ETV Bharat / science-and-technology

ఎగురుకుంటూ మీ ఇంటి ముందుకు క్షణాల్లో ఆహారం!

ఫుడ్​ డెలివరీలో డ్రోన్లను వినియోగించే దిశగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇక క్షణాల్లో వినియోగదారులకు ఆహారాన్ని చేరవేయాలని చూస్తున్నాయి దిగ్గజ ఫుడ్​ డెలివరీ సంస్థలు. ఇప్పటికే టెస్టింగ్​ ప్రారంభించిన స్విగ్గీ.. త్వరలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Swiggy may soon deliver food and medicines via drones
ఫుడ్​ డెలివరీ
author img

By

Published : Jun 17, 2021, 1:04 PM IST

సరికొత్త రీతిలో వినియోగదారులకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది ఫుడ్​ డెలివరీ దిగ్గజ సంస్థ స్విగ్గీ. దీనిలో భాగంగానే ఆహారం చేరవేసేందుకు డ్రోన్లను ఉపయోగించుకోవాలని చూస్తోంది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించింది. డ్రోన్​ కంపెనీ ఏఎన్​ఆర్​ఏ టెక్నాలజీతో జట్టుకట్టిన స్విగ్గీ.. ఇప్పటికే భారత్​లో ట్రయల్స్​ ప్రారంభించింది. ఇందుకోసం.. రక్షణ మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహా డీజీసీఏ అనుమతులు కూడా లభించాయి.

జూన్​ 16న ప్రయోగాత్మకంగా పరిశీలించింది కూడా. పంజాబ్​, ఉత్తర్​ప్రదేశ్​ల్లోని అన్ని జిల్లాల్లో ట్రయల్స్​ నిర్వహించి.. ఆ తర్వాత పూర్తి స్థాయిలో డ్రోన్ల ద్వారా ఫుడ్​ డెలివరీని ప్రారంభించనున్నట్లు ఏఎన్​ఆర్​ఏ స్పష్టం చేసింది. ఫుడ్​తో పాటు ఔషధాలు​ కూడా డెలివరీ చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

డ్రోన్ల ద్వారా చేసిన ఫుడ్​ డెలివరీకి సంబంధించి ఓ 3 నిమిషాల వీడియోను కూడా షేర్ చేసింది.

Swiggy may soon deliver food and medicines via drones
డ్రోన్లతో ఫుడ్​ డెలివరీ ట్రయల్స్​

క్షణాల్లోనే మీ ముందుకు...

డ్రోన్లను ఉపయోగించి.. తక్కువ ఖర్చుతో వేగంగా ఆహారం చేరవేయొచ్చని అంటున్నారు స్విగ్గీ ప్రిన్సిపల్​ ప్రోగ్రామ్​ మేనేజర్​ శిల్పా జ్ఞానేశ్వర్​. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా.. సరికొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలని తెలిపారు.

డ్రోన్లతో మీ ఇంటి ముందుకే ఆహారం

స్విగ్గీకి జొమాటో, డుంజో వంటి సంస్థలు కూడా గట్టిపోటీనిస్తున్నాయి. ఇప్పటికే డుంజో కూడా తెలంగాణలో ప్రపంచ ఆర్థిక సమాఖ్య సహకారంతో మెడిసిన్​ డెలివరీ చేసేందుకు ఊవిళ్లూరుతోంది. ఆ దిశగా గ్రీన్​సిగ్నల్​ లభించింది.

ఇదీ చదవండి: 36వేల మంది వీధి వ్యాపారులతో స్విగ్గీ ఒప్పందం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.