ETV Bharat / science-and-technology

'సెప్సిస్‌'ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ!

మానవ శరీరంలో ఏర్పడి, రక్తం ద్వారా శరీర భాగాలన్నింటికీ వ్యాపించే సెప్సిస్​ ఇన్​ఫెక్షన్​ను గుర్తించే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఐఐటీ మద్రాస్​ పరిశోధకులు. ఈ రకమైన ఇన్​ఫెక్షన్​ సోకినప్పుడు సంబంధిత వ్యక్తి శరీరం.. తీవ్ర ప్రతిస్పందనలకు గురై, ప్రాణాపాయమూ సంభవించే అవకాశముంది. ఇలాంటి ఇన్​ఫెక్షన్​ను ముందుగానే పసిగట్టే అధునాతన సాంకేతికతను కనుగొన్నారు చెన్నై నిపుణులు. అయితే.. తదుపరి పరిశోధనల కోసం కంపెనీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.

author img

By

Published : Oct 16, 2020, 12:09 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

IIT MADRAS FOUND THE DEVICE TO DIAGNOSE SEPSIS
'సెప్సిస్‌'ను ముందుగానే గుర్తించే టెక్నాలజీ!

ప్రమాదకరమైన సెప్సిస్‌ను ముందుగానే పసిగట్టే మరో అధునాతన సాంకేతికతను అభివృద్ధి చేశారు ఐఐటీ మద్రాస్​ పరిశోధకులు. వ్యక్తి శరీరంలో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌, రక్తం ద్వారా ఒళ్లంతా వ్యాపించే పరిస్థితినే సెప్సిస్‌గా వ్యవహరిస్తారు. ఎవరికైనా ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు వారి శరీరం తీవ్రంగా ప్రతిస్పందించడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమస్య తీవ్రమైతే అవయవాలు విఫలమై ప్రాణాపాయం సంభవించే ఆస్కారమూ ఉంటుంది. ఇలాంటి ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి చికిత్స చేయడం ద్వారా వ్యక్తి ప్రాణాలను రక్షించే వీలుంటుంది. దీనిలో భాగంగానే చెన్నై పరిశోధకులు నూతన సాంకేతికతను అభివృద్ధి చేశారు.

గ్యాసో ట్రాన్స్​మిటర్ల పర్యవేక్షిస్తూ..

'మైక్రో ఫ్లూయిడ్‌ చిప్‌' ఆధారంగా పనిచేసే ఈ పరికరాన్ని.. ధ్వని తరంగాలు, కెమికల్‌ ప్రోబ్స్‌, మైక్రోఫ్లూయిడ్‌ మిక్సర్‌తోపాటు రియాక్టర్‌ సాయంతో రూపొందించారు. వీటికి అనుసంధానంగా ఉండే లేజర్‌ సాయంతో రక్తం(ప్లాస్మా)లో ఉండే అణువుల స్థాయిలను అంచనా వేస్తుంది. ముఖ్యంగా గ్యాసో ట్రాన్స్​మిటర్లుగా పిలిచే ప్లాస్మాలోని హైడ్రోజన్‌ సల్ఫైడ్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, నైట్రిక్‌ ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సైడ్‌ల స్థాయిలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. ఇలా బయోమేకర్లుగా పనిచేస్తూ సెప్సిస్‌ను ముందస్తుగా పసిగట్టి హెచ్చరిస్తుంది. కొందరు రోగుల్లో సర్జరీ సమయంలో ఒక్కోసారి ఇన్‌ఫ్లమేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో గ్యాసో ట్రాన్స్​మిటర్ల స్థాయిలను అంచనా వేయడం కూడా ఎంతో ముఖ్యం. ఈ నూతన పరిజ్ఞానం ద్వారా ఈ తరహా సమస్యను కూడా ముందే పసిగట్టవచ్చని ఈ పరికరాన్ని రూపొందించిన పరిశోధకులు స్పష్టంచేశారు.

భాగస్వామ్యం కోసం..

ప్రస్తుతమున్న పరిజ్ఞానంతో సెప్సిస్‌ పరిస్థితిని నిర్ధరించేందుకు దాదాపు 48 గంటల సమయం పడుతోంది. దీనిలో రక్త పరీక్షలతోపాటు వైద్య సిబ్బంది ప్రమేయం కూడా కావాల్సి వస్తోంది. నిరంతరాయంగా పర్యవేక్షించే సాంకేతికత అందుబాటులో లేదు. వీటిని అధిగమించేందుకే ఇలాంటి నూతన పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఈ పరికరం పేటెంట్‌ హక్కుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు పరిశోధన బృందం వెల్లడించింది. ఇప్పటికే జంతువులపై పరీక్షించిన ఈ సాంకేతికతను తయారుచేయడానికి కంపెనీ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది.

5 కోట్ల మందిలో ఒకరికి సెప్సిస్​!

కేవలం ఒక్క 2017 ఏడాదిలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 కోట్ల మందిలో సెప్సిన్‌ను గుర్తించారు. అంతేకాకుండా ఈ పరిస్థితి ఎదుర్కొన్న ప్రతి ఐదుగురిలో ఒకరు మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అందువల్లే.. నిరంతర పర్యవేక్షణ, కృత్రిమ మేధ సాయంతో సెప్సిస్‌ తొలిదశలోనే గుర్తించే సాంకేతికత కోసం ముమ్మర కృషి జరుగుతోంది.

ఇదీ చదవండి: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ వివరాలు కోరిన డీసీజీఐ

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.