Gmail Confidential Mode: ఈ మధ్యకాలంలో దాదాపు అందరికి.. జీ-మెయిల్ అకౌంట్ ఉంటుందని చెప్పొచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా సున్నితమైన రహస్య సందేశాలు, అటాచ్మెంట్ ఫైల్స్ పంపించుకోవచ్చు. అయితే.. జీ-మెయిల్ ద్వారా సీక్రెట్ మెసేజ్‌లు పంపుకోవచ్చని మీకు తెలుసా? జీ-మెయిల్లో కాన్ఫిడెన్షియల్ మోడ్ ఫీచర్ ద్వారా ఈ సౌకర్యం పొందవచ్చు. ఈ మోడ్ అనధికారిక వ్యక్తులు, సంస్థల నుంచి సున్నితమైన సమాచారాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. మీరు పంపించే మెసేజ్‌లకు నిర్దేశిత గడవు తేదీని సెట్ చేయడానికి ఈ కాన్ఫిడెన్షియల్ మోడ్‌ని ఉపయోగించవచ్చు.. గడవు తేదీ ముందే.. ఆ యాక్సెస్‌ని ఉపసంహరించుకోవచ్చు. ఈ విధంగా పంపించిన సందేశాలు.. అవతలివారు ఫార్వార్డ్, కాపీ, ప్రింట్, డౌన్‌లోడ్ చేయకుండా.. డిజేబుల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది.
కంప్యూటర్, ఆండ్రాయిడ్, ఐఫోన్, ఐప్యాడ్ ద్వారా గోప్యంగా మెసేజ్‌లు, అటాచ్మెంట్లు ఎలా పంపాలో తెలుసుకుందాం..
కంప్యూటర్లో ఇలా..
1. కంప్యూటర్లో జీమెయిల్ ఓపెన్ చేయాలి.
2. కంపోజ్‌పై క్లిక్ చేయాలి.
3. విండోకు కిందన 'టర్న్ ఆన్ కాన్ఫిడెన్షియల్ మోడ్'ను క్లిక్ చేయాలి.
4. గడువు తేదీ, పాస్‌కోడ్‌ను సెట్ చేయాలి. ఈ సెట్టింగ్స్ మెసేజ్, అటాచ్మెంట్స్కు వర్తిస్తాయి.
5. మీరు 'నో ఎస్ఎంఎస్ పాస్‌కోడ్' ఎంచుకుంటే జీమెయిల్ యాప్‌ను ఉపయోగించేవారు మీ మెసేజ్‌ను నేరుగా తెరవవచ్చు. యాప్ లేకపోతే.. ఇ-మెయిల్ పాస్‌కోడ్‌ను పంపుతుంది. మీరు 'ఎస్ఎంఎస్ పాస్‌కోడ్' ఆప్షన్ ఎంచుకుంటే.. అవతలివారు పాస్‌కోడ్ టెక్ట్ మెసేజ్ రూపంలో వెళ్తుంది. అందుకు మేసేజ్ అందుకునేవారికి ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఎంటర్ చేయాలి.
6. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత సేవ్ చేయాలి.
ఆఫీసు ఖాతాతో జీ-మెయిల్‌ను ఉపయోగిస్తుంటే.. కాన్ఫిడెన్షియల్ మోడ్ ఫీచర్‌ను యాక్టివ్ చేయడానికి.. అడ్మిన్‌ను సంప్రదించాలి. వారి అనుమతితోనే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవడానికి వీలుపడుతుంది.
ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్లలో ఎలాగంటే..?
- జీ మెయిల్ యాప్‌ని ఓపెన్ చేయాలి.
- కంపోజ్ మీద ట్యాప్ చేయాలి.
- కుడివైపు మోర్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
- తర్వాత టర్న్ ఆన్ కాన్ఫిడెన్షియల్ మోడ్‌పై ట్యాప్ చేయాలి
- తర్వాత ప్రక్రియ అంతా పైన కంప్యూటర్లో సూచించిన విధంగానే వీటికి కూడా వర్తిస్తుంది.
- ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత డన్పై ట్యాప్ చేయాలి.
గడువు తేదీకి ముందే యాక్సిస్‌ను రిమూవ్ చేయండిలా..
మీరు గడువు తేదీకి ముందు మీ మెసేజ్ గ్రహీత ఇమెయిల్‌ను చూడకుండా కూడా ఆపవచ్చు.
ముందుగా కంప్యూటర్, ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్లలో (దేనిలో అయినా) జీ మెయిల్ ఓపెన్ చేయాలి.
కంప్యూటర్లో అయితే సెంట్పై క్లిక్ చేయాలి. ఆండ్రాయిడ్ ఫోన్, ఐఫోన్, ఐపాడ్, ట్యాబ్లెట్లలో అయితే మెనూపై ట్యాప్ చేయాలి. తర్వాత సెంట్పై ట్యాప్ చేయాలి.
కాన్ఫిడెన్షియల్ ఇ-మెయిల్ ఓపెన్ చేయాలి.
యాక్సిస్‌ను రిమూవ్ చేయాలి.
కాన్ఫిడెన్షియల్ మోడ్‌తో పంపిన ఇమెయిల్‌ను తెరవండిలా..
మీరు సందేశం అటాచ్మెంట్లను గడువు తేదీ వరకు లేదా సెండర్ యాక్సెస్‌ని తీసివేసే వరకు చూడవచ్చు. ఇమెయిల్‌ను తెరవడానికి మీరు పాస్‌కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది.
గమనిక
అయితే ఈ కన్ఫిడెన్షియల్ మోడ్ ద్వారా పంపిన సందేశాలను ఇతరులకు షేర్ చేయకుండా నిరోధించే అవకాశముంది. అంతేకాని.. స్క్రీన్ షాట్స్, ఫోటోలు తీయకుండా ఆపడానికి వీల్లేదని గుర్తుంచుకోవాలి.
ఇదీ చూడండి: Google Chrome: ధరలు మారితే గూగుల్ క్రోమ్ చెప్పేస్తుందిలా..!