ETV Bharat / science-and-technology

టెలిగ్రామ్​లో వీడియో కాల్​ సహా అదిరే కొత్త ఫీచర్లు - టెలిగ్రామ్​ల కొత్త ఈమోజీలు

మెసేజింగ్ యాప్​ టెలిగ్రామ్ కొత్త ఫీచర్లను ఆవిష్కరించింది. వీడియో కాల్​ ఫీచర్​ను సాధారణ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. వీటితో పాటు మరిన్ని కొత్త ఫీచర్లు ఇలా ఉన్నాయి.

video call feature in Telegram
టెలిగ్రామ్​లో వీడియో కాల్
author img

By

Published : Aug 16, 2020, 5:17 PM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ప్రముఖ మెసేజింగ్ యాప్​ టెలిగ్రామ్​.. వాట్సాప్​కు పోటీగా వీడియో కాల్ ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇప్పటికే బీటా యూజర్లు ఈ ఫీచర్​ వినియోగిస్తుండగా.. టెలిగ్రామ్​ 7.0 వెర్షన్​తో అన్ని రకాల యూజర్లు ఈ ఫీచర్​ వాడుకునే సదుపాయం కల్పించింది.

తమ కాంటాక్ట్​ లిస్ట్​లో ఉన్న వ్యక్తి ప్రొఫైల్​పై క్లిక్ చేస్తే అందులో వీడియో కాల్​ ఫీచర్​ కనిపిస్తుందని టెలిగ్రామ్ తెలిపింది. వాయిస్ కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఏ సమయంలోనైనా వీడియో ఆన్​, ఆఫ్​ చేసేందుకు అవకాశముందని వెల్లడించింది. మెసేజ్​లలానే.. వీడియో కాల్స్​ కూడా ఎండ్-టూ-ఎండ్​ ఎన్​ప్షన్​ సదుపాయంతో సురక్షితంగా ఉంటాయని స్పష్టం చేసింది.

ఆగస్టు 14 నాటికి టెలిగ్రామ్ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వీడియో కాల్​తో పాటు.. అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. కదిలే ఎమోజీలు, ప్రొఫైల్​ వీడియో, 2 జీబీ వరకు ఫైళ్లను పంపించుకునే సదుపాయాలు వీటిలో ప్రధానమైనవి.

టెలిగ్రామ్ వీడియో కాల్​

ఇదీ చూడండి:'ఫింగర్​ప్రింట్​'కు కాలం చెల్లు- ప్రత్యామ్నాయాలవైపు చూపు!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.