SpyNote Malware : సైబర్ కేటుగాళ్లు రోజురోజుకు మరింత రెచ్చిపోతున్నారు. ఇప్పటికే పలు రకాల ఫేక్ లింక్స్ ద్వారా మన డివైజుల్లోకి డేంజరస్ వైరస్లు, స్పైవేర్లు చొప్పించి పర్సనల్ డేటాను చోరీ చేస్తున్న వీరు.. తాజాగా మరో కొత్త యాప్‌తో మోసం చేసేందుకు రెడీ అయ్యారు. కనుక వీరి పట్ల జాగ్రత్తగా ఉండకుంటే మన వ్యక్తిగత సమాచారం మొత్తం ఈ నేరగాళ్ల చేతుల్లోకి పోవడం ఖాయమని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మీకు తెలియకుండానే..
ఎఫ్-సెక్యూర్ అనే ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ.. సైబర్ కేటుగాళ్లు మన ఫోన్స్‌లోకి 'స్పైనోట్' అనే కొత్త రకం మాల్వేర్ను పంపిస్తున్నట్లు గుర్తించింది. వీరు మరీ ముఖ్యంగా ఆండ్రాయిడ్ యూజర్లను టార్గెట్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ స్పైవేర్(SpyNote) అనే అప్లికేషన్ మనకి తెలియకుండానే మన డివైజ్‌లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఇది మనకి కంటికి కనపడకుండానే సైబర్ ఎటాకర్లకు కావాల్సిన మన పర్సనల్ డేటాను ఎంతో చాకచక్యంగా చేరవేస్తుంది. ముఖ్యంగా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ భద్రతా ప్రమాణాలను సైతం దాటి మన డివైజ్‌లోకి చొచ్చుకొస్తోందని టెక్ నిపుణులు అంటున్నారు.
ఎలా డౌన్లోడ్ అవుతుంది?
సైబర్ క్రిమినల్స్ ఈ యాప్(SpyNote)ను స్మిషింగ్ పద్ధతిలో మన మొబైల్స్‌లో ఇన్స్టాల్ అయ్యేలా చూస్తున్నారు. అంటే టెక్స్ట్(SMS) మెసేజెస్ రూపంలో కొన్ని రకాల ప్రమాదకరమైన లింక్స్‌ను ఆండ్రాయిడ్ యూజర్స్‌కు పంపిస్తారు. ఒక వేళ ఎవరైనా వీటిని క్లిక్ చేస్తే.. ఈ మాల్వేర్ యాప్ మన ఫోన్లోకి సులువుగా డౌన్లోడ్ అయిపోతుంది. వాస్తవానికి ఈ మాల్వేర్ ఒక రెగ్యులర్ ఓఎస్ అప్డేట్ రూపంలో మీ ఆండ్రాయిడ్ వస్తుంది. దీనిని మీరు నిజమైన అప్డేట్గా భావించి క్లిక్ చేసే.. ఆ మాల్వేర్ సులువుగా మీ ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయే ప్రమాదముందని చెబుతున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్.
డేటా చోరీ!
ఈ స్పైనోట్ మీ ఫోన్లోని కీలకమైన డేటాను చోరీ చేసి హ్యాకర్లకు అందిస్తుంది. ప్రధానంగా..
- ఫోన్ కాల్స్ డేటా
- వ్యక్తిగత సందేశాలు
- మీ బ్యాంక్ ఖాతా వివరాలు
- మీడియా ఫైల్స్ (ఫొటోలు, వీడియోలు)
- అంతేకాకుండా మీ పర్సనల్ చాటింగ్‌ను కూడా యాక్సెస్ చేస్తుంది.
ఆండ్రాయిడ్‌లో దాక్కుంటుందిలా!
ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ స్పైనోట్ను గుర్తు పట్టడం చాలా కష్టం. ఇది మన ఫోన్లోనే ఉన్నప్పటికీ మనకి అస్సలు కనబడదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటూ తన పనిని తను చేసుకుంటూ పోతుంది ఈ డేంజరస్ అప్లికేషన్. హ్యాకర్లు ఈ మాల్వేర్ని యాక్టివేట్ చేయడానికి.. యూజర్ ఫోన్‌కు 'ఎక్స్టెర్నల్ ట్రిగ్గర్'(External Trigger) అనే సాఫ్ట్‌వేర్‌ను పంపిస్తారు.
యూజర్ డేటాను ఇలా దొంగిలిస్తుంది!
ఈ SpyNote యాండ్రాయిడ్ వినియోగదారుడి ప్రైవసీని హరిస్తుంది. ఎందుకంటే ఈ మాల్వేర్ మనకు తెలియకుండానే ఫోన్ కాల్స్‌ను .wav ఫైల్ ఫార్మాట్‌లో రికార్డ్ అండ్ సేవ్ చేసి కేటుగాళ్లకు పంపుతుంది. మాల్వేర్ దాడికి గురైన బాధితుడికి ఇన్‌కమింగ్ కాల్స్ వచ్చినప్పుడు ఈ ఫోన్లో బ్రాడ్‌కాస్ట్ రిసీవర్ ట్రిగ్గర్ ఎనేబుల్ అవుతుంది. ఈ బ్రాడ్‌కాస్ట్ రిసీవర్‌లోని కోడ్ సదరు వ్యక్తి కాల్ ఆన్సర్ చేశాడని గుర్తించిన వెంటనే మీ కాల్స్‌ను రికార్డ్ చేస్తుంది. కాల్స్ రికార్డింగ్స్‌తో పాటు మొబైల్లోని మీ మీడియా ఫైల్స్(.jpeg ఫొటోలు)ను, బ్యాంకింగ్ పాస్‌వర్డ్స్‌ను కూడా రికార్డ్ చేసి సైబర్ క్రిమినల్స్‌కు పంపుతుంది.
గమనిక : ఇలాంటి సైబర్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే.. మీ ఫోన్లకు వచ్చే ప్రతీ లింక్‌ను అవగాహన లేకుండా క్లిక్ చేయకండి. SMS రూపంలోనే కాకుండా వివిధ మార్గాల ద్వారా వచ్చే ఇటువంటి అన్-నోన్ లింక్స్ లేదా కాల్స్ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Top 10 WhatsApp Features : వాట్సాప్ లాంఛ్ చేసిన టాప్ 10 ఫీచర్స్ ఇవే.. మీరు వాడుతున్నారా?
X New Subscription Fee : ట్విట్టర్ యూజర్లకు షాక్.. ఏం చేయాలన్నా డబ్బులు కట్టాల్సిందే.. ఎంతంటే?