోలను ప్లేబ్యాక్​ స్పీడ్​ విధానంతో చూసే అవకాశం ఉంది. ఈ యాప్​లోని మీడియా ప్లేయర్​ ద్వారా​ 0.5x, 1.5x, 2x వేగంతో వీడియో కంట్రోల్​​ చేసేందుకు వీలుంది. వీడియో స్లో మోషన్​లో చూసే సౌకర్యం ఉంది. వీడియో ప్లేబ్యాక్​ సెట్టింగ్​ కోసం వీడియో ఫుల్​స్క్రీన్​లో కనిపిస్తున్న మూడు డాట్లపై క్లిక్​ చేసి.. అవసరమైన ఆప్షన్​ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

సౌండ్​తో సహా స్క్రీన్​ షేరింగ్​..

టెలిగ్రామ్​లోని వీడియో కాల్​ ద్వారా..యూజర్లు స్క్రీన్​ షేర్​ చేసుకునే అవకాశం కలదు. ఏ యూజర్​ అయిన తాను చూస్తున్న సినిమాను స్క్రీన్​ షేరింగ్​ ద్వారా పంపవచ్చు. అయితే ఈ షేరింగ్​ ద్వారా సౌండ్​నూ కూడా మిగిలిన వారందరూ వినే సౌకర్యం ఉంది.

ఇదీ చూడండి.. టెలిగ్రామ్ కొత్త ఫీచర్​.. 'వాయిస్​ చాట్​​ 2.0'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.