ETV Bharat / science-and-technology

'వాట్సాప్​కు బై- టెలిగ్రామ్, సిగ్నల్​కు జై!' - టెలిగ్రామ్‌ డౌన్‌లోడ్‌లు

వాట్సాప్‌ నూతన వ్యక్తిగత గోప్యత విధానం పోటీ సంస్ధలకు వరంగా మారింది. నిన్న మొన్నటి వరకు వాట్సాప్​లో మునిగి తేలిన జనం.. ఒక్కసారిగా దాన్ని వీడుతున్నారు. దీంతో టెలిగ్రామ్​, సిగ్నల్​ వంటి సంస్థల డౌన్​లోడ్లు భారీగా పెరిగిపోతున్నాయి.

WhatsApp Signal Telegram parlour
వాట్సాప్‌ దెబ్బకు ఇతర యాప్​లకు జై
author img

By

Published : Jan 14, 2021, 5:42 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు అనుసంధానించడం సహా పలు మార్పులతో గోప్యత పాలసీని ప్రకటించిన నేపథ్యంలో వాట్సప్ యాప్‌ డౌన్‌లోడ్‌లపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారం క్రితం కోటి 27లక్షలు ఉన్న వాట్సాప్‌ డౌన్‌లోడ్‌లు ప్రస్తుతం కోటి 6 లక్షలకు పడిపోయాయి.

వాటికి వరమే..

వాట్సాప్‌ పోటీ సంస్ధ సిగ్నల్‌ డౌన్‌లోడ్‌లు గత ఏడాది డిసెంబర్‌ 29 నుంచి ఈ నెల 5 మధ్య 61 రెట్లు పెరిగిపోయాయి. డిసెంబర్‌ 29-జనవరి 5 మధ్య 2లక్షల 85 వేల యాప్‌ డౌన్‌లోడ్‌లు కాగా.. జనవరి 5-12 మధ్య ఏకంగా కోటీ 78లక్షలు అయ్యాయి.

మరో పోటీ సంస్థ టెలిగ్రామ్‌ సైతం డౌన్‌లోడ్‌లలో దూసుకుపోతోంది. 76లక్షల నుంచి కోటి 57లక్షలు పెరిగాయని 'సెన్సార్ టవర్' సంస్థ తెలిపింది.​ ఈ మార్పు ఫేస్‌బుక్, ట్విట్టర్​కు ప్రత్యామ్నాయాలను కోరుకునే వినియోగదారుల అభిరుచిని ప్రతిబింబిస్తోందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: టెలిగ్రామ్@500 మిలియన్​ డౌన్​లోడ్లు

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.