ప్రపంచంలో స్మార్ట్ఫోన్ వాడకం అంతకంతకూ పెరిగిపోతోంది. ఆయా దేశాల్లో స్మార్ట్ఫోన్ వినియోగదారుల గణాంకాలను 'న్యూజూ' అనే సంస్థ విడుదల చేసింది. దీని ప్రకారం.. భారత్ రెండో స్థానంలో నిలించింది. తొలి ఎనిమిదిస్థానాల్లో ఉన్న దేశాల జాబితా మీరూ తెలుసుకోండి మరి..
91.2 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులతో చైనా తొలిస్థానంలో ఉంది. భారత్లో 43.9 కోట్ల మంది వినియోగదారులున్నారు. అమెరికాలో 27 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 16 కోట్ల మందితో ఇండోనేసియా నాలుగో స్థానంలో నిలిచింది. బ్రెజిల్లో 10.9 కోట్ల మంది స్మార్ట్ఫోన్ యూజర్లు ఉన్నారు. రష్యాలో 10 కోట్ల మంది స్మార్ట్ఫోన్ను కలిగి ఉన్నారు. జపాన్లో 7.6 కోట్ల మంది స్మార్ట్ఫోన్ వాడుతున్నారు. 7 కోట్ల మంది వినియోగదారులతో మెక్సికో ఎనిమిదో స్థానం సంపాదించింది. కనీసం నెలకు ఒకసారి మొబైల్ ఫోన్ను ఉపయోగించే వ్యక్తిని క్రియాశీల వినియోగదారుగా పరిగణించింది ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు 'న్యూజూ' తెలిపింది.
ఇవీ చదవండి: