ETV Bharat / science-and-technology

టీకా గురించి ఈ మెసేజ్​లు వస్తున్నాయా.. జర భద్రం!

దేశంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం 18 ఏళ్లు పైబడినవారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీనినే హ్యాకర్లు ఆయుధంగా చేసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్​ కోసం అని కింద ఉండే లింక్​ను క్లిక్​ చేయండి అంటూ సందేశాలు పంపుతున్నారు. పొరపాటున ఆ లింక్​ మీద క్లిక్​ చేస్తే ఏం అవుతుందో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే.

sms malware, vaccine
ఈ మెసేజ్​లు వస్తున్నాయా.. అయితే జర భద్రం!
author img

By

Published : May 4, 2021, 9:57 PM IST

ప్రపంచంలో ఏం జరిగినా హ్యాకర్లు క్యాష్‌ చేసుకోవడంలో ముందుంటారు. మిగిలిన దేశాల్లో ఏమో కానీ, మన దేశంలో మాత్రం చాలా ముందుంటారు. తాజాగా మరోసారి అలాంటి హ్యాకింగ్‌/మాల్‌వేర్‌ ప్రయత్నం బయటపడింది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వం 18 ఏళ్లు పైబడినవారికి కూడా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. దీనినే హ్యాకర్లు ఆయుధంగా చేసుకుంటున్నారు. ఆ విషయాన్ని తెలుపుతూ మెసేజ్‌లు పంపి ఆకట్టుకొని, రిజిస్ట్రేషన్‌ కోసం యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండని మాల్‌వేర్‌ లింక్‌ పంపుతున్నారు.

sms malware, vaccine
మెసేజ్​ ఇలా వస్తుంది

పైన ఇమేజ్‌ చూశారు కదా... ఇలాంటి మెసేజ్‌లే చాలామందికి వస్తున్నాయి. చూడటానికి మీ మీద అభిమానంతో ఎవరో పంపించినట్లు ఉంటాయి. వ్యాక్సినేషన్‌ కోసం సమాచారం ఇచ్చేలానే ఉంటాయి. అయితే ఆ లింక్‌ను క్లిక్‌ చేసి.. వాళ్లు చెప్పినట్లు నడుకుచుంటే మీ వ్యక్తిగత సమాచారం మొత్తం గోవిందా... గోవింద. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే... ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే ఓపెన్‌ అయ్యే పేజీ, డౌన్‌లోడ్‌ అయ్యే యాప్‌ అచ్చంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌కు సంబంధించినవిలానే ఉండటం. దీంతో ఎవరికీ అనుమానం రావడం లేదు.

అసలేమవుతోంది అంటే...

వ్యాక్సినేషన్‌ రిజిస్ట్రేషన్‌ అంటూ మెసేజ్‌లో వచ్చే లింక్‌ను క్లిక్‌ చేస్తే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. అక్కడివరకు సమస్య చిన్నదే. అయితే ఆ యాప్‌ వాడటానికి ఓపెన్‌ చేసినప్పుడు మీ మొబైల్‌లోని కాంటాక్ట్స్‌, మెసేజ్‌లు, కాల్‌ హిస్టరీ... ఇలా యాక్సెస్‌ తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ వివరాలన్నీ ఆ మాల్‌వేర్‌ సృష్టించిన వ్యక్తికి వెళ్లిపోతాయి. అయితే ఇప్పుడు కొవిన్‌ యాప్‌ రిజిస్ట్రేషన్‌ మాటున వస్తున్న మాల్‌ వేర్‌ కొత్తగా ప్రవర్తిస్తుందట. మీ మొబైల్‌లో వివిధ సర్వీసుల బిల్లింగ్‌ ప్లాన్‌లు మార్చడం, లిమిట్‌ మార్చడం లాంటివి చేస్తుందట. అయితే ఆండ్రాయిడ్‌ యూజర్లు మాత్రమే ఈ మాల్‌వేర్‌తో ఇబ్బందిపడుతున్నారట.

sms malware, vaccine
ఓకే చేస్తే అంతే!

ఎలా జాగ్రత్తపడాలంటే...

ఇలాంటి మాల్‌ వేర్‌ నుంచి రక్షణ ఎలా... అంటే పాత సమాధానమే వస్తుంది. యాప్‌లు డౌన్‌లోడ్‌ అనేది కేవలం ప్లేస్టోర్‌ నుంచి మాత్రమే చేయాలి. ఏ ఇతర లింక్స్‌ ద్వారా వచ్చే యాప్‌లు సురక్షితం కావు. తెలిసిన వ్యక్తే కదా పంపించాడు అనుకుని ఎప్పుడూ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేయకూడదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున డౌన్‌లోడ్‌ చేసి ఉంటే వెంటనే మొబైల్‌ను ఫ్యాక్టరీ రీసెట్‌ చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే...

మాల్‌వేర్‌ ఉన్న లింక్‌ను ఇప్పటికే క్లిక్‌ చేసి ఉంటే... వెంటనే మీ ఫోన్‌ను రీసెట్‌ చేయండి. దాని కోసం మొబైల్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అందులో సిస్టమ్‌ ఆప్షన్‌లోకి వెళ్తే రిసెట్‌ (Reset) అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఎరేజ్‌ ఆల్ డేటా (Erase All Data) ఆప్షన్‌ వస్తుంది. దీన్ని క్లిక్‌ చేసి మొబైల్‌ను రీసెట్‌ చేయొచ్చు. దీంతోపాటు మీ మెయిల్‌ ఐడీ, బ్యాంకు ఖాతాలు, సోషల్‌ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లు మార్చుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి:టీకాపై సందేహాలా? ఇవిగో సమాధానాలు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.