Search Engine Cyber Security : ఏదైనా తెలియని విషయాన్ని తెలుసుకునేందుకు సెర్చింజన్లపై ఆధారపడతాం. లేదంటే వస్తువు కొనుగోలు చేసేందుకైన ఉపయోగిస్తాం. అయితే వీటిని వినియోగించే సమయంలో ఏమాత్రం మనం ఏమరుపాటుగా ఉన్నా కేటుగాళ్లకు చిక్కినట్లే అవుతుంది. అనంతరం మీకు తెలియకుండానే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు మాయం అవుతాయి. మీ అనుమతి లేకుండానే మీ వ్యక్తిగత వివరాలు చోరీకి గురవుతాయి.
Steps To Prevent Cyber Attacks : మనం ఏదైనా విషయాన్ని గురించి సెర్చ్ చేసినప్పుడు మనకు 'స్పాన్సర్డ్' పేరిట తొలుత కొన్ని వెబ్‌పేజీలు దర్శనమిస్తాయి. అఫీషియల్ వెబ్‌సైట్లతో పాటు స్కామర్లు కూడా వీటిని కొనుగోలు చేసే వీలుంది. దీంతో వారి వెబ్‌పేజ్‌లు సైతం అగ్రస్థానంలో కనిపించే అవకాశం ఉంటుంది. ఈ కేటుగాళ్లు క్రియేట్ చేసే వెబ్‌పేజ్‌లు.. మాల్‌వేర్‌తో ఉంటాయి. ఈ విషయం విస్మరించి ఆ వెబ్‌పేజీ వినియోగిస్తే.. మన పర్సనల్ డేటా వారి చేతికి అందించినట్లే అవుతుంది. ఇలాంటివి జరగకుండా పడాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాలి.
1. సులభంగా డబ్బును ఆర్జీంచేందుకు చాలా మంది ఆన్‌లైన్‌లోనే అన్వేషిస్తుంటారు. ఇలాంటి విషయాలే సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతున్నాయి. ఎక్కువ మొత్తంలో బోనస్‌లు, అధిక స్థాయిలో సంపాదన ఉంటుందని కేటుగాళ్లు ఊరిస్తుంటారు. వాస్తవానికి దూరంగా ఇలాంటి ఆఫర్లు ఉన్నాయని అనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి సైబర్ మోసాల వలలో చిక్కొద్దు.
Smishing Scams : మెసేజ్‌తో బురిడీ కొట్టించే కొత్తరకం స్కామ్.. క్లిక్ చేస్తే మీ డేటా మటాష్!
2. మనం కొన్నిసార్లు కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ ఇంజిన్ సాయంతో వెతికుతుంటాం. ఇలాంటి సమయాల్లో ఫేక్ నంబర్లు కూడా కనిపిస్తుంటాయి. అందుకే వ్యాపార సంస్థలు, కంపెనీలు ఇలా ఎవరి నంబర్లు కావాలన్నా.. వారి అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి తెలుసుకోవడం మంచిది.
3. సిబిల్ స్కోర్, సిబిల్ రిపోర్ట్ ఫ్రీ తెలుసుకోవచ్చంటూ అనేక ఫేక్ వెబ్‌సైట్లు దర్శనమిస్తుంటాయి. అందుకే వీటిని అస్సలు వినియోగించకోవద్దు. ఆర్బీఐ ఆమోదించిన క్రెడిట్ బ్యూరోల ద్వారా మాత్రమే క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవాలి. అలాంటప్పుడే మన వ్యక్తిగత డేటా చోరీ కాకుండా ఉంటుంది.
Smartphone Security Tips : స్మార్ట్‌ఫోన్‌ను వాలెట్‌లా వాడుతున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!