ETV Bharat / science-and-technology

Someone Blocked Your Number? : మీ నెంబర్‌ బ్లాక్ చేశారా..? ఇలా కాల్ చేయొచ్చు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 3:59 PM IST

Someone Blocked Your Number? You Can Still call them : అప్పు తీసుకుంటారు.. తిరిగి ఇవ్వాలని ఫోన్ చేస్తే.. కాల్ లిఫ్ట్ చేయరు. మళ్లీ మళ్లీ కాల్ చేస్తే.. నంబర్ బ్లాక్ చేసి పడేస్తారు. ఇదొక్కటేకాదు.. వివిధ కారణాలతో ఫోన్​ నంబర్లు బ్లాక్ చేస్తుంటారు. అయితే.. వాళ్లు బ్లాక్ చేసినా.. మీరు కాల్ చేయొచ్చు! ఈ విషయం మీకు తెలుసా..?

Someone Blocked Your Number
Someone Blocked Your Number You Can Still call them

Someone Blocked Your Number? You Can Still call them : ఏవేవో కారణాలతో.. ఒకరి ఫోన్ నంబర్ మరొకరు బ్లాక్ చేయడం మనకు తెలిసిందే. అయితే.. అత్యవసరంగా ఫోన్​ చేయాల్సి వస్తే.. కాల్ కలవదు. ఇలాంటి సమస్య ఫేస్ చేసేవారికి.. రెండు యాప్స్ అందుబాటులోకి వచ్చాయి మరి అవేంటి..? ఎలా వాడాలి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఇండికాల్​ యాప్​(IndyCall App):

  • మిమ్మల్ని బ్లాక్ చేసిన వారి నెంబర్‌కు కాల్ చేయడానికి ఉపయోగించే ఉత్తమ యాప్‌లలో ఇండికాల్ ఒకటి.
  • మీరు ఎవరికైనా కాల్ చేయాలంటే ముందుగా Google Play Store నుంచి IndyCall యాప్‌ని డౌన్‌లోడ్ చేసి, ఓపెన్​ చేయండి.
  • మీరు యాప్‌ని తెరిచిన తర్వాత, దానికి అవసరమైన అన్ని పర్మిషన్స్ ఇవ్వాలి.
  • తర్వాత లాగిన్‌పై క్లిక్ చేసి, ఆపై మీరు యాప్‌కి లాగిన్ చేయాలనుకుంటున్న Google ఖాతాను ఎంచుకోండి.
  • మీరు లాగిన్ చేసిన తర్వాత, మీరు కాల్ చేయడానికి కొన్ని క్రెడిట్‌లను సంపాదించాలి.
  • ఆ యాప్​లో యాడ్స్ చూడడం ద్వారా మీకు ఈ క్రెడిట్స్ వస్తాయి. అంటే.. ఇవి ఒకరమైన పాయింట్స్ అన్నమాట.
  • ఇవి ఎన్ని ఉంటే.. అంతసేపు మాట్లాడవచ్చు.
  • ఈ క్రెడిట్‌లను సంపాదించడానికి Get Minutes అనే పేరు గల కుడి ఎగువ మూలలో ఉన్న ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత "More Free Minutes"పై క్లిక్ చేయండి.
  • ఇక్కడ మీరు క్రెడిట్స్ సంపాదించడానికి యాడ్​లను చూడవచ్చు.
  • ఈ క్రెడిట్‌లను ఉపయోగించడం ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తి నంబర్​కు డయల్ చేసి కాల్ చేయవచ్చు.
  • మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేస్తున్నప్పుడు మీ దగ్గర ఉన్న క్రెడిట్స్ తగ్గిపోతూ ఉంటే.. మాట్లాడుతూనే మీరు యాడ్స్ చూడవచ్చు. తద్వారా క్రెడిట్స్ యాడ్ అవుతూ ఉంటాయి.
  • Indycall యాప్‌ని ఉపయోగించడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏమిటంటే.. మీ ఫోన్ నంబర్ స్థానంలో మరో కాలింగ్ ఐడీ నంబర్‌ను కూడా సెట్ చేయవచ్చు.
  • ఈ ఆప్షన్ ద్వారా.. మీరు ప్రతిసారీ వేరే నంబర్ ద్వారా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయవచ్చు.

WhatsApp New Features : లేటెస్ట్​ వాట్సాప్​ బిజినెస్​ ఫీచర్స్​.. ఇకపై మరింత ఈజీగా బుకింగ్స్, పేమెంట్స్!

దూస్రా యాప్​(Doosra APP):

  • మీ నెంబర్‌ను చూపకుండా ఎవరికైనా కాల్ చేసే అధికారాన్ని అందించే ప్రైవేట్ నెంబర్ కాలింగ్ యాప్‌లలో దూస్రా ఒకటి.
  • మీ నంబర్‌ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయడానికి, ముందుగా మీరు Google Play Store నుంచి Doosra యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  • యాప్‌ను తెరిచి, అవసరమైన అనుమతులు ఇచ్చిన తర్వాత.. మీరు "Get Doosra Number" పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ మీకు ప్రైవేట్ నెంబర్ ఇవ్వబడుతుంది. ఇది మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయడానికి దీనిని మీరు రిజర్వ్ చేసి కొనుగోలు చేయవచ్చు.
  • ఈ పద్ధతిని ఉపయోగించేందుకు కొంత మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
  • మీరు ఈ నంబర్‌ను నెలకు 83 రూపాయల ధరతో పొందవచ్చు.
  • ప్లాన్‌ని ఎంచుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రభుత్వ పత్రంతో E-Kycని పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ఆ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మీకు ప్రైవేట్ నెంబర్ కేటాయించబడుతుంది.
  • ఇప్పుడు మీరు ఈ ప్రైవేట్ నెంబర్ నుంచి ఎటువంటి సమస్య లేకుండా మిమ్మల్ని బ్లాక్ చేసిన వ్యక్తికి కాల్ చేయవచ్చు.

Note: మీరు సరైన, న్యాయమైన పనికోసం ఈ యాప్స్ ను వినియోగిస్తే ప్రాబ్లం లేదు. అలా కాకుండా.. ఎవరినైనా వేధించడానికో, మరో అక్రమానికో వినియోగిస్తే మాత్రం.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగుతారు.

WhatsApp Pay India News : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​.. ఇకపై నేరుగా యాప్​​లోనే పేమెంట్స్​!

Phone Battery Health Check : ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయాలా?.. ఈ సింపుల్​ టిప్స్​​ పాటించండి!

మొబైల్​ ఫోన్​ పోయిందా? ఆన్​లైన్​లో సింపుల్​ రిక్వెస్ట్​తో బ్లాక్! సిమ్ మార్చినా నో ఛాన్స్!!

How To Protect WiFi Router From Hackers : మీ WiFi హ్యాక్​ అయిందని డౌట్​గా ఉందా?.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే నో ప్రాబ్లమ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.