టెక్ దిగ్గజం శాంసంగ్.. అంతర్జాతీయ మార్కెట్లోకి కొత్తగా మూడు ల్యాప్‌టాప్‌లను శాంసంగ్ బుక్ సిరిస్‌లో భాగంగా తీసుకొచ్చింది. వీటిని గెలాక్సీ బుక్, గెలాక్సీ బుక్ ప్రో, గెలాక్సీ బుక్ ప్రో 360 పేర్లతో విడుదల చేసింది. ఇవి అన్నీ అమెలెడ్ డిస్ప్లేతో రావడం విశేషం.
శాంసంగ్ గెలాక్సీ బుక్
శాంసంగ్ గెలాక్సీ బుక్ ఒక స్లిమ్ మోడల్. గతంలో వచ్చిన వాటి కంటే మెరుగైన పనితీరు దీని సొంతం.
- డిస్ప్లే-15.6 అంగుళాలు
- యాంటీ గ్లేర్ టెక్నాలజీ
- 170 డిగ్రీల కోణం వరకూ డిస్ప్లేను సెట్ చేసుకునే సౌకర్యం
- రెండు రంగుల్లో వేరియంట్లు
- ల్యాప్‌టాప్ సామర్థ్యాన్ని బట్టి ధరల్లో మార్పు
- సమారు రూ. 63వేల నుంచి లక్ష రూపాయిల వరకు ఉంటుంది.
శాంసంగ్ గెలాక్సీ బుక్ ప్రో...
గెలాక్సీ బుక్ ప్రో కూడా స్లిమ్‌గా ఉంటుంది. బరువు తక్కువగా ఉండడం వల్ల సులభంగా ఎక్కడకైనా తీసుకుకెళ్లచ్చు. దీన్ని మొబైల్ ఆఫీసు, మూపీ ధియేటర్, పర్సనల్ కంప్యూటర్‌గా కూడా వాడుకోవచ్చు. ఇది మూడు కలర్ వేరియంట్లలో రానుంది. దీని ధర రూ. 84వేల నుంచి రూ.1 లక్ష 40 వరకు ఉంటుంది.
గెలాక్సీ బుక్ ప్రో 360..
గెలాక్సీ బుక్ ప్రో 360కి ఓ ప్రత్యేక ఉంది. దీన్ని రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. కీప్యాడ్, పెన్ సదుపాయాలు ఉన్నాయి. ఇది చాలా తక్కువ బరువు ఉండడమే కాక అత్యంత నాజూకుగా ఉంటుంది. దీనితో శాంసంగ్ బుక్ సిరిస్‌లోని వాటిని సులభంగా కనెక్ట్ చేసుకోవచ్చు.
- 360 డిగ్రీల్లో రొటేషన్ చేసుకోవచ్చు.
- ట్యాబ్గా కూడా ఉపయోగించుకోవచ్చు.
- పెన్ ఫంక్షనాలిటీ
- 15.6 అంగుళాలు, 13.3 అంగుళాలతో మార్కెట్లోకి
- ఈ రెండు వేరియంట్లు మూడూమూడు రంగుల్లో వస్తున్నాయి.
- వీటి ధరలు రూ.1 లక్ష 17వేల నుంచి రూ.1 లక్ష 80 వేల వరకూ ఉంటాయి.
ఈ ల్యాప్‌టాప్‌లు మే 21 నుంచి బహిరంగ మార్కెట్లో రానున్నాయని శాంసంగ్ తెలిపింది. వినియోగదారులు ఆఫ్‌లైన్, ఆన్లైన్ మోడ్లలో వివిధ ఆఫర్స్‌తో వీటిని పొందవచ్చని పేర్కొంది.
ఇదీ చూడండి: బడ్జెట్ ధరలో ల్యాప్‌టాప్ కావాలా? ఇవి ట్రై చేయండి