కరోనా కాలంలో ఫేస్ మాస్క్ అత్యవసర యాక్సెసరీగా మారిపోయింది. అయితే కళ్లజోడు పెట్టుకుని మాస్క్ పెట్టుకుంటే మనం వదిలే ఊపిరి కళ్లద్దాలమీదకు వెళ్లి మసకగా అయిపోతుంటుంది. అలాగే ముక్కుని మాస్కులో బంధించడం వల్ల ఆక్సిజన్ కూడా సరిపడా అందక అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. అందుకే ఎల్‌జీ కంపెనీ ప్యూరికేర్ వేరబుల్ పేరుతో సరికొత్త ఫిల్టర్ మాస్క్‌ను డిజైన్ చేసింది.
ఇందులో అమర్చిన రెండు ఫ్యాన్లు తీసుకున్న- వదిలిన గాలిని శుభ్రం చేయడంతోబాటు, ఆ ఊపిరి అద్దాలమీదకు వెళ్లకుండా చేస్తుంది. యూవీకాంతితో పనిచేసే దీని బ్యాటరీ, మాస్కుని ఎప్పటికప్పుడు డిజ్‌ఇన్ఫెక్ట్ చేస్తుంటుంది. అలానే మాస్కుతోబాటు వచ్చే బాక్సు ద్వారా బ్యాటరీల్ని ఛార్జ్ చేసుకోవచ్చట. త్వరలోనే మార్కెట్టులోకి రానున్న ఈ మాస్క్ ధర ఎంత ఉంటుందనేది ఇంకా కంపెనీ నిర్ణయించలేదు మరి.
ఇవీ చూడండి: టీకాల అమలులో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో తెలంగాణ!