యూజర్స్‌కి మెరుగైన సేవలు అందించడంలో వాట్సాప్ ఎప్పుడూ ముందుంటుంది. ఇటీవల బీటా వెర్షన్‌లో అల్వేస్ మ్యూట్, స్టోరేజ్ యుసేజ్, మీడియా గైడ్‌లైన్స్‌ని తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. వీటిలో క్యాట్‌లాగ్ షార్ట్‌కట్, న్యూ అటాచ్‌మెంట్ ఐకాన్స్ ఉన్నాయి. న్యూ అటాచ్‌మెంట్ ఐకాన్స్ పలువురు డెస్క్‌టాప్ యూజర్స్‌కి అందుబాటులోకి రాగా త్వరలోనే పూర్తి స్థాయిలో తీసుకురానున్నారు.
పూర్తిగా బిజినెస్ ఛాట్కోసం క్యాట్‌లాగ్..
ఇక క్యాట్‌లాగ్ షార్ట్‌కట్ ఫీచర్ పూర్తిగా బిజినెస్ ఛాటింగ్ కోసమని తెలుస్తోంది. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వాట్సాప్ బిజినెస్ యాప్ యూజర్స్‌కి ఇది అందుబాటులో ఉంది. సాధారణ యూజర్స్‌కి అందుబాటులోకి వచ్చాక యాప్ కుడివైపు పైభాగంలో కాల్, వీడియో కాల్ బటన్ పక్కనే క్యాటలాగ్ బటన్ కనిపిస్తుంది. అలానే డెస్క్‌టాప్ వెర్షన్‌లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ వెబ్‌లో అటాచ్‌మెంట్‌పై క్లిక్ చేస్తే కెమెరా, గ్యాలరీ ఐకాన్స్ కొత్త రంగుల్లో కనిపిస్తాయి. గ్యాలరీ పర్పుల్ కలర్‌లో, కెమెరా పింక్ కలర్‌లో ఉంటాయి.
ఇదీ చూడండి:'కార్డు' లాభాలను అస్సలు వదులుకోవద్దు!