ETV Bharat / science-and-technology

ఆండ్రాయిడ్ 11 అప్​డేట్​ వచ్చేసింది- మీ ఫోన్లకు ఎప్పుడంటే! - ఆండ్రాయిడ్ 11 ఫోన్ అప్​డేట్​ ఏ ఫోన్లలో ఎప్పుడు

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ గుడ్​ న్యూస్ చెప్పింది. యూజర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 11 ఓఎస్​ అప్​డేట్​ను ఎట్టకేలకు విడుదల చేసింది. ప్రస్తుతానికి ఎంపిక చేసిన ఫోన్లకే అందుబాటులోకి వచ్చింది ఈ అప్​డేట్. మరి మీ ఫోన్లకు ఈ అప్​డెట్ ఎప్పుడొస్తుందో తెలుసుకోండి ఇప్పుడే.

Android 11 features
ఆండ్రాయిడ్ 11 ఫీచర్లు
author img

By

Published : Sep 14, 2020, 11:34 AM IST

Updated : Feb 16, 2021, 7:31 PM IST

ఆండ్రాయిడ్‌ యూజర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను ఎట్టకేలకు గూగుల్ విడుదల చేసింది. దీనితో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా తమ వినియోగదారులకు ఈ ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రస్తుతానికి ఎంపిక చేసిన మోడళ్లలో మాత్రమే ఈ ఓఎస్‌ అప్‌డేట్ చేస్తున్నారు. తర్వాతి తరం ఓఎస్‌గా పేరొందిన ఆండ్రాయిడ్‌ 11లో మీడియా కంట్రోల్స్‌ నుంచి మెసేజింగ్ వరకు ఎన్నో రకాల కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు.

ఇంతకీ మీ ఫోన్లలో అప్‌డేట్‌ ఎప్పుడు?

  • ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌ పిక్సెల్2తో పాటు వన్‌ప్లస్, షియోమీ, ఒప్పో, రియల్‌మీ ఫోన్లలో అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది.
  • మీరు పిక్సెల్‌ ఫోన్‌ వాడుతుంటే సిస్టంలో అడ్వాన్స్‌డ్‌లోకి వెళ్లి సిస్టం అప్‌డేట్‌లో చెక్‌ ఫర్‌ అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. ఒక వేళ అప్‌డేట్ అందుబాటులో ఉంటే మీకు స్క్రీన్‌పై చూపిస్తుంది. అప్‌డేట్ రాకపోతే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
  • వన్‌ప్లస్‌ మాత్రం త్వరలో రాబోయే కొత్త ఫోన్లతో పాటు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 8, 8 ప్రో మోడల్స్‌లో ఓఎస్‌ అప్‌డేట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఆక్సిజన్‌ ఓఎస్‌ 11 అప్‌డేట్ పేరుతో కొత్త ఓఎస్‌ను అందిస్తుంది.
  • నోకియా కూడా త్వరలోనే ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను తమ యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది.
  • మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఒప్పో సెప్టెంబరు 14న కలర్ ఓఎస్‌ 11 పేరుతో విడుదలచేయనుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌ను ఫైండ్ ఎక్స్‌2, ఫైండ్‌ ఎక్స్‌2 ప్రో, రెనో3, రెనో3 ప్రో మోడల్స్‌కు అప్‌డేట్‌ ఇచ్చారు.
  • షియోమీ కూడా ఎంఐ 10, ఎంఐ 10 ప్రో మోడల్స్‌లో ఆండ్రాయిడ్ 11ని ఎంఐయుఐ 12 పేరుతో పరిచయం చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
  • అలానే శాంసంగ్ కూడా చైనా, జర్మనీ, ఇండియా, పోలండ్, బ్రిటన్‌ వంటి దేశాల్లో గెలాక్సీ సిరీస్‌లో ఎంపిక చేసిన మోడల్స్‌కి అప్‌డేట్‌ ఇస్తున్నట్లు వెల్లడించింది.
  • జియోనీ, మోటోరోలాతో పాటు ఇతర మొబైల్‌ కంపెనీలు ఆండ్రాయిడ్‌ 11పై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.

ఇదీ చూడండి:మైక్రోసాఫ్ట్​ను కాదని ఒరాకిల్​కు టిక్​టాక్ విక్రయం!

Last Updated : Feb 16, 2021, 7:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.