Sony Honda: ఎలక్ట్రానిక్స్, ఆటో రంగంలో దిగ్గజ సంస్థలైన సోనీ, హోండా.. విద్యుత్ వాహనాల తయారీ కోసం చేతులు కలిపాయి. 2025కల్లా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అందుకోసం ఈ ఏడాది ఓ జాయింట్ వెంచర్లోకి అడుగుపెడుతున్నట్లు ఈ రెండు జపాన్ సంస్థలు ప్రకటించాయి.
వాహనాల అభివృద్ధి, సాంకేతికత, విక్రయంలో హోండా అనుభవం.. ఇమేజింగ్, టెలీకమ్యూనికేషన్, నెట్వర్క్, ఎంటర్టైన్మెంట్లో సోనీ నైపుణ్యాన్ని ఒకచోటుకి చేర్చాలనేది ఈ జాయింట్ వెంచర్ ప్రణాళిక. సంప్రదాయకంగా రెండు విభిన్న మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు కలిసి పనిచేయడం జపాన్‌లో అరుదు. అయితే విద్యుత్ వాహనాల కాలంలో ఇది అనివార్యం అయిపోయింది.
ఈ జాయింట్ వెంచర్ ద్వారా వాహనాలను డిజైన్ చేసి, అభివృద్ధి చేయనున్నారు. వాహనాల తయారీకి హోండా ప్లాంట్లను వినియోగించనున్నారు. మొబిలిటీ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్‌ను సోనీ అభివృద్ధి చేయనుంది. అంటే ఉత్పత్తి హోండాలో జరిగితే.. విద్యుత్ వాహన సేవలు సోనీ అందించనుంది!
ఇదీ చూడండి: చౌకగా విద్యుత్తు వాహనాలు.. 'బ్యాటరీ మార్పిడి సేవ' విస్తరణతో