ప్రస్తుతం అందరి చేతుల్లోనూ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. కంపెనీలు సైతం సరికొత్త మోడల్స్‌లో ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఎన్ని కొత్త రకాల స్మార్ట్ఫోన్లు వచ్చినప్పటికి అన్నింటికి బ్యాటరీ కామన్. దానితోనే కదా ఫోన్ నడిచేది. అయితే ఈ బ్యాటరీ లైఫ్‌ను మరింతగా పెంచేందుకు, ఎక్కవ కాలం పనిచేసేందుకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం.
పవర్ సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయడం:
ఫోన్ లో బ్యాటరీలో ఉన్నప్పుడు ఈ ఆప్షన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మొబైల్ వెంటనే స్విచ్ ఆఫ్ కాకుండా ఇది సహాయ పడుతుంది. ఫోన్లో అనవసరంగా రన్ అవుతున్న ఫంక్షన్లను ఇది నిలువరిస్తుంది. తిరిగి చార్జింగ్ పెట్టేంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూస్తుంది.
స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గించండం:
బ్రైట్నెస్ కూడా ఫోన్ చార్జింగ్‌పై ప్రభావం చూపుతుంది. కళ్లకు సౌకర్యవంతంగా ఉండేంత వరకు దీన్ని తగ్గించుకోవాలి. వీలైతే ఆటోమెటిక్ అడ్జస్ట్మెంట్ను ఆన్ చేసుకోవాలి. ఇది పరిసర కాంతి స్థాయికి అనుగుణంగా బ్రైట్నెస్ను మార్పు చేసుకుంటుంది.
ఉష్ణోగ్రతల ప్రభావం:
చల్లని, వేడి ప్రదేశాలకు ఫోన్‌ను దగ్గరగా ఉంచినప్పుడు మీ మొబైల్ బ్యాటరీ చెడిపోయో ప్రమాదం ఉంది. కనుక ఫోన్‌ను మరి ఎక్కువ వేడి, చల్లని ప్రదేశాల్లో ఉంచకండి.
డు నాట్ డిస్టర్బ్:
మొబైల్లో డౌన్‌టైమ్ షెడ్యుల్‌ని పెట్టుకోవడం మంచిది. మీరు పనిలో బిజీగా ఉన్నప్పుడు, రాత్రి పడుకునే సమయానికి వీటిని సెట్ చేసుకోవాలి. దీంతో మొబైల్‌పై భారం తక్కువగా పడుతుంది. అనవసరంగా నోటిఫికేషన్లు రావు. బ్యాటరీ చార్జింగ్ సైతం వృధా కాదు.
ఎయిర్ప్లయిన్ మోడ్:
సిగ్నల్ సరిగ్గా లేనప్పుడు మొబైల్‌ను ఎయిర్ప్లయిన్ మోడ్‌లో ఉంచుకోవాలి. ఎందుకంటే సిగ్నల్ లేని సమయంలో బ్యాటరీపై భారం పడతుంది. దీంతో ఫోన్ చార్జింగ్ తొందరగా అయైపోతుంది. వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఫోన్‌ను ఎయిర్ప్లయిన్ మోడ్‌లో ఉంచడం మరవద్దు.
సౌండ్లు వైబ్రేషన్లు:
కీబోర్డ్ సౌండ్లు, వైబ్రేషన్లు కూడా మొబైల్ చార్జింగ్ దిగిపోవడానికి కారణం. పక్కవారికి ఇది అసౌర్యంగానూ ఉంటుంది. కాబట్టి కీబోర్డ్ సౌండ్లు, వైబ్రేషన్లు ఆఫ్ చేయడం మంచిది
అవసరం లేని యాప్‌లు:
మనం మొబైల్లో ఎక్కవగా వాడని యాప్‌లో చార్జింగ్‌ను తగ్గిస్తాయి. కాబట్టి తక్కువగా వాడే, అసలు అవసరమే లేని యాప్‌లు డిలీట్ చేయాలి.
వైఫై, బ్లూటూత్‌లను ఆన్‌లోనే ఉంచండి:
ఫోన్లో చార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు వైఫై, బ్లూటూత్‌లను ఆన్‌లోనే ఉంచడం మంచిది. ఎందుకంటే పదే పదే వైఫై, బ్లూటూత్‌లను ఆన్, ఆఫ్ చేయడం వల్ల చార్జింగ్ అయిపోయో అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆన్ చేసిన ప్రతిసారి.. అవి సిగ్నలను అందుకోవలసి ఉంటుంది.